ప్రభాతదర్శిని, (తిరుపతి-ప్రతినిధి): తిరుపతి లోని సిమ్స్, రుయా ఆసుపత్రులను ఆరోగ్యశ్రీ ట్రస్టు సీఈఓ డా.జి. లక్ష్మీ శ పరిశీలించారు. ఆదివారం ఆయన స్విమ్స్ ఆసుపత్రి లో ఎమర్జెన్సీ వార్డ్ మరియు ఎమర్జెన్సీ ఐసియు వార్డు చికిత్స పొందుతున్న ఆరోగ్యశ్రీ రోగులను పరామర్శించారు. ఆరోగ్యశ్రీ సేవలు ఎలా అందుతున్నాయని రోగులను అడిగి తెలుసుకున్నారు. రోగులు ఆరోగ్య శ్రీ సేవలు ఉచితంగా అందుతున్నాయని సీఈఓ కి వివరించారు. అలాగే రేడియేషన్ థెరపీ ఆపరేషన్ థియేటర్నీ సందర్శించి పని తీరు తెలుసుకున్నారు. జిల్లా సమన్వయ అధికారి డాక్టర్ రాజశేఖర్ రెడ్డి మరియు జిల్లా మేనేజర్ శివకుమార్ సీఈఓ వెంట ఉన్నారు. అలాగే ఆరోగ్యశ్రీ టీం లీడర్స్ పురం శ్రీనివాసులు, సమాధి శ్రీనివాసులు, ఆరోగ్య మిత్రలు పాల్గొన్నారు. స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ ఆర్.వి కుమార్, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఆర్.రామ్, డాక్టర్ జయచంద్ర రెడ్డి, స్పెషల్ ఆఫీసర్ -ఆంకాలజీ అనంతరం సీఈఓ రుయా ఆస్పత్రిని సందర్శించి అక్కడ చికిత్స పొందుతున్న సర్జరీ రోగులను విచారించి రోగుల సమస్యలను అడగగా వైద్యం అంతా బాగా అందుతుందని రోగులు తెలిపారు. ఈ కార్యక్రమంలో రుయా ఆసుపత్రి సూపర్ ఇన్ టెండెంట్ డాక్టర్ రవి ప్రభు, డీఎం హెచ్ ఓ డాక్టర్ శ్రీహరి, డిప్యూటీ కలెక్టర్ భాస్కర నాయుడు, తదితరులు పాల్గొన్నారు.