• మర్యాదపూర్వకంగా కలిసిన ఆర్ హెచ్ వి ఎస్ ప్రతినిధులు
  • శ్రీరామ రథయాత్రకు సహకరిస్తాం
  • ప్రభాతదర్శిని,(తిరుపతి-ప్రతినిధి): నేటి అత్యాధునిక సాంకేతిక యుగంలో ఆధ్యాత్మిక ప్రగతికి, హిందూ ధర్మ పరిరక్షణకు, సనాతన ధర్మ వ్యాప్తికి ప్రతి ఒక్క హిందూ బంధువు కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని తిరుపతి ఎస్పీ హర్షవర్ధన్ రాజు పేర్కొన్నారు. గురువారం సాయంత్రం ఆయనను రాష్ట్రీయ హిందూ వాహిని సంఘటన ( ఆర్ హెచ్ వి ఎస్ ) ప్రతినిధుల బృందం మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించి, స్వామి వివేకానంద జీవిత చరిత్ర పుస్తకాన్ని బహూకరించి అభినందించారు. ఈ సందర్భంగా ఎస్పీ హర్షవర్ధన్ రాజు మాట్లాడుతూ భవిష్యత్తులో తిరుపతి నుంచి అయోధ్య వరకు కొనసాగే శ్రీరామ రథయాత్రకు తమ వంతు సహాయ సహకారాలు సంపూర్ణంగా అందిస్తామన్నారు. ఎస్పీ ని కలిసిన వారిలో రాష్ట్రీయ హిందూ వాహిని సంఘటన రాష్ట్ర అధికార ప్రతినిధి, రాష్ట్ర ఉపాధ్యక్షులు, రాష్ట్ర మీడియా కోఆర్డినేటర్ సుకుమార్ రాజు, రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు రుద్రరాజు శ్రీదేవి, రాష్ట్ర ఉపాధ్యక్షులు శంకర్రాజు, రిటైర్డ్ హెడ్మాస్టర్ వేణుగోపాల్, జిల్లా ఉపాధ్యక్షులు వెంకటేశ్వర్లు, సుందర కుమార్ రాజు ఉన్నారు.