చెంచయ్య మర్డర్ ను ప్రత్యేక దర్యాప్తు చేపట్టండి
చెంచయ్య కుటుంబానికి వైసిపి అండగా ఉంటుంది
ప్రభాతదర్శిని,(పెళ్లకూరు-ప్రతినిధి):మండలంలోని చిల్లకూరు గ్రామంలోని ఎన్ డి సి సి బి మాజీ చైర్మన్ కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి నివాసంలో శనివారం జరిగిన మీడియా సమావేశంలో నెల్లూరు జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి,తిరుపతి పార్లమెంట్ సభ్యులు గురుమూర్తి , మాజీ శాసనసభ్యులు కిలివేటి సంజీవయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా తిరుపతి ఎంపీ గురుమూర్తి మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక వైఎస్ఆర్సిపి కాంగ్రెస్ పార్టీ నాయకులు పై దాడులు దుర్మార్గు పాలన సాగుతుందని తెలిపారు. గత ఐదు నెలల నుండి రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతుందని తెలిపారు ఎన్నో మటర్లు మానభంగాలు జరుగుతూ మహిళలకు రక్షణ లేకుండా పోయిందని తెలిపారు గతంలో పెళ్లకూరు మండలం రెడ్డిపాలెం గ్రామంలో మా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అనుమానస్పదంగా మర్డర్ జరిగినది దానిమీద ఖచ్చితంగా నిర్పాదస్వరంగా దర్యాప్తు జరగాలని తెలిపారు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అందరికీ అండదండగా మేముంటాం మా నాయకులపై జరిగే దాడులు ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారని రాబోవు జెమినీ ఎలక్షన్లో కూటమి ప్రభుత్వాన్ని గద్ది దింపుతామని తెలిపారు కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక మహిళలకు రక్షణ లేకుండా పోయిందని తెలిపారు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మరెన్నో ప్రజలకు సంక్షేమ పథకాలు అన్యాయని తెలిపారు కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఎన్నో సంవత్సరాలు నుండి విధులు నిర్వహిస్తున్న వాల్ ఇంటర్ లను రేషన్ డీలర్లు,ఫీల్డ్ అసిస్టెంట్లను అంగన్వాడీలను విధులను నుండి తొలగిస్తూన్నారని తెలిపారు రాబోయే ఎలక్షన్ లో కూటమి ప్రభుత్వం కి తగిన బుద్ధి చెప్పడం ఖాయమని తెలిపారు. తదుపరి కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలో వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు కార్యకర్తల జోలికి వస్తే ఊరుకునేది లేదని తెలిపారు. ఇలాంటి ఉడతా బెడతా బెదిరింపులకు పాల్పడితే వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు కార్యకర్తలు ఎవరు ఊరుకునేది లేదని తెలిపారు. వడ్డీ పాలెం గ్రామంలో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త జరిగిన మర్డర్ పై ప్రత్యేక దర్యాప్తు చేయాలని తెలిపారు. వైఎస్సార్ సీపీ పార్టీ నాయకులు పై దాడులకు కొనసాగితే మేమంతా చూస్తూ ఊరుకునేది లేదని దానికి పతికారం చూపిస్తామని తెలిపారు,తదుపరి మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విధ్వంసాలు, దాడులు,బెదిరింపులు, బ్లాక్మెయిలింగ్లు నిత్యకృత్యంగా మారిపోయాయని విమర్శించారు.వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు పై జరిగిన మర్డర్ పై కొంతమంది మండల అధికారులు నీరు కారుస్తున్నారని తెలిపారు. మర్డర్ పై దర్యాప్తు చేపట్టి దోషులను కఠినంగా శిక్షించాలని తెలిపారు. వైఎస్ఆర్ సీపీ నాయకులు కార్యకర్తలపై ధౌర్జన్యాలు,దాడులకు బెదిరింపులకు గురి చేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.వైసీపీ నాయకులపై దాడులకు తెగబడితే తీవ్రంగా ప్రతిఘటించేందుకు తాము సిద్దం అవుతామన్నారు.తదుపరి వడ్డిపాలెం గ్రామంలో బండి చెంచయ్య నివాసము చేరుకొని ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా అండగా నిలిచి లక్ష రూపాయలు చెక్కును పంపించడంతో చెంచయ్య భార్య ప్రమీలకు కొడుకు, కూతురు కు లక్ష రూపాయలు సేక్ను అందజేశారు. ఈ సందర్భంగా కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి మాట్లాడుతూ వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులకు కార్యకర్తలకు అండగా జగన్మోహన్ రెడ్డి ఉన్నారని తెలిపారు. చెంచయ్య కుటుంబానికి వైఎస్ఆర్సిపి పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. కొడుకు కూతురు కు కావలసిన సదుపాయలను సమకూర్చి ఎంతవరకు చదువుకుంటారు అంతవరకు చదువుకునే బాధ్యత నేను తీసుకుంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యులు నన్నం ప్రిస్కిల్లా, నాయుడుపేట ఎంపీపీ ధనలక్ష్మి, వైసీపీ నాయకులు మద్దాల సోమశేఖర్ రెడ్డి,కామిరెడ్డి, చిల్లకూరు సర్పంచ్ హరిబాబు రెడ్డి, రాజారెడ్డి,కటకం జయరామయ్య, రవిరెడ్డి, ఎల్లు మోహన్, రమణయ్య, సురేష్,సాగి జితేంద్ర బండి బాలు,అట్ల గోపాల్, కిష్టయ్య,చక్రపాణి,చుట్టు గురవయ్య వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
కూటమి ప్రభుత్వాన్ని గద్ధి దింపుతాం: నెల్లూరు జిల్లా వైసిపి నేతల ధ్వజం
Related Posts
అట్టహాసంగా ప్రారంభమై… అంగరంగ వైభవంగా… ముగిసిన ఫ్లెమింగో ఫెస్టివల్ 2025 వేడుకలు
ముగింపు కార్యక్రమ వేడుకలకు రాష్ట్ర రెవెన్యూ, మంత్రి అనగాని సత్యప్రసాద్ప్రభాతదర్శిని,(తిరుపతి-ప్రతినిధి): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఫ్లెమింగో ఫెస్టివల్ 2025 కార్యక్రమాలు జిల్లాలో అత్యంత ఘనంగా పండుగ వాతావరణంలో నిర్వహించడం జరిగిందని, పర్యాటక రంగ అభివృద్ధికి, సంక్షేమం అభివృద్ధి సమపాళ్లలో అమలుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఇది మంచి ప్రభుత్వం అని మూడవ రోజు ఫ్లెమింగో ఫెస్టివల్ 2025 కార్యక్రమ ముగింపు వేడుకలకు రాష్ట్ర…
Read moreఫ్లెమింగో ఫెస్టివల్ 2025 కి తరలి వస్తున్న ప్రజలు పర్యాటక ప్రేమికులు
ఆకట్టుకుంటున్న పలు శాఖల, విభాగాల స్టాల్స్ప్రజల్ని పర్యాటకులను ఆద్యంతం ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలుఫ్లెమింగో ఫెస్టివల్ కు తరలి వస్తున్న విద్యార్థులు, ప్రజలు, పర్యాటకులుజన సంద్రంగా మారిన సూళ్లూరుపేట జూనియర్ కాలేజీ ప్రాంగణంవివిధ ఆటల పోటీలతో ఆకట్టుకున్న యువత ప్రభాతదర్శిని ( సూళ్లూరుపేట-ప్రతినిధి ): రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఫ్లెమింగో ఫెస్టివల్ 2025 రెండవ రోజు అంగరంగ వైభవంగా విద్యుత్ కాంతులలో కిక్కిరిసిన జనం కేరింతలతో ఉత్సాహంగా…
Read more