కరెన్సీ నోట్లతో శ్రీ సత్యమ్మ తల్లి కి అలంకరణ..
ప్రభాతదర్శిని,(రేణిగుంట-ప్రతినిధి): దసరా నవరాత్రుల్లో భాగంగా రేణిగుంట మండలం భగత్ సింగ్ కాలనీ లో వెలసిన శ్రీ సత్యమ్మ తల్లికి శనివారం ఆలయ కమిటీ నిర్వాహకులు అమ్మవారికి కరెన్సీ నోట్లతో అమ్మవారిని అలంకరించారు. ప్రతి ఏటా నిర్వహించే దసరా నవరాత్రులలో చివరి రోజు కరెన్సీ నోట్లతో అమ్మవారిని అలంకరించడం పరిపాటి అయింది. ఈ సందర్భంగా ప్రత్యేక అతిథిగా శ్రీకాళహస్తిఎమ్మెల్యే బొజ్జల వెంకటసుధీర్ రెడ్డి సతీమణి బొజ్జల రిషిత రెడ్డి పాల్గొన్నారు. వీరికి ఆలయ కమిటీ సభ్యులు బొజ్జల రిషిత రెడ్డికి ఘన స్వాగతం పలికారు. అమ్మవారి ప్రాంగణంలోఅమ్మవారిముగ్గుని అత్యంత వైభవంగా మలిచారు. అమ్మవారి ముగ్గుపై రిషితా రెడ్డి జ్యోతులను ప్రారంభించి, అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటీ చైర్మన్ సదాశివ రెడ్డి ఆయన సతీమణి బొజ్జల రిషిత రెడ్డి కి సన్మానించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. భక్తులకు చీరలు, హారం గా అమ్మవారికి అలంకరించిన కరెన్సీ నోట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బొజ్జల రిషితా రెడ్డి మాట్లాడుతూ ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరిపై అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకున్నారన్నారు. ఈ కార్యక్రమంలోఆలయ కమిటీ సభ్యులు, తెలుగుదేశం నాయకులు, భక్తులు పాల్గొన్నారు.
అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలి : బొజ్జల రిషిత రెడ్డి
Related Posts
అట్టహాసంగా ప్రారంభమై… అంగరంగ వైభవంగా… ముగిసిన ఫ్లెమింగో ఫెస్టివల్ 2025 వేడుకలు
ముగింపు కార్యక్రమ వేడుకలకు రాష్ట్ర రెవెన్యూ, మంత్రి అనగాని సత్యప్రసాద్ప్రభాతదర్శిని,(తిరుపతి-ప్రతినిధి): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఫ్లెమింగో ఫెస్టివల్ 2025 కార్యక్రమాలు జిల్లాలో అత్యంత ఘనంగా పండుగ వాతావరణంలో నిర్వహించడం జరిగిందని, పర్యాటక రంగ అభివృద్ధికి, సంక్షేమం అభివృద్ధి సమపాళ్లలో అమలుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఇది మంచి ప్రభుత్వం అని మూడవ రోజు ఫ్లెమింగో ఫెస్టివల్ 2025 కార్యక్రమ ముగింపు వేడుకలకు రాష్ట్ర…
Read moreఫ్లెమింగో ఫెస్టివల్ 2025 కి తరలి వస్తున్న ప్రజలు పర్యాటక ప్రేమికులు
ఆకట్టుకుంటున్న పలు శాఖల, విభాగాల స్టాల్స్ప్రజల్ని పర్యాటకులను ఆద్యంతం ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలుఫ్లెమింగో ఫెస్టివల్ కు తరలి వస్తున్న విద్యార్థులు, ప్రజలు, పర్యాటకులుజన సంద్రంగా మారిన సూళ్లూరుపేట జూనియర్ కాలేజీ ప్రాంగణంవివిధ ఆటల పోటీలతో ఆకట్టుకున్న యువత ప్రభాతదర్శిని ( సూళ్లూరుపేట-ప్రతినిధి ): రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఫ్లెమింగో ఫెస్టివల్ 2025 రెండవ రోజు అంగరంగ వైభవంగా విద్యుత్ కాంతులలో కిక్కిరిసిన జనం కేరింతలతో ఉత్సాహంగా…
Read more