నేలకు ‘ఒరిగిన’వరి… అన్నదాత కంట కన్నీరు
ప్రభుత్వం ఆదుకోవాలంటున్న  కర్షకులు

ప్రభాతదర్శిని,(తడ-ప్రతినిధి): ఆరుగాలం శ్రమించి చెమటనే సాగునీరుగా చేసిన అన్నదాతకు అకాల వర్షం కన్నీళ్లు మిగిల్చింది. పంట చేతికొస్తున్న ఆనందం వర్షంలో ఆవిరైపోయింది. ఎండనక వాననక  ఎడగారు పంట కోసం  శ్రమించిన  రైతుల కష్టం అకాల వర్షానికి నేలపాలయ్యింది. ఆదివారం సాయంత్రం కురిసిన వర్షానికి కోత దశలో ఉన్న వరి పైరు నేలకు ఒరిగింది. తడ మండల పరిధిలో చిన్న మాంబట్టు,ఎన్ కండ్రిగ, వెండ్లూరుపాడు, పొన్నపాడు, కాదలూరు, గుర్రాల మిట్ట వివిధ గ్రామాలలో ఖరీఫ్ సీజన్ అధిక విస్తీర్ణంలో వరి సాగు చేస్తారు. కొద్దిపాటి బోరు నీటి వసతితో అరకోరా నీటితో ఎండనక వాననక యాడగారు శ్రమించి పంటను సాగు చేస్తారు రైతు కష్టం పై వరుణ దేవుడు కన్నెర్ర చేశాడు. చేతకి అందవలసిన పంట నేలపాలయ్యింది అసలే వ్యవసాయం ఖర్చులు పెరిగి కూలీల కొరతతో ఖర్చు పెరిగి దిగుబడి తగ్గి నష్టపోవడంతో  వ్యవసాయం వైపు మొగ్గు చూపని రైతులు పరిశ్రమల బాట పట్టారు కొంతమంది రైతులు మాత్రమే ఇతర పనులకు వెళ్లలేక పరిశ్రమల్లో పనులు చేయలేక నమ్ముకున్న  వ్యవసాయం పైనే ఆధారపడి జీవిస్తున్నారు పంటకు పెట్టవలసిన పెట్టుబడులు మొత్తం పెట్టి చేతికందవలసిన సమయంలో నీటి పాలు కావడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. ఆదివారం సాయంత్రం కురిసిన వర్షానికి ఎన్ను ముదిరి కోత దశలో ఉన్న వరి పైరు బరువెక్కి నేలకు ఒరిగింది వర్షానికి పంట పొలాల్లో నీరు నిలబడడంతో వరి పంట మురిగిపోయే ప్రమాదం ఉందని రైతులు ఆవేదన చెందుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి పంట నష్టపరిహారాన్ని అంచనా వేసి ప్రభుత్వం ద్వారా రైతులను ఆదుకోవాలని రైతులు ప్రాధేయ పడుతున్నారు. రైతులను ఆదుకోవలసిన్ అవసరం ఉంది.