ఎవరి ప్రయోజనాల కోసం లేని పోస్టును సృష్టించారు?
నెల్లూరు కే ఎ సి ప్రభుత్వ కళాశాలలో నిబంధనలకు పంగనామాలు

ప్రభాతదర్శిని, (నెల్లూరు-బ్యూరో) : నెల్లూరు కేఏసి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రభుత్వనిబంధనలకు పంగనామాలు పెట్టారు. కే ఏ సి కళాశాలలో తెలుగు సబ్జెక్టుకు రెండు పోస్ట్ ఉండగా లేని మరో పోస్టుకు నియమాకం చేసి నిబంధనలను ఉల్లంఘించారు. తెలుగు సబ్జెక్టుకు ఇద్దరు కాంట్రాక్టు లెక్చరర్స్ను నియమించి కొత్త వివాదానికి తెర లేపారు. 250 మంది విద్యార్థులకు ముగ్గురు తెలుగు లెక్చరర్ల బోధనలలో మతలబు ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. అదే కళాశాలలో 175 మంది విద్యార్థులకు ఒక్కరే కెమిస్ట్రీ లెక్చరరే భోదిస్తున్నారు. ఇంత మంది విద్యార్థులకు విద్యాభోదన చేయడం కష్టమని తెలిసిన, మరొక లెక్చరర్ను నియమించాలన్న ఆలోచన రాకపోవడంగాని, ప్రయత్నం చేయడంగాని చేయాలేదు. ఒక్క తెలుగు
సబ్జెక్టు పైనే ఎందుకంత వల్లమాలిన ప్రేమో అందులోగల అంతర్యం ఏమిటో ఆలోగుట్టు పెరుమాళ్లకే ఎరుక. అదే కళాశాల లో రేషనలై జేషన్ పేరుతో పనిచేస్తున్న ఇద్దరు పర్మనెంట్ లెక్చరర్లను పోస్టులతో సహా పంపించి… అక్కడే ఇద్దరు తెలుగు కాంట్రాక్టు లెక్చరర్లను నిబంధనలకు విరుద్ధంగా నియామకం చేయడం విశేషం. కొందరు అధికారుల అండదండలతో రూల్స్ కు విరుద్ధంగా ఇష్టారాజ్యంగా లేని పోస్టుకు నియమించారు. ఇప్పటికే ఒకరెగ్యులర్ తెలుగు ఆధ్యాప కుడు పనిచేస్తున్నాడు. ఇదే కళాశాలలో కెమిస్ట్రీ లెక్చరర్ 175 మంది విద్యార్థులకు విద్యాబోధన చేస్తున్నారు. కనీసం ఒక గెస్ట్ ఫ్యాకల్టీని కూడా నియామకం చేయ్యలేదు. ఇంటర్ ఉన్నతాధికా రులకు తెలుగు సబ్జెక్టు మీద ఉన్న ప్రేమ, కెమిస్ట్రీ సబ్జెక్టు పైన ఎందుకు లేదో అని జిల్లాలో అధ్యాపకులు చర్చించుకుం టున్నారు. కాంట్రాక్టు లెక్చరర్స్ సర్దుబాటులో నెల్లూరు జిల్లాలో ఇద్దరు తెలుగు కాంట్రాక్ట్ లెక్చరర్లు జిల్లాలో పోస్టులు మిగిలారు. పక్క జిల్లాకు వెళ్ళమని చెప్పినా. కూడా కీలక అధికారి అండదండలు మెం దుగా ఉండటంతో జిల్లాలో దాటి వెళ్లలేదు. ఒక్కరి కోసమే పోస్టు వేస్తే ఇబ్బందులు వస్తాయని ముందు సీనియర్ గా ఉన్న ఇంకో వ్యక్తి వద్ద డబ్బులు తీసుకొని నెల్లూరు కేఏసీ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో లేని తెలుగు పోస్టులను సృష్టించి, నియమాకం చేశారు. ఇందులో మతలబు ఏమిటో ఎవరికి అర్థం కావడం లేదు. ఎందుకు ఉన్నతాధికారులు నిబంధనలకు వ్యతిరేకం గా ఈ కాంట్రాక్ట్ లెక్చరర్స్ కు అండగా వ్యవహరిస్తున్నారో వారికే తెలియాలి. ఈ విషయం ఇంటర్ డైరెక్టర్కు తెలుసా! తెలీదా !! ఇది కింది ఉన్నతాధికారుల పనేనా? తెలియాల్సి ఉంది. కేఏసి ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ విద్యార్థుల విద్యాభివృద్ధికి ఎంతగానో కృషి చేసేవారు. ఇలా అడ్డదారిలో పోస్టింగ్స్ తెచ్చుకొని చేరుతుంటే, ఎందుకు మౌనం గా ఉన్నారు. ఉన్నతాధికారుల ఒత్తిడి ఆయనపై ఎంతఉందో తెలుగు రెండు కాంట్రాక్ట్ పోస్ట విషయంలో అర్థమవుతుంది. ఏది ఏమైనా ఎవరికినచ్చిన విధంగా వారు వ్యవహరిస్తున్నారు. ఈ విషయంపై విచారణ చేపడితే, ఇదంతా ఎవరు చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారో తెలుస్తుంది. విద్యార్థుల విద్యాభివృద్ధికి అన్ని సబ్జెక్టుల విషయంలో కూడా పక్షపాతం లేకుండా వ్యవహరిస్తే, బాగుంటుందని పలువురు కోరుతున్నారు.