ప్రభాతదర్శిని,( నెల్లూరు-జిల్లా ప్రతినిధి):మహిళా శిశు సంక్షేమ శాఖ రూపొందించిన మాతృత్వం ఒక వరం – దత్తత దానికి మరో మార్గం పోస్టర్స్ ను జిల్లా కలెక్టర్ శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నూతనంగా రూపొందించిన మార్గదర్శకాల ప్రకారం దత్తత పోందటం అతి సులభం అయిందన్నారు. దత్తత ఎలా పొందాలి అనే అంశాలు,కావలసిన ద్రువ పత్రాల గురించి పోస్టర్ లో విశదంగా వివరించా రన్నారు.దత్తతకు సంబంధించిన మరింత సమాచారం కొరకు అంగన్వాడీ కేంద్రాల్లో గాని, ఐసీడీఎస్ అధికారులను గాని,జిల్లా బాలల పరి రక్షణ అధికారులను గాని సంప్రదించాలని కోరారు.దత్తత ప్రక్రియను ఆన్లైన్ వెబ్సైట్ www. Cara.nic.in ద్వారా చేసు కోవచ్చన్నారు. చట్ట విరుద్ధంగా దత్తత తీసుకున్న వారికి 3 నుండి 7 సంవత్సరాల వరకు కఠిన కారాగార శిక్ష,లక్ష రూపాయల జరిమానా విధించే అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ పీడీ హేనా సుజన్,బాలల సంరక్షణ అధికారి బి.సురేష్ పాల్గొన్నారు.
దత్తతకు మార్గ దర్శకాలు:కేంద్ర ప్రభుత్వం నూతనంగా రూపొందించిన మార్గదర్శకాల ప్రకారం దత్తత పొందుట అతి సులభతరం దత్తత పొందుటకు అవసరమగు ధృవపత్రాలు పాన్ కార్డ్, ఆదాయ ధ్రువపత్రం, వయస్సు ధ్రువీకరణ పత్రం, దంపతుల ఫోటో, నివాస ధృవపత్రం, వివాహ ధృవపత్రం, ఆరోగ్య ధృవీకరణ పత్రం దత్తత పొందుటకు సులభతరమైన ఆరు దశలు.మొదటి దశ: దత్తత పొందుగోరు తల్లిదండ్రులు వారి యొక్క పాన్ కార్డు ద్వారా వెబ్ సైట్ నందు నమోదు చేసుకోవాలి.
రెండవ దశ: సిద్ధం చేసుకున్న ధృవపత్రాలను వెబ్సైట్ నందు వారి యొక్క లాగిన్ ఐ.డి ద్వారా 30 రోజుల్లోపు అప్లోడ్ చేసి సదరు దత్తత ఏజెన్సీ వారికి గృహ అధ్యయన నివేదిక సమయంలో రూ. 6000/-లు డి.డి సమర్పించవలెను.
మూడవ దశ: సదరు దత్తత ఏజెన్సీ వారు గృహ అధ్యయన నివేదికను తయారుచేసి వెబ్సైట్ నందు అప్లోడ్ చేయటం.
నాలుగో దశ: సదరు అర్జీదారు దారు కోరుకున్న బిడ్డను రిఫర్ చేస్తూ వారి మొబైల్ కు సమాచారం అందుతుంది. ఆ సమాచారం ప్రకారం 48 గంటల్లోపు వెబ్సైట్ నందు లాగిన్ అయ్యి సదరు బిడ్డను నచ్చితే రిజర్వు చేసుకోవలెను.
ఐదవ దశ: రిజర్వ్ చేసుకున్న బిడ్డను 20 రోజుల్లోపు పోలికలు సరిపోల్చుటకు సదరు దత్తత ఏజెన్సీ దగ్గరకు వెళ్లి బిడ్డ నచ్చిందని ఆమోదం తెలియజేసి రూ. 50,000/-లు డి.డి సమర్పించి బిడ్డను పొందవచ్చును.
ఆరోవ దశ: బిడ్డను పొందిన వారం రోజుల్లోపు సదరు దత్తత ఏజెన్సీ వారు దత్తతకు సమర్పించిన ధ్రువ పత్రాలన్నిటిని స్తానిక కుటుంబ న్యాయ స్థానం నందూసమర్పించి కోర్టు ఉత్తర్వులు ప్రతిని పొందవలెను అని తెలియజేశారు.