ప్రభాతదర్శిని (ప్రత్యేక- ప్రతినిధి): నాయుడుపేట మండలం పుదురు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకుల విద్యార్థులు ఇంటర్మీడియట్ పరీక్షల్లో అత్యున్నత మార్కులు సాధించి తమ హవాను చాటుకున్నారు. ఇక్కడ చదువుతున్న విద్యార్థులు సీనియర్ ఇంటర్మీడియట్లో 99 శాతం, జూనియర్ ఇంటర్మీడియట్ లో 86 శాతం ఉత్తీర్ణత సాధించారు. జూనియర్ ఇంటర్లో ఎంపీసీ గ్రూపులో ఎన్ శృతి 440 మార్కులు, బైపీసీలో పి నేహాలత 417 మార్కులు సాధించారు. అలాగే సీనియర్ ఇంటర్లో ఎంపీసీలో బి నందిని 934 మార్కులు, బైపిసి లో షకీలా 963 మార్కులు సాధించారు. అలాగే సీనియర్ ఇంటర్, బైపీసీలో 11మంది 900 మార్కులు పైన, ఎంపీసీలో ఒకరు 900 మార్కులుపైన సాధించారు. అలాగే జూనియర్ ఇంటర్లో ఎంపీసీలో తొమ్మిది మంది, బైపీసీలో ఐదు మంది 400 మార్కులు పైన సాధించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ కె.రౌతు రమోల విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తమ కళాశాల అధ్యాపకుల కృషి ఫలితమే ఇంటర్మీడియట్ ఫలితాలని ఆమె తెలిపారు.
ఇంటర్ లో పుదూరు గురుకులం విద్యార్థుల హవా
Related Posts
వినుత దంపతులను చంపాలని ఎమ్మెల్యే ఆదేశాలు
శ్రీకాళహస్తి సోషల్ మీడియాలో వీడియో హల్ చల్…రెండుసార్లు ఆక్సిడెంట్ చేయడానికి ప్రయత్నించావినుత రాజకీయ వ్యక్తిగత విషయాలు చేరవేశా…తనకు ఎమ్మెల్యే ఇరవై లక్షలు ఇచ్చారని వెల్లడిసెల్ఫ్ వీడియోలో రాయుడు సంచలన విషయాలు…కూటమినేతుల రాజకీయ భవిష్యత్తుపై నీలి నీడలుప్రభాతదర్శిని (శ్రీకాళహస్తి – ప్రతినిధి ): శ్రీకాళహస్తిలో గత రెండు నెలలు క్రితం శ్రీకాళహస్తి నియోజకవర్గం జనసేన మాజీ ఇంచార్జి కోటా వినుత వ్యక్తిగత డ్రైవర్ శ్రీనివాసులు అలియాస్ రాయుడు హత్య…
Read moreపరిపాలనలో ‘ఐఏఎస్ ముద్ర’…పనిచేసిన ప్రతిచోట ‘ప్రజాకలెక్టర్’గా ‘రాజముద్ర’
అభివృద్ధిలో ఆదర్శవంతం గా శివశంకర్ సేవలుప్రభాతదర్శిని,(ప్రత్యేక-ప్రతినిధి): పరిపాలనలో సరికొత్త వరవడికి శ్రీకారం చుడున్న ఐఏఎస్ ఆఫీసర్ శివ శంకర్ అభివృద్ధిలో ఆదర్శవంతంగా నిలుస్తున్నారు. పనిచేసిన ప్రతిచోట ప్రజా అభివృద్ధికి బీజం వేస్తూ సరికొత్త అభివృద్ధి కార్యక్రమాలకి నాంది పలుకుతూ ప్రజా హారతులు పొందుతున్నారు. తద్వారా ఐఏఎస్ అధికారి ప్రజల కోసం తన సర్వీసును ఎలా ఉపయోగించాలో మాటల ద్వారా కాకుండా చేతలలో చూపుతూ తన ఉద్యోగ ధర్మాన్ని…
Read more