ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ప్రభాతదర్శిని(చిట్టమూరు-ప్రతినిధి):ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకమని ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి లీగల్ అడ్వైజర్ అశోక్ కాంప్లె అన్నారు. శనివారం చిట్టమూరు మండలం మెట్టు గ్రామంలో ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి గూడూరు నియోజకవర్గం కోట మండల కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకమని పేర్కొన్నారు. దేశంలోని మనువాద అగ్రకుల పార్టీని వారి అధికారాన్ని స్తుస్థిరం చేసుకునేందుకు ఎస్సీ ఎస్టిలను విభజించి బలహీనపరిచేందుకు కుట్రలో భాగంగానే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది అని ఆరోపించారు. అనంతరం వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి అధ్యక్షులు మీజూరు మాధవ్ మాట్లాడుతూ సర్వోన్నత న్యాయస్థానం ఆర్టికల్ 341 రిజర్వేషన్లు రాజకీయ ప్రమేయానికి వీలు కల్పిస్తూ రాష్ట్రాలకు అధికారం కలిపించిందని విమర్శించారు. ఎస్సీ వర్గీకరణ రద్దు చేసేవరకు ఈ వ్యతిరేక పోరాటం ఆగదని సుప్రీంకోర్టు దీన్ని తిరిగి స్వాగతించాలని మీడియా ముఖంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సహాయ కార్యదర్శి మల్లి చిట్టమూరు అధ్యక్షులు క్రాంతి, కార్యదర్శి సురేష్ సలహాదారులు పి రాజగోపాల్, శంకరయ్య మెట్టు గ్రామ కమిటీ మెంబర్ గ్రామస్తులు పాల్గొన్నారు.