బుర్ర బద్ధలు కొట్టుకుంటున్న ఆ పార్టీ నేతలు
ప్రభాతదర్శిని, (తిరుపతి-ప్రతినిధి):కూటమి ప్రభుత్వం కూలుతుందని వ్యాఖ్యానించిన సజ్జల రామకృష్ణారెడ్డి.. మరొకరు విజయసాయి రెడ్డి. వీరిద్దరు వైసీపీలో జగన్ తర్వాత జగన్ అంత పెద్దవారు నేతలు. వైసీపీ నేతలు కొత్త జోస్యం… అదేంటో అర్థంకాక జుట్టు పీక్కుంటున్నారు జనాలు, వైసీపీ నేతలు. ఇది అసలు సాధ్యమేనా? ఒకవేళ నిజమైతే అదేలా? అనేది అర్థం కావడం లేదు. ఇంతకీ వైసీపీ నేతలు ఏం మాట్లాడరనేదే కదా మీ డౌట్.. కన్ఫ్యూజన్లో ఉన్నారా? అయితే ఈ నేత మాట్లాడిన మాటలు చూడండి. 2027లో ఎన్నికలు రాబోతున్నాయి.. ఈ మాటను ఘంటా పథంగా చెబుతున్నారు వైసీపీ నేతలు. వారు కూడా ఆషామాషీ గల్లీ లీడర్లు కాదు. వైసీపీలో అధినేత తర్వాత అధినేతల లాంటి వారు. సరే వారి విషయానికి తర్వాత వద్ధాం. అసలు 2027లో ఎన్నికలు ఎందుకు వస్తాయి? ఎలా వస్తాయి? అనేది ఇప్పుడు అర్థం కాని విషయం. ఏ ఆశలతో వైసీపీ నేతలు ఈ అంశాన్ని తెరపైకి తీసుకొస్తున్నారు? టీడీపీ 135.. జనసేన 21.. బీజేపీ 8.. ఇవి మొన్నటి ఎన్నికల్లో ఆయా పార్టీలు సాధించిన సీట్లు. ఈ మూడు పార్టీలు కలిసి.. ప్రభుత్వ బలం 164. అంటే ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కావాల్సిన 88 సీట్ల కంటే ఏకంగా 76 సీట్లు ఎక్కువ. మరి కూటమి ప్రభుత్వం ఎందుకు కూలుతుంది? సరే.. మరో సినారియో చూద్దాం.. కూటమిలోని పార్టీలు విడిపోయాయనుకుందాం. జనసేన అధినేత పవన్ కల్యాణ్ వేరు పడి.. 21 మందితో ఆయన బయటికి వెళ్లిపోయారనే అనుకుందాం. అయినా కూడా ప్రభుత్వానికి వచ్చిన ఢోకా ఏం లేదు. ఆయనతో పాటు మరో 8 మంది బీజేపీ ఎమ్మెల్యేలు బయటకు వెళ్లినా.. మొత్తం 29 మంది ప్రభుత్వానికి మద్ధతు ఉపసంహరించుకున్నా.. టీడీపీ సొంతంగా ప్రభుత్వాన్ని రన్ చేసే సత్తా ఉంది. మరి ప్రభుత్వం ఎందుకు, ఎలా కూలుతుంది ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే చంద్రబాబు, పవన్ జోడు గుర్రాల్లా ముందుకెళ్తున్నట్టు కనిపిస్తున్నారు. ఒకరినొకరు పొగుడుకుంటూ, కేంద్రం నుంచి నిధులు తెచ్చుకుంటూ ఆల్ ఈజ్ వెల్ అనే రీతిలో పాలన సాగిస్తున్నారు. రీసెంట్గా గుంతలు పూడ్చే విషయంలో కూడా ఈ ఆలోచన పవన్‌దే అంటూ పూర్తి స్థాయిలో క్రెడిట్ జనసేనానికే ఇచ్చారు చంద్రబాబు. అటు పవన్ కూడా పాలనలో చంద్రబాబు అనుభవాన్ని పదే పదే పొగుడుతూ ముందుకెళ్తున్నారు. రెండు పార్టీల మధ్య ఎలాంటి అపార్థాలకు ప్లేస్ ఇవ్వకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. మరి కూటమి ప్రభుత్వం ఎలా, ఎందుకు కూలుతుంది..? టీడీపీ ప్రభుత్వం కూలడానికి మరో అవకాశం ఉంది. అదేంటంటే.. టీడీపీ ఎమ్మెల్యేలు తిరుగుబాటు జెండా ఎగరవేసి వైసీపీ వైపు రావాలి. కానీ ఆ పరిస్థితి ఉందా? ఈ క్వశ్చన్‌కు ఆన్సర్ లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అంటే ఓ సమర్థుడైన నాయకుడన్న నమ్మకం ఉంది. దీనికి తోడు టీడీపీ నేతలు పార్టీ విషయంలో చాలా క్రమశిక్షణతో ఉంటారు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ గడచిన ఐదేళ్లు. అప్పుడే పార్టీని అంటి పెట్టుకొని ఉన్న నేతలు.. ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు దూరమవుతారంటే అది అవివేకమైన ఆలోచనే. అంతేకాదు.. కేవలం 11 సీట్లు మాత్రమే గెలిచిన వైసీపీని నమ్ముకుంటారంటే అది ఆశ్చర్యమనే చెప్పాలి. మరి కూటమి ప్రభుత్వం ఎలా, ఎందుకు కూలుతుంది..? ఒకరకంగా గతంలో ప్రభుత్వాన్ని నడిపించిన వారు. మరి అలాంటి వ్యక్తులు ఈ వ్యాఖ్యలు ఎలా చేశారు? తెలియక చేశారా? రోజురోజుకు పార్టీ నేతలు, కార్యకర్తల్లో పెరుగుతున్న నైరాశ్యాన్ని కంట్రోల్ చేయడానికి కావాలనే ఇలాంటి వ్యాఖ్యలు చేశారా? లోగుట్టు పెరుమాళ్లకు ఎరుక అన్నట్టు.. తమ పార్టీ పెద్దలు ఈ వ్యాఖ్యలు ఎందుకు చేశారో అర్థంకాక ఆ పార్టీ నేతలు. బుర్ర బద్ధలు కొట్టుకుంటున్నారట..
వైసీపీ నేతలు కొత్త జోస్యం…2027లో మళ్లీ ఎన్నికలు…?
Related Posts
పోలీసులు రౌడీ షీట్ ఓపెన్ చేస్తే చెల్లదు….సుప్రీంకోర్ట్, హై కోర్టుల సంచలన తీర్పులు…
ప్రస్తుతం రౌడీషీట్ కు చట్ట బద్దత లేదంటున్న న్యాయ స్థానాలు… ప్రభాతదర్శిని, (న్యూఢిల్లీ-ప్రతినిధి): సమాజంలో మనం చాలా సందర్భాల్లో ముఖ్యంగా పోలీస్ వ్యవస్థలో, కోర్టుల్లో, పలు కేసుల్లో, రాజకీయంగా రౌడీషీట్ అనే పదం వింటూనే ఉంటాం. రౌడీషీట్ అనగానే చాలా మందికి సాధారణ ప్రజలకి ఒకరకమైన భయం, అభద్రత భావం. రౌడీ షీటర్ అనీ ఒక వ్యక్తికి ముద్రపడగానే కొంత వరకు సమాజం ఆ వ్యక్తీ పట్ల చిన్నా…
Read moreస్థానిక సమస్యల పరిష్కారానికి హెల్ప్ లైన్ కు తెలియజేయండి…నగర పాలక సంస్థ కమిషనర్ సూర్యతేజ
ప్రభాతదర్శిని, (నెల్లూరు-ప్రతినిధి):నెల్లూరు నగర పాలక సంస్థ పరిధిలోని స్థానిక సమస్యలను కమాండ్ కంట్రోల్ విభాగంలో ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ కి ఫోన్ ద్వారా తెలియజేస్తే తక్షణమే స్పందించి ఫిర్యాదును పరిష్కరించేందుకు కృషి చేస్తామని కమిషనర్ సూర్యతేజ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికను నెల్లూరు నగర పాలక సంస్థ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ విభాగం సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించారు. కమిషనర్ సూర్యతేజ…
Read more