శాఖల్లో దస్త్రాల నిర్వహణపై మంత్రులకు శిక్షణ
త్వరలో శాఖలవారీ శ్వేతపత్రాలు విడుదల!
ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి): విధులు నిర్వహణలో కొందరి అధికారులతో జాగ్రత్తగా ఉండాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు హెచ్చరించారు. గురువారం తన చాంబర్లో ముఖ్యమంత్రి పదవి చేపట్టిన అనంతరం ఆయన మాట్లాడుతూ శాఖల్లో దస్త్రాల నిర్వహణపై మంత్రులకు త్వరలో శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. అలాగే త్వరలో శాఖలవారీ శ్వేతపత్రాలు విడుదల చేస్తామని చెప్పారు.
శాఖల్లో దస్త్రాలు ఎలా నిర్వహించాలి? ఏం చేయాలి? ఏం చేయకూడదు?’ అనే అంశాలపై మంత్రులకు శిక్షణ ఇప్పిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు అమాత్యులతో అన్నారు. శాఖలవారీ శ్వేతపత్రాలు రూపొందించి ప్రజల ముందుంచుదామని ఆయన అన్నారు. మరోవైపు ఏ మంత్రికి ఏ శాఖ అనే దానిపై కసరత్తు పూర్తి చేసి వారికి బాధ్యతలు కేటాయించనున్నారు. శాఖల్లో దస్త్రాలు ఎలా నిర్వహించాలి? ఏం చేయాలి? ఏం చేయకూడదు?’ అనే అంశాలపై మంత్రులకు శిక్షణ ఇప్పిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు అమాత్యులతో అన్నారు. శాఖలవారీ శ్వేతపత్రాలు రూపొందించి ప్రజల ముందుంచుదామని ఆయన అన్నారు. మరోవైపు ఏ మంత్రికి ఏ శాఖ అనే దానిపై కసరత్తు పూర్తి చేసి నేడు వారికి బాధ్యతలు కేటాయించనున్నారు.
శాఖల వారీ శ్వేతపత్రాలు విడుదల: రోజువారీ కార్యకలాపాల్లో మంత్రులకు సహకరించేందుకు ఎంబీఏ అర్హత కలిగిన వారిని నియమిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు అమాత్యులతో అన్నారు. ప్రమాణ స్వీకారం అనంతరం ఉండవల్లి నివాసంలో తనను కలిసిన మంత్రులతో ఆయన గంటకుపైగా మాట్లాడారు. శాఖల వారీ శ్వేతపత్రాలు సిద్ధం చేసి ప్రజల ముందు ఉంచుదామని, జగన్ హయాంలో రివర్స్ విధానాలు, అరాచకాల్ని వారికి వివరిద్దామని చెప్పారు.
ప్రతి ఫైలును క్షుణ్ణంగా పరిశీలించాకే సంతకం: గత ప్రభుత్వంలోని మంత్రుల వద్ద పని చేసిన పీఏలను నియమించుకోవద్దని సూచించారు. ముఖ్యంగా ఓఎస్డీలు, పీఏ, పీఎస్‌ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని చంద్రబాబు సూచించారు. జగన్ ప్రభుత్వంలో మంత్రుల వద్ద పని చేసిన సిబ్బందిని దరి చేరనివ్వద్దని స్పష్టం చేశారు. తమ పని తీరు ద్వారా మంత్రిత్వ శాఖలకు వన్నె తేవాల్సిన బాధ్యత మంత్రులదేనని చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రజలకు సేవ చేయడానికి ఇదో అపూర్వ అవకాశమని, మరింత కష్టపడి పని చేసి మంచి పేరు తెచ్చుకోవాలని దిశానిర్దేశం చేశారు. ప్రతి ఫైలును క్షుణ్ణంగా పరిశీలించాకే సంతకం పెట్టాలని సూచించారు.
మంత్రులదే కీలక బాధ్యత: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, నవ్యాంధ్ర తొలి ముఖ్యమంత్రిగా తాను ఎదుర్కొన్న సవాళ్లు, అప్పటి రాజకీయ, సామాజిక, ఆర్థిక పరిస్థితుల్ని ప్రస్తుత పరిస్థితులను మంత్రులకు వివరించారు. జగన్ నాశనం చేసిన వ్యవస్థల్ని ప్రక్షాళన చేస్తూ రాష్ట్ర పునర్నిర్మాణంలో మంత్రులది కీలక బాధ్యత కావాలని దిశానిర్దేశం చేశారు. పరిపాలనలో తీసుకోవాల్సిన జాగ్రత్తలుపై మంత్రులకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. కేటాయించిన శాఖకు పూర్తి స్థాయి న్యాయం చేయాల్సిన బాధ్యత వారిదే అని తేల్చి చెప్పారు. అధికారులతో సమన్వయం చేసుకుంటూ శాఖాపరంగా ప్రజలకు చేకూర్చాల్సిన లబ్ధిపై దృష్టి పెట్టాలని సూచించారు.
రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలి: మంత్రుల్లో చాలా మంది ఉన్నత విద్యావంతులు, యువకులు ఉన్నారని, ఉత్సాహంగా పనిచేయాలని చంద్రబాబు సూచించారు. ప్రజలిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, తప్పులు జరగనివ్వద్దని స్పష్టం చేశారు. వ్యవస్థలను చక్కదిద్ది రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలని అన్నారు.