తొలిదశ ఇంజనీరింగ్ ప్రవేశాలకు 22 చివరి తేదిసాంకేతిక విద్యా శాఖ సంచాలకురాలు డాక్టర్ నవ్య ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి): ఏపీ ఈఏపిసెట్ 2024 మొదటి దశ అడ్మిషన్లకు సంబంధించి సీట్లు పొందిన విద్యార్థులు తప్పనిసరిగా సోమవారం లోపు రిపోర్టింగ్ పూర్తి చేయాలని సాంకేతిక విద్యా శాఖ సంచాలకురాలు డాక్టర్ బి నవ్య తెలిపారు. సీట్ల కేటాయింపు 17వ తేదీన జరిగిందని, సీటు దక్కించుకున్న అభ్యర్థులు పోర్టల్లో సెల్ఫ్ రిపోర్టింగ్, కాలేజీలో ఫిజికల్ రిపోర్టింగ్ తో పాటు అన్ని కార్యక్రమాలను 22వ తేదీ లోపు పూర్తి చేసుకోవాలన్నారు. నిర్దేశించిన తేదీని ఖచ్చితంగా పాటించాలని, విద్యార్థులు రిపోర్ట్ చేయక పోతే కేటాయించిన సీటు 23వ తేది నాటికి ఖాళీగా పరిగణించబడుతుందని డాక్టర్ నవ్య హెచ్చరించారు. మరోవైపు 23 నుండి ప్రారంభమయ్యే 2వ దశ అడ్మిషన్ కౌన్సెలింగ్ కు అందుబాటులో ఉన్న సీటుగా చేర్చబడుతుందన్నారు. అన్ని ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యాలు అభ్యర్థి కళాశాలలో నివేదించిన వెంటనే పోర్టల్లో చేరే వివరాలను అప్ డేట్ చేయాలని స్పష్టం చేసారు. కళాశాల యాజమాన్యాలు తప్పనిసరిగా 23 నాటికి పోర్టల్లో అప్డేట్ చేయాలన్న విషయాన్ని పరిగణన లోకి తీసుకోవాలన్నారు.
రిపోర్టింగ్ పూర్తి చేయకుంటే సీటు రద్దు
Related Posts
ఏ.సి.బి వలకు చిక్కిన అవినీతి అనకొండ
మాటువేసి వేసి పట్టుకున్న అవినీతి నిరోధక శాఖ అధికారులు ప్రభాతదర్శిని,(ఒంగోలు -ప్రతినిధి):గత ప్రభుత్వ హయాంలో తిలా పాపం, తలా పిడికెడు అనే ధోరణిలో విధులు నిర్వహించి ప్రజలను పట్టి పీడించిన పలువురు ప్రభుత్వ అధికారులపై ప్రజలతో బాటు, ప్రజా ప్రతినిధులు సైతం కన్నేసి ఉన్నారు.ఇందులో భాగంగా అక్రమార్జన కోసం అర్రులు చాస్తూ ఉన్న పలువురు ప్రభుత్వ అధికారుల భరతం పట్టేందుకు నేరుగా అవినీతి నిరోధక శాఖ అధికారులను ఆశ్రయిస్తూ…
Read moreBC లోని ప్రస్తుతం కులాలు
BC- A కులాలు : . 1.అగ్నికుల క్షత్రియ, పల్లి, వాడ బలిజ, బెస్త, జాలరి, గంగవారు, గంగపుత్ర, గూండ్ల, వన్యకుల క్షత్రియ, వన్నెకాపు, వన్నెరెడ్డి, పల్లికాపు, పల్లిరెడ్డి, నెయ్యల, పట్టపు, ముదిరాజు, ముత్రాసి తెనుగోళ్ళు బాలసంతు, బహురూపి 3. బండార 4. బుడబుక్కల 5. రజక, చాకలి, వన్నార్. 6. దాసరి 7. దొమ్మర 8.గంగిరెద్దుల 9. జంగం10. జోగి 11. కాటిపాపల 12. కొర్చ 13.…
Read more