ఎంజిఎం డైరెక్టర్ గుడ్లూరు మయూర్ వెల్లడి
ప్రభాతదర్శిని ( శ్రీకాళహస్తి-ప్రతినిధి ): 2025 సంవత్సరం ఇంటర్మీడియట్ పబ్లిక్ ఫలితాలలో శ్రీకాళహస్తి ఎంజిఎం జూనియర్ కాలేజీ విద్యార్థులు రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించారని ఎంజిఎం డైరెక్టర్ గుడ్లూరు మయూర్ వెల్లడించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించిన విద్యార్థులు,వారి తల్లిదండ్రులతో అభినందన సభ ఏర్పాటు చేసామన్నారు. అనంతరం డైరెక్టర్ మయూర్ మాట్లాడుతూ సీనియర్ ఇంటర్ ఎంపీసీ విభాగంలో 1000 మార్కులకు గాను ఎస్ . సాయి ప్రణవి 988 మార్కులు, బైపీసీ విభాగంలో ఎస్ . బిందు వైష్ణవి 979 మార్కులు, సీఈసీ విభాగంలో కే . లోహిత 958 మార్కులు సాధించారని, అలాగే జూనియర్ ఇంటర్ ఎంపీసీ విభాగంలో 470 మార్కులకుగాను A. భావన 467 మార్కులు, బైపీసీ విభాగంలో 440 మార్కులకుగాను కే.జ్యోతి కుమార్ హాసిని ప్రియ 434 మార్కులు, సీఈసీ విభాగంలో 500 మార్కులకు గాను జి . కిషోర్ 490 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించారని మొత్తం ఎంజిఎం కాలేజీ విద్యార్థుల్లో 95 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలేజీ ప్రిన్సిపాల్ వి . ఎస్ . రత్నం, లెక్చరర్లు విద్యార్థులు మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు.