ప్రభాతదర్శిని(తిరుపతి- జిల్లా ప్రతినిధి): పెళ్లకూరు మండలంలోని దిగువచావలి గ్రామం సమీప స్వర్ణముఖి నది నుండి అక్రమ ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్ ను బుధవారం రాత్రి గ్రామస్తులు అడ్డుకొని నిలిపివేశారు.గత కొన్ని రోజులుగా పెన్నేపల్లి, దిగువచావలి గ్రామాల నుండి ట్రాక్టర్లుతో అక్రమంగా ఇసుక తరలింపు కొనసాగించుకుంటూ నాయకులంతా జేబులు నింపుకుంటున్నారు.అక్రమ ఇసుక రవాణా అని నివారించాల్సిన అధికారులు వ్యాపారులతో మండల కార్యాలయాల్లో మంతనాలు చేసుకొని భారీగా ముడుపులు అందుకుంటూ పబ్బం గడుపుతున్నారు.స్వర్ణముఖి నది నుండి అక్రమ ఇసుక రవాణా విషయమై గ్రామస్తులు పోలీసులకు ఫోన్ ద్వారా ఫిర్యాదులు చేస్తున్నప్పటికీ స్పందించడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.అంతేకాకుండా అధికారులకు సమాచారం అందిస్తున్న గ్రామస్తులపై కొందరు పోలీసు ఉన్నతాధికారులు తమదైన శైలిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం.రాత్రి వేళల్లో రహస్యంగా ఇసుక అక్రమ తరలింపులు చేస్తున్న వ్యాపారులు పగటి వేళల్లో మండల కార్యాలయాల్లో అధికారులతో కలిసి మంతనాలు చేయడం విశేషం మండల కార్యాలయంకు వచ్చే అర్జీదారుల కన్నా ఇసుక వ్యాపారులకు ఎక్కువ టైం ఇస్తూ గంటల తరబడి కూర్చొని పెట్టుకుని కాలం గడుపుతున్నారు అని పెద్ద ప్రసారమే జరుగుతుంది,ఈ క్రమంలో ఒక్కో ట్రాక్టర్ కు 25వేలు చేతివాటం ప్రదర్శిస్తున్నట్లు స్థానికుల ఆరోపిస్తున్నారు.అక్రమ ఇసుక త్రవ్వకాల వల్ల వ్యవసాయ బోర్లకు సాగునీరు అందక ఇబ్బందులు పడుతున్న రైతులు చావలి గ్రామం వద్ద ఇసుక ట్రాక్టర్లను అడ్డుకున్నారు.ఇసుక అక్రమ రవాణా కొనసాగించే వ్యాపారులతో పాటు,వారికి సహకరిస్తున్న మండల స్థాయి అధికారులపై జిల్లా పోలీసు ఉన్నతాధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక రైతులు కోరుతున్నారు.
అక్రమ ఇసుక రవాణా ట్రాక్టర్లను అడ్డుకున్న గ్రామస్తులుపోలీసులకు ఫోన్ ద్వారా ఫిర్యాదులు చేస్తున్నప్పటికీ స్పందించడం లేదనే ఆరోపణలు
Related Posts
ఏ.సి.బి వలకు చిక్కిన అవినీతి అనకొండ
మాటువేసి వేసి పట్టుకున్న అవినీతి నిరోధక శాఖ అధికారులు ప్రభాతదర్శిని,(ఒంగోలు -ప్రతినిధి):గత ప్రభుత్వ హయాంలో తిలా పాపం, తలా పిడికెడు అనే ధోరణిలో విధులు నిర్వహించి ప్రజలను పట్టి పీడించిన పలువురు ప్రభుత్వ అధికారులపై ప్రజలతో బాటు, ప్రజా ప్రతినిధులు సైతం కన్నేసి ఉన్నారు.ఇందులో భాగంగా అక్రమార్జన కోసం అర్రులు చాస్తూ ఉన్న పలువురు ప్రభుత్వ అధికారుల భరతం పట్టేందుకు నేరుగా అవినీతి నిరోధక శాఖ అధికారులను ఆశ్రయిస్తూ…
Read moreసీనియర్ జర్నలిస్ట్ వెంకటేశులుకు సన్మానం
ప్రభాతదర్శిని,(శ్రీకాళహస్తి -ప్రతినిధి):జాతీయ పత్రిక దినోత్సవం సందర్బంగా సీనియర్ జర్నలిస్ట్, శ్రీకాళహస్తి నియోజకవర్గం “ప్రభాతదర్శిని-ప్రతినిధి” చెన్నూరు వెంకటేశులును నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్చి తలపా దామోదర్ రెడ్డి తన కార్యాలయంలో ఆదివారం ఘనంగా సన్మానించ్చారు. జాతీయ పత్రిక దినోత్సవం సందర్బంగా ఆయన “ప్రభాతదర్శిని” నియోజకవర్గ ప్రతినిధి చెన్నూరు వెంకటేశులు ను ఘనంగా సన్మానించ్చారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గం లో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం కోసం పిసిసి అధ్యక్షురాలు…
Read more