
ప్రతి గర్భిణీ స్త్రీని గుర్తించి నమోదు చేయాలి
ప్రభాతదర్శిని,(నెల్లూరు – ప్రతినిధి): ప్రతి గర్భిణి ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవం జరిగేలా ఆరోగ్య సిబ్బంది చైతన్యం కలిగించాలని నెల్లూరు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ సుజాత పేర్కొన్నారు. గురువారంశ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాII వి. సుజాత అధ్యక్షతన “ శిశు మరణాల సబ్ కమిటీ సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జిల్లాలో2024 గత నవంబర్, డిసెంబర్ నెలలలో సంభవించిన 9 శిశు మరణాలకు గల కారణాలు, లోపాలపై సమీక్షించారు.ఈ సందర్బముగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి మాట్లాడుతూ ప్రతి గర్భిణీ స్త్రీ ని గుర్తించి త్వరిత గతిన నమోదు చేసి అన్నీ రకాల పరీక్షలు తప్పని సరిగా చేయాలన్నారు. హై రిస్క్ గర్భిణీ స్త్రీల ను గుర్తించి సదరు గర్భిణీ స్త్రీలకు ఎటువంటి ఆటంకము లేకుండా సంపూర్ణ ఆరోగ్య రక్షణ కల్పించి ప్రభుత్వ ఆసుపత్రి లో సుఖ ప్రసవము జరిగే వరకు సంబంధిత ఆరోగ్య పర్యవేక్షకురాలుకు పూర్తి భాద్యత అప్పగించవలసిందిగా సూచించారు. 0 నుండి పిల్లలకు తప్పనిసరిగా తల్లి పాలు ఇచ్చేలాగా, పుట్టిన పిల్లలందరికి 0 డోసు 24 గంటలలో ఇవ్వాలని, ఐదు సంవత్సరముల లోపు పిల్లలందరికి వ్యాధి నిరోధక టీకాలు ఇవ్వాలన్నారు. పిల్లలకు రక్తహీనత లేకుండా ఐరన్ సిరప్/మాత్రలు తప్పని సరిగా ఇచ్చేలాగా పర్యవేక్షించవల్సిందిగా వైద్యాధికారులను ఆదేశించారు. ప్రభుత్వఆసుపత్రులలో కాన్పులు జరిగేలాగా ముందస్తు ప్రణాళిక రూపొందించు కోవాలని, అర్హులైన ప్రతి గర్భిణీ స్త్రీకి , బాలింతకు జె ఎస్ వై, జె ఎస్ ఎస్ కే వై పథకాలు క్రింద లబ్ధి చేకూరేలాగా వైద్య ఆరోగ్య సిబ్బంది చూడాలని ఆదేశించారు. ఏ తల్లి, బిడ్డ కూడా రక్తహీనత వలన, సకాలములో వైద్య సేవలు అందక మరణించినట్లు తమ దృష్టికి వస్తే సంబంధిత వైద్య ఆరోగ్య సిబ్బంది పైన శాఖా పరమైన చర్యలు తీసుకుంటామని డి ఎం అండ్ హెచ్ ఓ హెచ్చరించారు. ఈ కమిటీ సమీక్ష సమావేశంలో డి ఎల్ ఏ టి ఓ డాII షేక్ ఖాదర్ వలి డి ఐ ఓ డాII ఏ ఉమామహేశ్వరి, పిఓ (ఎఫ్ పి సి) డాII పి ఎల్ దయాకర్, డిప్యూటీ డి ఏం హెచ్ ఓ లు డాII పి బ్రిజిత, డాII ఎస్ రజని, అసిస్టెంట్ ప్రొఫెసర్ (పీడియాట్రిక్ ) జిజిహెచ్ డాIIజి గ్రేస్ ఎస్తేర్, డాII శ్రవణ్ కుమార్, డెమో శ్రీ కె కనకరత్నం, డిపిహెచ్ఎన్ఓ శ్రీమతి జి మంజుల, ఎస్ఓ శ్రీమతి కె సహన, సంబంధిత వైద్యాధికారులు, ఆరోగ్యసిబ్బంది తదితరులు పాల్గొన్నారు.