ఏపీ సిఎం చంద్రబాబు ను కోరిన మందా…కృష్ణ మాదిగకు శుభాకాంక్షలు తెలిపిన నారా
ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి): ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ ను వెంటనే అమలు చేయాలని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ ఏపీ ముఖ్యమంత్రి, ఎస్సీ వర్గీకరణ చట్ట రూపశిల్పి చంద్రబాబు నాయుడు ని కలిసి కోరారు. శనివారం హైదరాబాద్ లో ఏపీ సిఎం చంద్రబాబు నాయుడును మంద కృష్ణ మాదిగ కలిసి కృతజ్ఞతలు తెలిపారు. సుప్రీం కోర్టు తీర్పు ద్వారా ఎస్సీ వర్గీకరణ కోసం సాగిన ఉద్యమం విజయాన్ని ముద్దాడిన నేపథ్యంలో ఎస్సీ వర్గీకరణ చట్టానికి పురుడుపోసి ఆయుధంగా మలిచిన చంద్రబాబు నాయుడుకి శాలువా కప్పి పుష్ప గుచ్చo అందించి మంద కృష్ణ మాదిగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ఏపీ సిఎం చంద్రబాబు ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ ను వెంటనే అమలు చేయాలని కోరారు. చంద్రబాబు నాయుడు చేసిన ఎస్సీ వర్గీకరణ చట్టమే సుప్రీం కోర్టు న్యాయ విచారణలో విజయం సాధించిందని మంద కృష్ణ మాదిగ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ మొదటి అమలు చేసింది చంద్రబాబు నాయుడే.అలాగే ఇప్పుడు సుప్రీం కోర్టు తీర్పు ద్వారా విజయం సాధించిన తరువాత అమలు జరగాల్సిన సమయంలో ఏపీ కి ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉండడం శుభ పరిణామమని అన్నారు. త్వరగా ఎస్సీ వర్గీకరణను అమలులోకి తీసుకు రావాలని కోరారు.ఇందుకు స్పందించిన చంద్రబాబు నాయుడు ముప్ఫై ఏళ్ళు మడమ తిప్పకుండా గట్టిగా పోరాడడం వల్లే విజయం సాధ్యమైందని, మడమ తిప్పని పోరాటంతో విజయం సాధించావని మంద కృష్ణ మాదిగని అభినందించి, శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా మంద కృష్ణ మాదిగ కి శాలువా కప్పి, పుష్ప గుచ్ఛం అందించి అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ నాయకులు పాల్గొన్నారు.
ఎస్సీ వర్గీకరణను వెంటనే అమలు చేయాలి
Related Posts
వి.ఎస్.యు. ఎన్.ఎస్.ఎస్. ప్రోగ్రామ్ అధికారులకు జిల్లా స్థాయి ప్రశంస పత్రాలు
ప్రభాతదర్శిని, (ప్రత్యేక- ప్రతినిధి):జిల్లాలో వివిధ విభాగాల్లో విశేషమైన సేవలు అందించిన ఉద్యోగులను 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా కలెక్టర్ ప్రశంసిస్తూ జిల్లా స్థాయి ప్రశంస పత్రాలను అందజేశారు. ఈ అవార్డుకు వి.ఎస్.యు ఎన్.ఎస్.ఎస్.కి చెందిన 5 ప్రోగ్రామ్ అధికారులు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా, ఉపకులపతి ఆచార్య ఎస్. విజయభాస్కర రావు ప్రశంసా పత్రాలను అందుకున్న ప్రోగ్రామ్ అధికారులను ప్రత్యేకంగా అభినందించారు. ఆయన మాట్లాడుతూ, “జాతీయ సేవా పథకం (ఎన్.ఎస్.ఎస్.)…
Read moreనేడు జిఎస్ఎల్వి.ఎఫ్ 15 ఎన్విఎస్ -02 ప్రయోగం…సెంచరీతో చరిత్ర సృష్టించనున్న ఇస్రో
నావిగేషన్ అభివృద్ధి పరచే దేశాల సరసన భారత్ప్రభాతదర్శిని, (సూళ్లూరుపేట-ప్రతినిధి): భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో 100వ ప్రయోగానికి ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ మేరకు కౌంట్ డౌన్ మొదలయ్యింది. బుధవారం ఉదయం 6:23 నిమిషాలకు 100వ ప్రయోగం శ్రీహరికోట లోని రెండవ రాకెట్ ప్రయోగ వేదిక నుండి జి ఎస్ ఎల్ వి ఎఫ్ 15 ను ప్రయోగించుకున్నారు. జియో ట్రాన్స్ఫర్ ట్రాన్స్ఫర్ ఆర్బిటాల్ కక్షలోకి చేరుకునే…
Read more