ప్రభాతదర్శిని, (అమరావతి-ప్రతినిధి):టమోటా ధరలపై రైతులకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు భరోసా ఇచ్చారు. ఏవైనా ఇబ్బందులు తలెత్తినపుడు, రైతులకు ఎటువంటి నష్టం కలగకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని మంత్రి హామీ ఇచ్చారు. ఆదివారం రాప్తాడు మార్కెట్లో టమోటా ధరలు గరిష్టం రూ.18, కనిష్టం రూ.9, మోడల్ ధర రూ.12గా ఉన్నాయి. 30–40 మెట్రిక్ టన్నుల సరుకు పత్తికొండ మార్కెట్‌కు వస్తుందని, దసరా సెలవుల కారణంగా 10 టన్నులు అదనంగా చేరినట్లు, రోడ్లపై 2వ గ్రేడ్ క్వాలిటీ టమాటాలు వేసి గందరగోళం సృష్టించబడినట్లు మంత్రి వివరించారు. ఇప్పటివరకు 10 మెట్రిక్ టన్నుల టమోటాలను వివిధ రైతు బజార్లకు పంపించామని, ఈ రోజు పత్తికొండ మార్కెట్ నుంచి 10 మెట్రిక్ టన్నులు చిత్తూరు ప్రొసెసింగ్ యూనిట్‌కు, 15 మెట్రిక్ టన్నులు రైతు బజార్లకు పంపిణీ చేయనున్నట్లు చెప్పారు. తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రకు సరుకు వర్షాల కారణంగా తగ్గిన నేపథ్యంలో, ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల టమాటా అమ్మకాలు మందగించాయని మంత్రి అచ్చెన్నాయుడు వివరించారు. ప్రస్తుతం టమాటాలకు ట్రెండింగ్ ధర బట్టి రైతులకు మంచి ధర లభిస్తోంది. ఏవైనా ఇబ్బందులు తలెత్తితే ప్రభుత్వం అన్ని విధాలుగా రైతులను ఆదుకుంటుందని మంత్రి హామీ ఇచ్చారు.
															 
							
						
				
	
		
	 
	
		
		నన్నూరు శ్రీనివాసరావు  పత్రిక రంగంలో 30 ఏళ్ల అనుభవం ఉన్న అనుభవజ్ఞుడైన పాత్రికేయుడు. ఆంధ్రప్రదేశ్‌లోని ఉమ్మడి నెల్లూరు జిల్లా కి చెందిన శ్రీనివాసరావు, తన ప్రాతికేయ వృత్తిని గ్రామీణ ప్రాంతము నుండి నెల్లూరు తిరుపతి జిల్లాలలో మొదలైంది. వామపక్ష పాత్రికేయ దిగ్గజాలైన మోటూరు హనుమంతరావు సంపాదకీయంలో  వెలువడిన 'ప్రజాశక్తి' దినపత్రికలో ఓనమాలు నేర్చుకొని, మరో వామపక్ష పాత్రికేయ దిగ్గజం ఈడుపుగంటి నాగేశ్వరరావు సంపాదకీయంలో వెలువడిన 'విశాలాంధ్ర' తెలుగు దినపత్రికలో  పత్రిక రంగంలో తుది మెరుగులు దిద్దుకున్నారు. 14 సంవత్సరాల పాత్రికేయ వృత్తిలో సంపాదించుకున్న అనుభవాన్ని 'ప్రభాతదర్శిని' తెలుగు దినపత్రిక ద్వారా సంపాదకులుగా మారారు. వామపక్ష భావజాలంతో సామాజిక, రాజకీయ, ఆర్థిక అంశాలపై లోతైన వార్త కథనాల విశ్లేషణలు అందించడానికి ఈ వృత్తిని  సమాజానికి అంకితం చేశారు. పత్రిక రంగంలో గ్రామీణ, పట్టణ, జిల్లా క్రైమ్ రిపోర్టర్ గా, సబ్ ఎడిటర్, డెస్క్ ఇంచార్జిగా పేజీ మేకింగ్ హోదాలో డెస్క్ లో విస్తృతమైన అనుభవంను సముపార్జన చేసి  జర్నలిజంపై మక్కువతో  "తప్పుడు వార్త కథనాలను ప్రచురించడం కూడా పత్రిక స్వేచ్ఛ కాలరాయడమే" అనే సిద్ధాంతంతో నిబద్ధత, నైతిక విలువలు, సామాజిక స్పృహతో కూడిన వార్త కథనాలతో ప్రజలకు అందించేందుకు ముందుకు సాగుతున్నారు. గణనీయమైన శిష్యుల బృందం కలిగిన నన్నూరు శ్రీనివాసరావు తన శిష్యులను కూడా జర్నలిజంలో తన స్థాయికి ఎదిగేందుకు కృషి చేస్తు బహుముఖ ప్రజ్ఞాశాలిగా సమాజంలో స్థానాన్ని సంపాదించుకున్నారు.