ప్రభాతదర్శిని, (పొదలకూరు – ప్రతినిధి):ఇంటర్మీడియట్ ప్రథమ ,ద్వితీయ సంవత్సరాలకు సంబంధించి శనివారం విడుదలైన ఫలితాలలో తమ విద్యార్థులు స్టేట్ ర్యాంకులు సాధించారని పొదలకూరు లోని విజ్ఞాన్ జూనియర్ కాలేజీ నిర్వాహకులు పేర్కొన్నారు. ప్రధమ సంవత్సరం ఫలితాల్లో ఎంపీసీ గ్రూపులో దేవళ్ళ నిత్యకృతిక 470 మార్కులకు గాను 465 మార్కులు సాధించి మండల ప్రథమ స్థానంలో‌ నిలిచింది. అలాగే షేక్ తస్లీమా, వి హేమంత్ 464 మార్కులు సాధించి మండల సెకండ్ గా నిలిచారు జీ సాయి కీర్తి 460 మార్కులతో‌ మండల తృతీయ స్థానంలో నిలువగా, జీ.లిఖిత, కె.హర్షవర్ధన్ 459 మార్కులతో మండల చతుర్ధ స్థానాలు కైవసం చేసుకున్నారు. జూనియర్ సీఈ సీ గ్రూపు నందు 500 మార్కులకుగాను అచ్చి. నందిని 453మార్కులతో మండల ఫస్ట్ సాధించగా, రాపూరు రమ్య 441 మార్కులతో మండల ద్వితీయ స్థానం సాధించారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో ఎంపీసీ గ్రూపు నందు 1000 మార్కులకు గాను ఎస్ .కార్తిక్ 981 మార్కులు, షేక్.సమీర్ 980 మార్కులు, టీ.వీ కార్తిక్ 975 మార్కులతో మండల ద్వితీయ, తృతీయ, చతుర్థ స్థానాలను కైవసం చేసుకున్నారు. బై పి సి గ్రూప్ నందు షేక్ సజన 440 మార్కులకు గాను 387 మార్కులతో కళాశాల ప్రథమ స్థానం పొందింది. సీనియర్ సీఈసీ నందు 914 మార్కులతో వి అభిషేక్, బైపీసీ నందు 854 మార్కులతో ప్రవళిక కళాశాల ప్రథమ స్థానంలో నిలిచారు.38 మందికి పైగా విద్యార్థులు 400 పైగా మార్పులు సాధించారని వెల్లడించారు ఘన విజయం సాధించిన విద్యార్థులను కళాశాల యాజమాన్యం కాలేజీలో ఏర్పాటు చేసిన ఒక సమావేశంలో అభినందించింది. ఈ సందర్భంగా విజేతలైన విద్యార్థులు మాట్లాడుతూ కళాశాల యాజమాన్యం ప్రోత్సాహం, అధ్యాపకుల అంకిత భావంతో కూడిన చక్కటి విద్యా బోధనతో తాము ఈ ర్యాంకులు సాధించ గలిగామని తెలిపారు. కళాశాల నిర్వాహకులు మాట్లాడుతూ తమ విద్యార్థులు మండల స్థాయిలో ఉత్తమ ర్యాంకులు సాధించడం గర్వకారణంగా ఉందన్నారు. ఉత్తమ ఫలితాలతో తమ కాలేజీ అభివృద్ధికి సహకరిస్తున్న విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ ఎం.సుధాకర్ రెడ్డి, ప్రిన్సిపాల్ ఎ.సుబ్బారావు, డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్ జీ.ఎన్ రెడ్డి,అకడమిక్ ఇన్ ఛార్జ్ కృష్ణ,వైస్ ప్రిన్సిపాల్ ఏ.చంద్రశేఖర్ అధ్యాపకులు పాల్గొన్నారు.