(ఎస్పీ బీవీడీ కళాశాల అనుబంధ సంస్థ)
ప్రభాతదర్శిని,( పొదలకూరు-ప్రతినిధి): శనివారం విడుదలైన ఇంటర్ పరీక్ష ఫలితాల్లో పొదలకూరులోని సాయి విద్యానికేతన్ విద్యార్థులు ప్రభంజనాన్ని సృష్టించారు. ఆ కళాశాల లో ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఎంపీసీ గ్రూపు చదువుతున్న జి. ప్రహ్లాద్ కుమార్ 1000 మార్కులు గాను 988 మార్కులు సాధించి పొదలకూరు మండలం లో ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. అలాగే ఎక్కువ మంది విద్యార్థులు 400 మార్కులు పైగా సాధించి విజయభేరి మోగించారు. ఇంత ఘనవిజయాన్ని సాధించిన విద్యార్థులకు ఆ కళాశాల చైర్మన్ బి. వెంకటేశ్వర్లు, మేనేజింగ్ డైరెక్టర్ తూపిలి. నరేందర్ రెడ్డి ఘన విజయం సాధించిన విద్యార్థులకు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. ఆ కళాశాల ప్రిన్సిపాల్ కొండాపురం కోటేశ్వరరావు, అధ్యాపక బృందం, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.