ప్రభాతదర్శిని,(శ్రీకాళహస్తి -ప్రతినిధి): శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం ఈఓ చంద్ర శేఖర్ ఆజాద్ గాడి తప్పిన, భక్తులను అడ్డదారిలో దర్శనం కోసం తీసుకెళ్లే ఆలయంలో పనిచేసే సిబ్బందికి సి సి కెమెరాల నిఘా ధ్వారా, స్వీయ పర్యవేక్షణ ద్వారా దొరికినోళ్లును దొరికి నట్టు సస్పెండ్ చేస్తున్నారు. దీంతో ఈఓ పరిపాలనకు, గత ఈఓల పాలనకు వ్యవత్యాసం కొట్టొచ్చినట్టు తెలుస్తోంది. అయినా అలవాటు పడ్డ జీవులు అక్రమంగా భక్తులను దర్శనం కోసం తీసుకుని వెళ్లి జేబులు నింపుకునే ఆలయ ఉద్యోగులు, సిబ్బందికి ఈఓ విశ్వరూపంతో బేంబేలు ఎత్తుతున్నారు. అయితే సెక్యూరిటీ సిబ్బంది, ఎస్ పి ఎఫ్, హోం గార్డులు , కోర్టు సిబ్బంది మాత్రం ఇష్టారాజ్యాంగం వ్యవహరిస్తూ ఉన్నారానే విమర్శలు మాత్రం ఆగడం లేదు. అందువల్ల ఈఓ అలాంటి వారి పట్ల ఓ కన్నేసి ఉంచాలని స్థానిక భక్తులు కోరుతున్నారు. అర్చకులు, పూజార్లుకు విధులుపై అవగాహన కల్పించిన ఈఓ వారికి కూడా దశల వారీగా ఆలయం ప్రతిష్ట పెంచడానికి తగు చర్యలు చేపట్టాల్సి వుంది. ఈఓగా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచే ప్రక్షాళనకు నడుం బిగించి కట్టు, బొట్టు, జుట్టు వంటి సాంప్రదాయం అమలు చేస్తూ తనదైన ముద్ర వేసుకున్నారు. పాలనా పరమైన ఆదేశాలు జారీ చేయడంతోపాటు ఈ ఓ చంద్రశేఖర్ ఆజాద్ తాను పద్దతిగా నడుచుకుంటూ క్రమంగా సిబ్బందిలో మార్పుకు శ్రీకారం చుట్టారు. మొత్తం మీద ఈఓ చంద్రశేఖర్ ఆజాద్ పరిపాలనా విధానాలు అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్నాయి. ఇలాంటి ఈ ఓ మరి కొంత కాలం ఇక్కడే ఉంటే భక్తులు హాయిగా రాహు కేతు, ఆర్జిత సేవలు, అభిషేకలు చేసుకోవడం తథ్యం.