మాదిగల కృతజ్ఞత యాత్రలో
ఏపీ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు
ప్రభాతదర్శిని (ప్రత్యేక-ప్రతినిధి):సామాజిక న్యాయాన్నికి కట్టుబడి, గతంలో ఎస్సీ వర్గీకరణ చేసి సామాజిక న్యాయం పాటించింది, నేడు వర్గీకరణ చేసింది కూడా చంద్రబాబు నాయుడేనని ఏపీ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు పేరు వెంకటేశ్వరావు మాదిగ స్పష్టంచేశారు. కర్నూల్ టౌన్ చేరుకున్న ‘చంద్రబాబుకు మాదిగల కృతజ్ఞత’ యాత్ర సందర్భంగా ఏపీ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు పేరు వెంకటేశ్వరావు మాదిగ విలేకరులతో మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ పేరుతో మాల మాదిగలను చంద్రబాబు చీలుస్తున్నారని ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక శక్తులు విమర్శించడం వారి దివాళ్ళుకోరుతనానికి నిదర్శనమన్నారు. సామాజిక న్యాయం పక్షాన నిలబడి ఎస్సీ వర్గీకరణ చంద్రబాబు చేయబట్టే మాదిగ ఉపకులాలకు 25 వేల ఉద్యోగాలు గతంలో వచ్చాయని తెలిపారు. ఇప్పుడు సుప్రీం తీర్పు వెలువడిన వెంటనే అమలు చేస్తానని మాదిగలకు భరోసా ఇవ్వటమే కాకుండా గతంలో ఎన్నడూ లేని విధంగా మాదిగలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించిన చంద్రబాబు కు యావత్ మాదిగ జాతి తరపున కృతజ్ఞతలు తెలుపుతూ ఆగస్టు 16న హిందూపురం నుండి ఇచ్చాపురం వరకు మాదిగల కృతజ్ఞత యాత్ర చేపట్టారు. ఇందులో భాగంగా మంగళవారం కర్నూల్ అంబేద్కర్ భవన్ వద్దకు చేరుకోవడం జరిగిందని ఆయన తెలిపారు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ పై రాష్ట్రలకు అధికారాలు ఇస్తూ ఆగస్టు 1న సుప్రీం నాయ ధర్మసనం ఇచ్చిన తీర్పు భారతదేశ సామాజిక ఉద్యమాల చరిత్రలోనే గొప్ప తీర్పు అని ఏపీ ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు పేరుపోగు వెంకటేశ్వరరావు మాదిగ కొనియాడారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని 59 కులాలకు రిజర్వేషన్ ఫలాలు అందాలన్నా లక్ష్యంతో గత 30 సంవత్సరాలుగా ఎన్నో పోరాటాలు చేశామని ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక శక్తులు కోర్టులో ఎన్ని అడ్డంకులు సృష్టించిన చివరికి న్యాయమే గెలిచిందని వెంకటేశ్వరరావు మాదిగ తెలిపారు ఎస్సీల్లో ఆర్థికంగా ఎదిగిన సంపన్న కులాలు ఈ తీర్పును వ్యతిరేకిస్తూ భారత్ బంద్కు పిలుపునిచ్చిన ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా వాళ్లకు మద్దతు ప్రకటించలేదని వాస్తవాన్ని గ్రహించి సామాజిక న్యాయ వ్యతిరేక ఉద్యమాలు చేయడం సరైనది కాదని హితవు పలికారు బెజవాడలో బుడమేరు ముంపునకు గురైన వరద బాధితులను ఆదుకోవడంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను మంత్రులను కదిలించి గత పది రోజులుగా అక్కడే నీళ్లలో ఉండి యుద్ధ ప్రాతిపదికన సహాయ చర్యలు చేపడుతున్న ముఖ్యమంత్రి కి విజయవాడ ప్రజలు ఎప్పటికీ రుణపడి ఉంటారని ఆయన కృషి అభినందనీయం అన్నారు హుదాద్ తుఫాన్లో విశాఖపట్నం ప్రజలకు తమ సహాయాన్ని గుర్తుపెట్టుకున్నారని అదే విధంగా విజయవాడ ప్రాంతానికి పూర్వయోగం తీసుకురావాలని వెంకటేశ్వరరావు మాదిగ ముఖ్యమంత్రిని కోరారు అనంతరం కర్నూల్ జిల్లా డిఆర్ఓ గారికి జిల్లా మాదిగల సమస్యలపై వినతి పత్రాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు పేరు పోగు వెంకటేశ్వరరావు మాదిగ తెలుగు రాష్ట్రాల చైర్మన్, ఏపీఎంఆర్పిఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దాది పోగు నవీన్ మాదిగ జిల్లా అధ్యక్షులు కిరణ్ మాదిగ, జిల్లా నాయకులు టైలర్ గుండు పోగుల రంగన్న అలియాస్ నేపాల్ మాదిగ, సుధాకర్ దివాకర్ సునీత రాముడు జిల్లా అధికార ప్రతినిధి జయన్న మాదిగ జిల్లా కార్యదర్శి పరిగల ప్రకాష్ రాజ్ జిల్లా కన్వీనర్ విజయుడు జిల్లా పరిధిలో వివిధ మండలాల నాయకులు ఆరెకంటి రాజు జయరాజు వినోదు చంటి రాజు ఎజ్ ఎజ్కేల్ ప్రశాంత్ రామాంజనేయులు నరసప్ప వినోద్ తదితరులు పాల్గొన్నారు.
సామాజిక న్యాయాన్కి కట్టుబడి వర్గీకరణ చేసింది చంద్రబాబు నాయుడే
Related Posts
“మానవత”చే భూరి విరాళం – ప్రత్యేక ప్రతిభావంతులకు సాయం
శ్రీ లక్ష్మీనరసింహ చారిటబుల్ ట్రస్ట్ సేవలు అభినందనీయంప్రభాతదర్శిని, (తిరుపతి-ప్రతినిధి): ప్రత్యేక ప్రతిభావంతులకు విశిష్ట సేవలు అందిస్తున్న శ్రీ లక్ష్మీ నరసింహ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు సైదమ్మ( శైలజ)కు తిరుపతి మానవత శాఖ, రిటైర్డ్ ఎస్సై సుధాకర్ బాబు చే ఒక నెలకు సరిపడే బియ్యం, పప్పు ధాన్యాలు, ముడి సరుకులను ఉచితంగా అందజేశారు. సోమవారం వికృతమాల సమీపం ఇందిరమ్మ ఇళ్ల వద్ద ఉన్న శ్రీ లక్ష్మీనరసింహ చారిటబుల్ ట్రస్ట్…
Read moreలంచాల కోసం వేధిస్తున్న ‘ఓజిలి రెవెన్యూ’ అధికారులు
మీడియా ముందు గోడువెళ్ళబోసుకున్న రైతు ప్రభాతదర్శిని,(ఓజిలి-ప్రతినిధి): ఓజిలి మండల రెవెన్యూ అధికారులు లంచాల కోసం వేధిస్తున్నారని రైతు దయాకర్ రెడ్డి ఆరోపించారు. శుక్రవారం ఆయన మీడియా ప్రతినిధులతో తన గోడును వెళ్ళబో సుకున్నారు. తనకు ఓజిలి మండలం రుద్రాయ పాలెం గ్రామంలో ఏడు ఎకరాల పట్టా భూములు ఉన్నాయని తెలిపారు. రీ సర్వే పేరుతో 7 ఎకరాల భూమిని 30 పేర్లతో గందరగోళం చేశారని తెలిపారు. పట్టా ఒక…
Read more