ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి): వి.పి.ఆర్ విద్య పాఠశాల ద్వారా వందలాది మంది నిరుపేద విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమాణాలతో ఉచిత విద్యను అందించడం చాలా సంతోషాన్నిస్తుందని వి.పి.ఆర్ ఫౌండేషన్ ఛైర్పర్సన్, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అన్నారు. 2024-2025 విద్యా సంవత్సరం సందర్భంగా వి.పి.ఆర్ విద్య పాఠశాలలో ఉచిత విద్యనభ్యసిస్తున్న విద్యార్థులకు విద్యాసామాగ్రి కిట్ల పంపిణీ కార్యక్రమంలో ఆమె గురువారం పాల్గొని మాట్లాడారు. ముందుగా పాఠశాలకు చేరుకున్న ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డికి పాఠశాల ప్రిన్సిపల్ శ్రీనివాసులు, అధ్యాపక సిబ్బంది ఘన స్వాగతం పలికారు. అనంతరం సభా వేదికపైకి చేరుకున్న ఆమె.. విద్యార్థులనుద్దేశించి మాట్లాడారు. వి.పి.ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వి.పి.ఆర్ విద్య పాఠశాల ద్వారా వందలాదిమంది నిరుపేద విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యను అందించడం ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డికి, తనకు చాలా సంతోషంగా ఉంటుందన్నారు. పాఠశాల ఆవరణలోకి వస్తేనే తమకు ఉన్న ఒత్తిడి అంతా మర్చిపోతామన్నారు. వి.పి.ఆర్ విద్య పాఠశాలలో చదువుకున్న విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించడంపై ఆమె సంతోషం వ్యక్తం చేశారు. ఇటీవల 10వ తరగతి ఫలితాల్లో 30 మంది పరీక్షలు రాస్తే 100 శాతం ఉత్తీర్ణత సాధించారన్నారు. వారిలో 27 మంది విద్యార్థులు 500 మార్కులకుపైగా సాధించడం గర్వంగా ఉంటుందన్నారు. పాఠశాలలో చదివే విద్యార్థులపై వారి తల్లిదండ్రులు కూడా ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని ఈ సందర్భంగా సూచించారు. విద్యార్థులు ఉత్తమ పౌరులుగా, దేశానికి మంచి సేవలు అందించాలంటే క్రమశిక్షణ చాలా అవసరమన్నారు. ఈ సందర్భంగా నూతనంగా 6వ తరగతికి ఎంపికైన విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు శుభాకాంక్షలు తెలిపారు. పాఠశాలలో ఇంకా మెరుగైన వసతులు కల్పించేందుకు కృషి చేస్తున్నామన్నారు. అనంతరం విద్యార్థులకు బ్యాగులు, షూస్, యూనిఫాం, ఇతర విద్యాసామాగ్రితో కూడిన కిట్లను అందించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు కేతంరెడ్డి వినోద్‌రెడ్డి, పాఠశాల అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.
ఉచిత విద్యను అందించడం సంతోషాన్నిస్తుంది…కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి
Related Posts
నక్కలకాలనీ సమగ్ర అభివృద్ధికి చర్యలు: సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి
ప్రభాత దర్శిని( నెల్లూరు బ్యూరో) నక్కలకాలనీ సమగ్ర అభివృద్ధికి చర్యలు చేపట్టనున్నట్లు సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. వెంకటాచలం మండలం చెముడుగుంట పంచాయతీ పరిధిలోని నక్కలకాలనీలో పర్యటన సందర్భంగా సోమిరెడ్డి అన్ని శాఖల అధికారులతో కలిసి కాలనీలో పర్యటించి ప్రజా సమస్యలపై ఆరా తీసిన అనంతరం ఆయన మాట్లాడుతూ 1983లో నందమూరి తారక రామారావు ప్రభుత్వ హయాంలో నక్కలకాలనీలో ఒక్కో కుటుంబానికి 33 అంకణాల స్థలం…
Read moreసంక్షేమ కార్యక్రమాల్లో బిజీ బిజీగా ఎమ్మెల్యే దామచర్ల
ప్రభాత దర్శిని (ఒంగోలు-ప్రతినిధి):టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, ఒంగోలు నియోజకవర్గ శాసన సభ్యులు దామచర్ల జనార్ధన్ రావు శుక్రవారం ఉదయం నుండి పలు కార్యక్రమాలలో పాల్గొన్న బిజీ బిజీగా నాయకులతో కలిసి కార్యక్రమాలలో పాల్గొన్నారు ఒకవైపు ప్రారంభోత్సవాలు, మరో వైపు ఆదరింపులు అన్ని కార్యక్రమాలలో పాల్గొన్నారు. ముందుగా ఒంగోలు నగరంలోని 30వ డివిజన్ నందు 32 లక్షలతో నిర్మించిన ఆరామక్షేత్రం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నడం జరిగినది. ఈ సందర్భంగా స్థానికులను…
Read more