కార్పొరేటర్ విజయలక్ష్మికి ధైర్యం చెప్పిన ఆదాల

తెదేపా దాడిలో గాయపడిన సాజిద్ కు పరామర్శ

సూరిబాబు కుటుంబసభ్యులకు ధైర్యం చెప్పి ఆదాల

భయపడనక్కరలేదు ధైర్యంగా ఉండండి

ప్రభాతదర్శిని, (నెల్లూరు-ప్రతినిధి): నెల్లూరు గ్రామీణ నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్ని, డివిజన్ ను సందర్శించ రూరల్ వైసీపీ ఇన్చార్జ్ ఆదాల* నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్ని, ప్రతి డివిజన్ ను సందర్శించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, సానుభుతిపరులు, అభిమానులను స్వయంగా కలుసుకోవడం జరుగుతుందని, అదేవిధంగా వారందరికి అన్ని విధాలా అండగా ఉంటామని, మాజీ మంత్రివర్యులు, నెల్లూరు రూరల్ వైసీపీ ఇన్చార్జ్ ఆదాల ప్రభాకర్ రెడ్డి స్పష్టం చేశారు. మేరకు ఆయన శుక్రవారం రూరల్ నియోజకవర్గంలోని 41వ డివిజన్ కార్పొరేటర్ కువ్వాకొల్లు విజయలక్ష్మి, తెలుగుదేశం పార్టీ నాయకుల చేతిలో గాయపడిన 29వ డివిజన్ కు చెందిన షేక్ సాజిద్, అదే డివిజన్ చెందిన వైసీపీ నాయకులు సిహెచ్ సూరిబాబు దుకాణంను అధికార పార్టీ నాయకులు బలవంతంగా తొలగించిన సంఘటనను మాజీ మంత్రి, నెల్లూరు రూరల్ వైసీపీ ఇన్చార్జ్ ఆదాల ప్రభాకర్ రెడ్డి వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా నెల్లూరు రూరల్ వైసీపీ ఇన్చార్జ్ ఆదాల ప్రభాకర్ రెడ్డి కార్పొరేటర్ విజయలక్ష్మి, టిడిపి వాళ్ళ దాడిలో గాయపడిన సాజిద్, అధికార పార్టీ నాయకులు బలవంతంగా కూల్చివేసిన సంఘటనలో నష్టపోయిన సిహెచ్ సూరిబాబు కుటుంబసభ్యులకు ధైర్యం చెప్పి, అధైర్య పడకండి, భయపడకండి, పార్టీ అధిష్టానం తోపాటుగా, తాము అందరం అన్ని విధాలా అండగా ఉంటామని గట్టి భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా టిడిపి నాయకుల దాడిలో గాయపడిన 29వ డివిజన్ కు చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త షేక్ సాజిద్ కు నెల్లూరు రూరల్ వైఎస్ఆర్సిపి ఇన్చార్జ్ ఆదాల ప్రభాకర్ రెడ్డి ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు విజయ డైరీ చైర్మన్ కొండ్రేడ్డి రంగారెడ్డి, కార్పొరేటర్స్ బొబ్బల శ్రీనివాస్ యాదవ్, డాక్టర్ షేక్ సత్తార్, పార్టీ సీనియర్ నాయకులు మలిరెడ్డి కోటారెడ్డి, స్వర్ణ వెంకయ్య, మల్లు సుధాకర్ రెడ్డి, పాశం శ్రీనివాస్, పేర్నాటి కోటేశ్వర్ రెడ్డి, కువ్వాకొల్లు బాబ్జి యాదవ్, మంగళపూడి శ్రీకాంత్ రెడ్డి, పాలకీర్తి రవికుమార్, కొండ సాయిరెడ్డి, మహిళా నాయకురాళ్లు కల్లూరు లక్ష్మీరెడ్డి, వేల్పుల రజిని, అనిత, నాయకులు నారాయణరెడ్డి, హరిచంద్రరెడ్డి, పాశం తిరుపతి, నాయబ్ రసూల్, ఖాదర్ మస్తాన్, జాకీర్, షేక్ అలాబక్షు, షేక్ ఖలీల్, నరసింహారెడ్డి, నరసింహారావు, అమర్నాథ్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.