ప్రభాతదర్శిని, ప్రత్యేక-ప్రతినిధి): అవినీతి పరులైన ప్రసన్న కుమార్ రెడ్డి, విజయసాయి రెడ్లకు ఓట్లడిగె అర్హత లేదన్నారు వేమిరెడ్డి దంపతులు. ఎన్డీఏ కూటమి నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారితో కలిసి కోవూరు ఎమ్మెల్యే అభ్యర్థిని వేమిరెడ్డి ప్రశాంతి బుచ్చిరెడ్డిపాళెం పట్టణంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. నెల్లూరు ఎంపీ, కోవూరు ఎమ్మెల్యే అభ్యర్థులైన వేమిరెడ్డి దంపతుల రాకతో బుచ్చిరెడ్డి పాళెం పసుపు మయమైంది. బుచ్చి పట్టణ ప్రధాన రహదారులన్ని జన సంద్రాన్ని తలపించాయి. మంగళ హారతులతో వేమిరెడ్డి దంపతులకు టిడిపి జనసేన మరియు బీజేపీ కార్యకర్తలు అఖండ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎన్డీఏ కూటమి నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడుతూ ఆత్మకూరు, కావలి, కందుకూరు, ఉదయగిరి ఎక్కడికెళ్లినా ఉత్సాహంగా ఉరకలేస్తున్న జనసందోహం చూస్తుంటే తెలుగుదేశం గెలుపుకు సంకేతంలా కనిపిస్తుందన్నారు. గత అయిదేళ్లుగా రాష్టంలో అభివృద్ధి జాడే లేదన్నారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే రాష్టం బాగుపడుతుందన్నారు. తనది క్లీన్చిట్ రాజకీయ జీవితమని తన ప్రత్యర్థి విజయసాయిరెడ్డిది ఛార్జ్ చార్జ్‌షీట్స్ పొలిటికల్ హిస్టరీ అన్నారు. సైకిల్ గుర్తుపై ఓట్లేసి కోవూరు ఎమ్మెల్యేగా శ్రీమతి ప్రశాంతి రెడ్డి గారిని ఎంపీగా తనను గెలిపించావాల్సిందిగా ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. అనంతరం కోవూరు ఎమ్మెల్యే అభ్యర్థిని ప్రశాంతి రెడ్డి మాట్లాడుతూ కోవూరును అవినీతిమయం చేసిన ప్రసన్నకు గానీ వైజాగ్‌లో భూకబ్జాలకు పాల్పడ్డ విజయసాయిరెడ్డికి గాని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని విమర్శించే అర్హత లేదన్నారు. రాచర్లపాడు వద్ద వున్న ఇఫ్కో భూములు, కోవూరు సమీపంలోని షుగర్ ఫ్యాక్టరీ భూములు కొల్లగొట్టేందుకే విజయ సాయిరెడ్డి నెల్లూరుకొచ్చారన్నారు. ప్రసన్నకు ధైర్యముంటే తాను అవినీతికి పాల్పడ లేదని నిరూపించగలరా అని ప్రశ్నించారు. నిజాయితీ నిస్వార్ధ రాజకీయాలకు మారు పేరైన విపిఆర్ గురించి అవాకులు పేలే ప్రసన్న, విజయసాయి రెడ్లకు ప్రజలు తగిన బిద్ధి చెప్పాలన్నారు. చెన్నూరు రోడ్డు విస్తరణలో దౌర్జన్యాలకు పాల్పడి ప్రజల ఆస్థులు ధ్వంసం చేసిన ప్రసన్న కుమార్ రెడ్డిని చిత్తు చిత్తుగా ఓడించాలని ప్రశాంతి రెడ్డి పిలుపు నిచ్చారు. తాను అవినీతిపై ప్రశ్నిస్తే ఫ్రస్టేషన్ పీక్స్ కు చేరి ప్రసన్న పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నడన్నారు. ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచానని చెప్పుకునే ప్రసన్న ప్రజాసమస్యలు తీర్చలేని అసమర్ధడన్నారు. ప్రసన్న అరాచక పాలన అంతమై కోవూరు నియోజకవర్గ వాసులు సుఖ శాంతులతో ఉండాలంటే సైకిల్ గుర్తుపై మీ పవిత్రమైన ఓట్లు వేసి తనను కోవూరు ఎమ్మెల్యేగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని నెల్లూరు పార్లమెంట్ సభ్యులుగా గెలిపించాలని ప్రశాంతి రెడ్డి ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.
అవినీతిపరులైన ప్రసన్న, సాయిరెడ్లకు ఓట్లడిగే అర్హత లేదు…. మహిళని గౌరవిచడం తెలియని సంస్కారహీనులు…వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి…నేను క్లీన్చిట్…విజయసాయిరెడ్డి చార్జ్‌షీట్…. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి
Related Posts
వి.ఎస్.యు. ఎన్.ఎస్.ఎస్. ప్రోగ్రామ్ అధికారులకు జిల్లా స్థాయి ప్రశంస పత్రాలు
ప్రభాతదర్శిని, (ప్రత్యేక- ప్రతినిధి):జిల్లాలో వివిధ విభాగాల్లో విశేషమైన సేవలు అందించిన ఉద్యోగులను 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా కలెక్టర్ ప్రశంసిస్తూ జిల్లా స్థాయి ప్రశంస పత్రాలను అందజేశారు. ఈ అవార్డుకు వి.ఎస్.యు ఎన్.ఎస్.ఎస్.కి చెందిన 5 ప్రోగ్రామ్ అధికారులు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా, ఉపకులపతి ఆచార్య ఎస్. విజయభాస్కర రావు ప్రశంసా పత్రాలను అందుకున్న ప్రోగ్రామ్ అధికారులను ప్రత్యేకంగా అభినందించారు. ఆయన మాట్లాడుతూ, “జాతీయ సేవా పథకం (ఎన్.ఎస్.ఎస్.)…
Read moreక్రీడలు శారీరిక మానసిక ఉల్లాసానికి అవసరం
ఇంటర్-కాలేజియేట్ టోర్నమెంట్ ముగింపులో ఎస్వీయూ వైస్ ఛాన్సలర్ప్రభాతదర్శిని, (ప్రత్యేక- ప్రతినిధి): క్రీడలు మానసిక ఉల్లాసానికి అవసరమని విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ఆచార్య ఎస్ విజయభాస్కరరావు అన్నారు. వెంకటాచలం మండలం కాకుటూరు లోని విక్రమ సింహపురి విశ్వవిద్యాలయంలో నిర్వహించిన ఇంటర్‌కాలేజియేట్ పురుషుల క్రీడల టోర్నమెంట్ ముగింపు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరై టోర్నమెంట్లో గెలుపొందిన జట్లకు బహుమతులు ప్రధానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “క్రీడలు…
Read more