ప్రభాతదర్శిని,(నాయుడుపేట- ప్రతినిధి):సూళ్లూరుపేట నియోజకవర్గంలో ప్రజలు ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటి, పర్యావరణాన్ని కాపాడాలని సూళ్లూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలల విజయశ్రీ అన్నారు. శుక్రవారం నాయుడుపేట పట్టణంలోని బీఎంర్ నగర్ లో జరిగిన వన మహోత్సవం కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ మొక్కలు నాటారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ప్రజలువారి ఇంటి పరిసరాల్లో ప్రతి ఒక్కరు మొక్కలు నాటి పచ్చదనంగా ఉంచుకోవాల న్నారు.సూళ్లూరుపేట నియోజకవర్గంలో 8.9 శాతం అడవులు మాత్రమే ఉన్నాయని, ఈ కార్యక్రమం ద్వారా నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేయాలని సూచించారు.నాయుడుపేట పట్టణంలో బిఎంఆర్ నగర్ లో మున్సిపల్ పార్కును ఏర్పాటు చేస్తామని తెలిపారు. సూళ్లూరుపేట పట్టణంలో ఒక మున్సిపల్ పార్కు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం, నాయుడుపేట మాజీ ఏఎంసి చైర్మన్ శిరసనంబేటి విజయభాస్కర్ రెడ్డి నాయుడుపేట మున్సిపల్ వైస్ చైర్మన్ 786 రఫీ, నాయుడుపేట మున్సిపాలిటీ మాజీ చైర్ పర్సన్ మైలారి శోభారాణి,ఓజిలి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గుజ్జలపూడి విజయ్ కుమార్ నాయుడు, పెళ్లకూరు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సంచి కృష్ణయ్య,దొరవారిసత్రం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీనివాసులు నాయుడు, కట్టా వెంకట రమణారెడ్డి,ఆరవ పిరమిడ్ మాజీ సర్పంచ్ సన్నారెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ నాయకులు పసల గంగా ప్రసాద్, నానా బాల సుబ్బారావు,మైలారి రాజశేఖర్, మున్సిపల్ కమిషనర్ జనార్దన్ రెడ్డి, పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు.
ప్రతి ఒక్కరు ఒక మొక్క నాటాలి…పర్యావరణాన్ని కాపాడాలి:ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ
Related Posts
ఏ.సి.బి వలకు చిక్కిన అవినీతి అనకొండ
మాటువేసి వేసి పట్టుకున్న అవినీతి నిరోధక శాఖ అధికారులు ప్రభాతదర్శిని,(ఒంగోలు -ప్రతినిధి):గత ప్రభుత్వ హయాంలో తిలా పాపం, తలా పిడికెడు అనే ధోరణిలో విధులు నిర్వహించి ప్రజలను పట్టి పీడించిన పలువురు ప్రభుత్వ అధికారులపై ప్రజలతో బాటు, ప్రజా ప్రతినిధులు సైతం కన్నేసి ఉన్నారు.ఇందులో భాగంగా అక్రమార్జన కోసం అర్రులు చాస్తూ ఉన్న పలువురు ప్రభుత్వ అధికారుల భరతం పట్టేందుకు నేరుగా అవినీతి నిరోధక శాఖ అధికారులను ఆశ్రయిస్తూ…
Read moreBC లోని ప్రస్తుతం కులాలు
BC- A కులాలు : . 1.అగ్నికుల క్షత్రియ, పల్లి, వాడ బలిజ, బెస్త, జాలరి, గంగవారు, గంగపుత్ర, గూండ్ల, వన్యకుల క్షత్రియ, వన్నెకాపు, వన్నెరెడ్డి, పల్లికాపు, పల్లిరెడ్డి, నెయ్యల, పట్టపు, ముదిరాజు, ముత్రాసి తెనుగోళ్ళు బాలసంతు, బహురూపి 3. బండార 4. బుడబుక్కల 5. రజక, చాకలి, వన్నార్. 6. దాసరి 7. దొమ్మర 8.గంగిరెద్దుల 9. జంగం10. జోగి 11. కాటిపాపల 12. కొర్చ 13.…
Read more