వరద రాజకీయాలపై వైకాపాలో అంతర్మథనం
ప్రభాతదర్శిని,(పొలిటికల్-బ్యూరో): ఎపిలో వరదలతో విజయవాడ సహా పలు జిల్లాలలు అతలాకుతలం అయ్యాయి. ప్రధానంగా
విజయవాడ కోలుకోలేని దెబ్బతిన్నది. సిఎం చంద్రబాబు తన దక్షతతో వరదబాధితులను ఆదుకుని, వారికి అండగా నిలిచారు.
కానీ విపక్ష వైకాపా కేవంల విమర్శలకు పరిమితం అయి, ఇదో మానవతప్పిదమని అంటూ విమర్శలు చేస్తోంది. వరద బాధితులను ఆదుకోలేదు. సహాయ కార్యక్రమాల్లో ఎక్కడా పాల్గొనలేదు. కానీ జగన్ మాత్రం పలు ప్రాంతాల్లో పర్యటించి అధికార
పార్టీపై బురదజల్లారు. తెలంగాణలో బిఆర్ఎస్ తరహాలోనే ఇక్కడా విమర్శలకు ప్రాధాన్యం ఇచ్చారు. చంద్రబాబు ఫెయిల్యూర్
అని..తానే ఉంటే అంటూ వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడిదే హాట్ టాపిక్‌గా మారింది. పార్టీ కేడర్‌లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. సాయం చేయకుండా విమర్శలు చేయడం పై క్షేత్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. మాజీ మంత్రులు, సీనియర్ నాయకులు
పార్టీకి దూరంగా ఉంటున్నారు. కొంతమంది ఇప్పటికే వైసీపీకి రాజీనామా చేసి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. జగన్ ను మ్ముకోవడం వల్ల తమకు రాజకీయ భవిష్యత్తు లేకుండా పోయిందని కొందరు నాయకులు తీవ్ర ఆవేదన చెందుతున్నారని
సమాచారం. ఈ దశలో ఇలా వరద బాధితుల మనోస్థయిర్యం దెబ్బతినేలా చేయడం ఎంతవరకు సమంజసమన్న చర్చ సాగుతోంది. రాష్ట్రంలో వైసీపీ సీనియర్ నేతలు పార్టీకి దూరంగా ఉండటంతో కేడర్ తీవ్ర నిరాశతో ఉన్నారని సమాచారం. ఆర్థికంగా అండగా నిలిచేందుకు క్షేత్రస్థాయిలో నేతలు ముందుకు రాకపోవడం వైసీపీ స్థానిక నేతలకు అవమానకరంగా మారిందని తెలుస్తోంది.
ఈ క్రమంలో ఏపీ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. సార్వత్రిక ఎన్నికల తర్వాత నుంచి రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు పూర్తి భిన్నంగా కనిపిస్తున్నాయి. తాము ఎంతో బలంగా ఉన్నామని ఊహించుకున్న వైసీపీకి ఓటర్లు షాక్ ఇవ్వడంతో.. ఇప్పటికీ ఆ పార్టీ కోలుకోలేదు. కొన్ని నియోజకవర్గా ల్లో ఇటీవల ఎమ్మెల్యేలుగా వైసీపీ నుంచి పోటీచేసిన ఎమ్మెల్యే అభ్యర్థులు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. పార్టీ శ్రేణులకు సీనియర్ నేతలు అందుబాటులో ఉండటం లేదనే చర్చ
జరుగుతోంది. దీంతో తమకు ఏదైనా సమస్య వస్తే ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావడంలేదని క్షేత్రస్థాయిలో స్థానిక నేతలు వాపోతున్నారు. వరద సహాయక కార్యక్రమాల్లో పాల్గొని ఉంటే ప్రజల ఆదరణ దక్కేదని కొందరు అంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు ఏడాదికి పైగా సమయం ఉంది. వైసీపీ అప్పటిలోపు మరింత బలపడి ఎన్నికల్లో కూటమి పార్టీలను ధీటుగా ఎదుర్కొనే
అవకాశం లేకపోలేదు. కానీ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తీరు చూస్తుంటే మాత్రం పార్టీ శ్రేణులకు అలా జరుగుతుందనే విశ్వాసం కుదరడంలేదని అంటున్నారు. రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. దీంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు తమ ప్రాంతాల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని అధికార పార్టీ వైపు మొగ్గుచూపే అవకాశం లేకపోలేదు. గత
స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ఇదే పరిస్థితి కనిపించింది. వైసీపీ ఎప్పుడూ గెలవని స్థానాల్లోనూ ఆ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల్లో
గెలుపొందింది. అప్పటి ఎన్నికల పక్రియ పై అనేక విమర్శలు వచ్చాయి. ఇతర పార్టీలు, ఇండింపెం డెంట్ అభ్యర్థులు నామినేషన్లు
వేయకుండా వైసీపీ నేతలు అడ్డుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి స్థానిక సంస్థల ఎన్నికలను ఎదుర్కోబోతున్నాయి. వరదల్లో చంద్ర బాబు, టిడిపి చేస్తున్న కృషి కలసి వస్తోంది. ఈ పరిస్థితుల్లో ప్రజలు సైతం చంద్రబాబు నాయకత్వానికి అండగా నిలుస్తూ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమికి పట్టంకట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
పరిపాలన దక్షతను చాటుకున్న చంద్రబాబు…విమర్శలకే పరిమితమైన విపక్షం
Related Posts
ఏ.సి.బి వలకు చిక్కిన అవినీతి అనకొండ
మాటువేసి వేసి పట్టుకున్న అవినీతి నిరోధక శాఖ అధికారులు ప్రభాతదర్శిని,(ఒంగోలు -ప్రతినిధి):గత ప్రభుత్వ హయాంలో తిలా పాపం, తలా పిడికెడు అనే ధోరణిలో విధులు నిర్వహించి ప్రజలను పట్టి పీడించిన పలువురు ప్రభుత్వ అధికారులపై ప్రజలతో బాటు, ప్రజా ప్రతినిధులు సైతం కన్నేసి ఉన్నారు.ఇందులో భాగంగా అక్రమార్జన కోసం అర్రులు చాస్తూ ఉన్న పలువురు ప్రభుత్వ అధికారుల భరతం పట్టేందుకు నేరుగా అవినీతి నిరోధక శాఖ అధికారులను ఆశ్రయిస్తూ…
Read moreBC లోని ప్రస్తుతం కులాలు
BC- A కులాలు : . 1.అగ్నికుల క్షత్రియ, పల్లి, వాడ బలిజ, బెస్త, జాలరి, గంగవారు, గంగపుత్ర, గూండ్ల, వన్యకుల క్షత్రియ, వన్నెకాపు, వన్నెరెడ్డి, పల్లికాపు, పల్లిరెడ్డి, నెయ్యల, పట్టపు, ముదిరాజు, ముత్రాసి తెనుగోళ్ళు బాలసంతు, బహురూపి 3. బండార 4. బుడబుక్కల 5. రజక, చాకలి, వన్నార్. 6. దాసరి 7. దొమ్మర 8.గంగిరెద్దుల 9. జంగం10. జోగి 11. కాటిపాపల 12. కొర్చ 13.…
Read more