ప్రిన్సిపాల్ పవన్ కుమార్ సింగ్

ప్రభాతదర్శిని (ఓజిలి-ప్రతినిధి):మండలంలోని వాకాటి వారి కండ్రిగ ఏకలవ్య గురుకుల పాఠశాల అండ్ కళాశాలలో ఇంటర్మీడియట్ విద్యార్థులకు జేఈఈ నీట్ పరీక్షలకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నట్లు ప్రిన్సిపాల్ పవన్ కుమార్ సింగ్ తెలిపారు. శనివారం ఆయన ప్రభాత దర్శిని ప్రతినిధితో మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనల మేరకు తమ కళాశాలలో విద్యార్థులకు మంచి విద్యాబుద్ధులు నేర్పుతున్నట్లు తెలిపారు. అలాగే కళాశాల క్యాంపస్ లో క్లీన్ అండ్ గ్రీన్ ఉంచేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. పచ్చదనమును పెంపొందించేందుకు 400 మొక్కలను నాటినట్లు వివరించారు. ప్రభుత్వం సూచించిన మెనూ ప్రకారం విద్యార్థులకు పౌష్టిక ఆహారాన్ని అందిస్తున్నట్లు తెలిపారు. అలాగే పరిశుభ్రతపై విద్యార్థులకు వివరించడంతోపాటు తమ కళాశాల ఆవరణంలో పారిశుద్ధ్యనికి పెద్ద పీఠాధిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తుకు సెంట్రల్ సిలబస్ ను ఆంగ్లంలో బోధిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థుల ఉన్నత భవిష్యత్తుకు తమ సిబ్బంది చిత్తశుద్ధితో కృషి చేస్తున్నట్లు వివరించారు. క్రమశిక్షణతో విద్యార్థులను తీర్చిదిద్ది వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తున్నట్లు తెలిపారు.