ప్రభాతదర్శిని, (ఓజిలి-ప్రతినిధి): త్వరలో జరగనున్న ఎన్నికలలో బట్టలు కనుపూర్ గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు మెజార్టీని తీసుకురావడం ద్వారా ఎంపీపీ గడ్డం అరుణమ్మ ప్రతిష్టను మరింత పెంచాలని సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య పిలుపునిచ్చారు. మంగళవారం ఆయన ఓజిలి మండలంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా భట్లకనుపూరు గ్రామంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడుతూ మీ గ్రామం నుండి ఎంపీటీసీగా గెలుపొందిన మీ ఆడపడుచు అయిన గడ్డం అరుణమ్మను ఓజిలి ఎంపీపీగా చేసిన ఘనత వైసిపి ప్రభుత్వాన్నిదేనని ఆయన అన్నారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని గ్రామస్తులు ఎంపీపీ అరుణమ్మ ప్రతిష్ట కు భంగం వాటిల్లేకుండా భట్లకనుపూరు గ్రామంలో ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులకు ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీని తీసుకురావాలని ఆయన కోరారు. గ్రామంలో కొందరు వైసీపీని అస్థిర పరిచేందుకు రాజకీయాలు చేస్తున్నారని, రాజకీయ పార్టీ నాయకులు అవసరానికి ఉపయోగించుకొని తర్వాత పట్టించుకోరని ఒకర్ని ఉద్దేశించి పరోక్ష వ్యాఖ్యలు చేశారు. తాను ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత గ్రామ అభివృద్ధికి ఎంతో కృషి చేశానని తెలిపారు. ఇటీవల కాలంలో ఈ ప్రాంతంలో నీటి సమస్య నెలకొన్నదని అన్నారు. ఇందుకు కారణం కూడా లేకపోలేదని వివరించారు. తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఈ ప్రాంతంలో పాదయాత్ర చేయడంతో నీటి సమస్య నెలకు ఉందని ఆయన ఎద్దేవా చేశారు. తెలుగుదేశం పార్టీలో తండ్రి కొడుకులు ఎక్కడ పాదం పెట్టిన అక్కడ కరువు కాటకాలు ఏర్పడి తాగునీరు కూడా దొరకదన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించడం ద్వారా రానున్న మరో ఐదేళ్లలో రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేసుకోవచ్చని అన్నారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గడ్డం అరుణమ్మ, మండల ఉపాధ్యక్షురాలు మీనాక్షి, సర్పంచ్ ఉమామహేశ్వరి, వైసిపి యువ నాయకులు గడ్డం వెంకటరెడ్డి, జ్ఞాన ప్రసూనాంబ దేవస్థానం చైర్మన్ జయరామిరెడ్డి, వైసిపి మండల అధ్యక్షులు హరినాద్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి దేశిరెడ్డి మధుసూదన్ రెడ్డి, వైసిపి నాయకులు గురవయ్య, చంద్రశేఖర్ రెడ్డి, ప్రసాద్ రెడ్డి, పిండుకూరు మధుసూదన్ రెడ్డి, ఎల్ల సురేష్ రెడ్డి, ముమ్మడి రామయ్య, ముని రాజారెడ్డి, వేణు రెడ్డి, మహేంద్ర రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. అంతకు ముందు గ్రామ పొలిమేర్ల నుండి వైసీపీ యువ నాయకుడు గుడ్ల వెంకటరెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించి తప్పెట్లు తాళాలతో ఊరేగింపుగా ప్రచారం నిర్వహించారు.
భట్లకనుపూరులో మెజార్టీని తెచ్చి… ఎంపీపీ ప్రతిష్టను పెంచాలి…ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే కిలివేటి
Related Posts
క్రీడలు శారీరిక మానసిక ఉల్లాసానికి అవసరం
ఇంటర్-కాలేజియేట్ టోర్నమెంట్ ముగింపులో ఎస్వీయూ వైస్ ఛాన్సలర్ప్రభాతదర్శిని, (ప్రత్యేక- ప్రతినిధి): క్రీడలు మానసిక ఉల్లాసానికి అవసరమని విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ఆచార్య ఎస్ విజయభాస్కరరావు అన్నారు. వెంకటాచలం మండలం కాకుటూరు లోని విక్రమ సింహపురి విశ్వవిద్యాలయంలో నిర్వహించిన ఇంటర్కాలేజియేట్ పురుషుల క్రీడల టోర్నమెంట్ ముగింపు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరై టోర్నమెంట్లో గెలుపొందిన జట్లకు బహుమతులు ప్రధానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “క్రీడలు…
Read moreనేడు జిఎస్ఎల్వి.ఎఫ్ 15 ఎన్విఎస్ -02 ప్రయోగం…సెంచరీతో చరిత్ర సృష్టించనున్న ఇస్రో
నావిగేషన్ అభివృద్ధి పరచే దేశాల సరసన భారత్ప్రభాతదర్శిని, (సూళ్లూరుపేట-ప్రతినిధి): భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో 100వ ప్రయోగానికి ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ మేరకు కౌంట్ డౌన్ మొదలయ్యింది. బుధవారం ఉదయం 6:23 నిమిషాలకు 100వ ప్రయోగం శ్రీహరికోట లోని రెండవ రాకెట్ ప్రయోగ వేదిక నుండి జి ఎస్ ఎల్ వి ఎఫ్ 15 ను ప్రయోగించుకున్నారు. జియో ట్రాన్స్ఫర్ ట్రాన్స్ఫర్ ఆర్బిటాల్ కక్షలోకి చేరుకునే…
Read more