ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి): ఓజిలి మండలం రెవెన్యూ తాహశీల్దార్ గా పనిచేస్తున్న అరవ పద్మావతి ని సస్పెండ్ చేస్తూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. తాహశీల్దార్ అవినీతి అవకతవకలపై ‘ప్రభాతదర్శిని’ ప్రచురించిన వరుస కథనాలపై కొందరు బాధితులు సిసిఎల్ అధికారులకు ఫిర్యాదు చేశారు. సిసిఎల్ అధికారులు తాసిల్దార్ ఇచ్చిన తప్పుడు నివేదికలు ఎండార్స్ మెంట్స్ ను పరిశీలించి వేటు వేశారు. తప్పుడు నివేదికలు ఇవ్వడంలో, అవినీతి సంపాదనకు అలవాటు పడిన ఈ తాహశీల్దార్ ఏకంగా సిసిఎల్ అధికారులను తప్పు దారి పుట్టించే విధంగా ఓజిలి మండలం కార్జీమేడు గ్రామానికి చెందిన ఓ వ్యక్తి భూ రికార్డులపై విఆర్ఓ నివేదిక లేకుండానే స్వంత నివేదిక ఇచ్చి వేటు కు గురైనారు. ఓజిలి మండలంలో భూ సర్వే తర్వాత భూ సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. అప్పటి సర్వే డీపీ ప్రస్తుతం ఓజిలి తాహశీల్దార్ కార్యాలయం రెగ్యులర్ డీటీగా పనిచేస్తున్న మధుసూదన్ రాజు భూ రికార్డులను తారుమారు చేసినట్లు తీవ్ర విమర్శలు ఉన్నాయి. రికార్డులను సరిచేసే పేరుతో రైతులు రెవెన్యూ కార్యాలయం చుట్టూ తిరుగుతున్న వారు పైసలు ఎవరికి ఇస్తే వారికి పనిచేస్తూ అవినీతి అవకతవకులకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో మండలంలోని వాకాటి వారి కండ్రిగ, మనవాలి, వీర్లగునపాడు, భట్ల కనుపూరు గ్రామాలలో భూ సమస్యలపై ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఫిర్యాదులు చేసిన రెవెన్యూ కార్యాలయంలో పనిచేస్తున్న కొంతమంది సిబ్బంది సిండికేట్ గా మారి తప్పు నివేదికలు ఇస్తూ లక్షలాది రూపాయలను వెనకేసుకొస్తున్న విషయంపై ఫిర్యాదు చేసిన పట్టించుకున్న దాఖలు లేవు. దీంతో కొందరు జిల్లాస్థాయి రాష్ట్ర స్థాయి అధికారులకు ఫిర్యాదు చేయడంతో తాసిల్దార్ అవినీతి అవకతవకలు బయటపడ్డాయి. వాకాటి వారి కండ్రిగ గ్రామంలో ప్రభుత్వ భూములకు ఓ ప్రబుద్ధుడు 2005 వ సంవత్సరములో ‘తాసిల్దార్’ సీలుతో నకిలీ పట్టాదార్ పాస్ పుస్తకాలు సృష్టించి అమ్మివేసిన విషయంపై ఓజిలి చెందిన సీనియర్ జర్నలిస్ట్ నన్నూరు శ్రీనివాసరావు సాక్ష్యాధారాలతో జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. జిల్లా కలెక్టర్ ఈ విషయమై సూళ్లూరుపేట ఆర్డీవోను నివేదిక కోరారు. సూళ్లూరుపేట ఆర్డిఓ అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న తాసిల్దార్ని నివేదిక ఇవమని కోరడంతో తాహశీల్దార్ పద్మావతి నకిలీ పట్టాదారు పాసుపుస్తకాలు తయారుచేసి అమ్మివేసిన వ్యక్తి నుండి ఓజిలి రాచపాళెం కు చెందిన ఓ తెలుగుదేశం పార్టీ చోటా నాయకుడి ద్వారా తాహశీల్దార్ ఐదు లక్షలు లంచం పుచ్చుకొని, తప్పు నివేదిక ఇచ్చారు. తన అవినీతి అవకతవకలను కప్పిపుచ్చుకునే క్రమంలో తాసిల్దార్ సమస్యను పరిష్కరించామని, ఫిర్యాదారుడు కి ఎలాంటి ఎండార్స్మెంట్ ఇవ్వకుండా నివేదిక ఇచ్చారు. ఈ విషయమై ఫిర్యాదుదారుడు రెండోసారి కలెక్టర్ కు ఫిర్యాదు చేయడంతో పాటు, వీర్ల గునపాడు గ్రామంలో ఓ వ్యక్తికి భూ సమస్య కు సంబంధించి ఒకసారి ఒకరి పేరుతో ఉన్నట్లు మరోసారి మరో వ్యక్తి పేరుతో ఉన్నట్లు ఒకే సర్వే నెంబర్ కు రెండు ఎండార్స్మెంట్లు ఇవ్వడంతో బాధితుడు సిసిఎల్ లకు ఫిర్యాదు చేయడంతో తాసిల్దార్ అవినీతి బట్టలయింది. ఆయా అంశాలను పరిగణలకు తీసుకొని తాసిల్దార్ పద్మావతిని సస్పెండ్ చేస్తూ ఉన్నత అధికారులు ఆదేశాలు జారీచేశారు.
