తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు రమేష్ నాయుడు
ప్రభాతదర్శిని,(పెళ్లకూరు ప్రతినిధి): మండలంలోని పెళ్లకూరు గ్రామ తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత పేరం రమేష్ నాయుడు వారి నివాసం నందు మీడియా సమావేశం ఆదివారం నిర్వహించారు.ఈ సందర్భంగా మీడియా సమావేశంలో రమేష్ నాయుడు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ని విమర్శించే స్థాయి అర్హత మాజీ చైర్మన్ కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి లేదని తెలిపారు,హిందువుల పవిత్ర ఆలయమైన తిరుమల దేవస్థానంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదం లడ్డు కల్తీ విషయమై గుజరాత్ లోని జాతీయ పాడి పరిశ్రమ అభివృద్ధి సంస్థ తిరుమలలో 19.77 శాతం మాత్రమే నెయ్యి ఉన్నట్లు నిర్ధారించడం జరిగిందన్నారు.ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రపంచానికి తెలియజేశారు తప్ప, ఇందులో ఎలాంటి రాజకీయ కుట్ర లేదన్నారు. సత్యనారాయణ రెడ్డి రాజకీయ జీవితమంతా కుళ్ళు,కుతంత్రాలతో కుట్రలు చేస్తూ కొనసాగుతున్నాడు కాబట్టే దేవుడు ఆయనను జైల్లో పెట్టించినట్లు పేర్కొన్నారు.ప్రపంచంలోనే వేలకోట్ల ఆస్తులు ఉన్న టీటీడీ దేవస్థానానికి వై వి సుబ్బారెడ్డి గాని, భూమన కరుణాకర్ రెడ్డి గాని సేవలు చేయాల్సిన అవసరం లేదని వాళ్లకే దేవస్థానం అనేక సేవలు, సదుపాయాలు చేసిందని వివరించారు. టీటీడీ నెయ్యి కల్తీ విషయంలో అనేక కోణాల్లో విచారణలు మొదలుపెట్టారని దోషులను ఎట్టి పరిస్థితుల్లో వదలకుండా కచ్చితంగా శిక్షించడం జరుగుతుందని తెలిపారు.100 రోజుల కూటమి ప్రభుత్వ పాలనలో పింఛన్లు ఎవరికీ తొలగించలేదని సత్యనారాయణ రెడ్డి స్వగ్రామం చిల్లకూరులో కనీసం ఒక్క పింఛన్ కూడా రద్దు చేయలేదన్న విషయాన్ని గుర్తు చేశారు. గ్రామంలో గిరిజన భూములను ఆక్రమించుకుని సమీప స్వర్ణముఖి పొర్లకట్టను తవ్వేసి అక్కడ మట్టిని పొలాలకు తరలించిన కేసులో సత్యనారాయణ రెడ్డి పై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. తదుపరి బంగారం పేట సర్పంచ్ దేవారెడ్డి నాగేంద్ర రెడ్డి మాట్లాడుతూ గుమ్మడికాయ దొంగ ఎవరు అంటే భుజాలు తడవుకుంటున్న సత్యనారాయణ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సంజీవయ్య కలిసి పునబాకలోని వైష్ణవి డైయిరీ నుంచి 3.78 లక్షల లీటర్లు నెయ్యిని 15.75 కోట్లకు టీటీడీకి విక్రయించడంలో ఎంత లాభం పొందుకున్నారో దర్యాప్తు చేసి అసలు నిజాన్ని నిగ్గు తేల్చాలన్నారు.లీటరు నెయ్యి 411రూపాయలకే ఇప్పించడంలో ఎన్ని కోట్లు గుంజుకున్నారో చెప్పాలన్నారు. అలాగే జీలపాటూరు సర్పంచ్ కందమూడి శివకుమార్ మాట్లాడుతూ కూటమిపాలనలో ఎలాంటి అవినీతికి అవకాశం లేదని, ప్రభుత్వం మీద బురద చల్లడం సత్యనారాయణ రెడ్డికి తగదని హితువు పలికారు.ఈ కార్యక్రమంలో పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు.
ముఖ్యమంత్రి ని విమర్శించే అర్హత కామిరెడ్డికి లేదు
Related Posts
అట్టహాసంగా ప్రారంభమై… అంగరంగ వైభవంగా… ముగిసిన ఫ్లెమింగో ఫెస్టివల్ 2025 వేడుకలు
ముగింపు కార్యక్రమ వేడుకలకు రాష్ట్ర రెవెన్యూ, మంత్రి అనగాని సత్యప్రసాద్ప్రభాతదర్శిని,(తిరుపతి-ప్రతినిధి): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఫ్లెమింగో ఫెస్టివల్ 2025 కార్యక్రమాలు జిల్లాలో అత్యంత ఘనంగా పండుగ వాతావరణంలో నిర్వహించడం జరిగిందని, పర్యాటక రంగ అభివృద్ధికి, సంక్షేమం అభివృద్ధి సమపాళ్లలో అమలుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఇది మంచి ప్రభుత్వం అని మూడవ రోజు ఫ్లెమింగో ఫెస్టివల్ 2025 కార్యక్రమ ముగింపు వేడుకలకు రాష్ట్ర…
Read moreఫ్లెమింగో ఫెస్టివల్ 2025 కి తరలి వస్తున్న ప్రజలు పర్యాటక ప్రేమికులు
ఆకట్టుకుంటున్న పలు శాఖల, విభాగాల స్టాల్స్ప్రజల్ని పర్యాటకులను ఆద్యంతం ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలుఫ్లెమింగో ఫెస్టివల్ కు తరలి వస్తున్న విద్యార్థులు, ప్రజలు, పర్యాటకులుజన సంద్రంగా మారిన సూళ్లూరుపేట జూనియర్ కాలేజీ ప్రాంగణంవివిధ ఆటల పోటీలతో ఆకట్టుకున్న యువత ప్రభాతదర్శిని ( సూళ్లూరుపేట-ప్రతినిధి ): రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఫ్లెమింగో ఫెస్టివల్ 2025 రెండవ రోజు అంగరంగ వైభవంగా విద్యుత్ కాంతులలో కిక్కిరిసిన జనం కేరింతలతో ఉత్సాహంగా…
Read more