ప్రభాతదర్శిని, (విశాఖ-ప్రతినిధి):వెనకటికి ఒకడు తప్పు చేశానని ఆయన చెప్పుతో కొట్టాడు కానీ ఆ చెప్పు బంగారంతో చేసిందని చెప్పుకుని సంతోషపడ్డాడట… ఇప్పుడు వైసీపీ పరిస్థితి అంతే ఉంది. చంద్రబాబు విశాఖ రుషికొండ ప్యాలెస్ విషయంలో జగన్ రెడ్డి నిర్వాకాన్ని బయటపెడితే… చంద్రబాబు పొగిడారని ప్రచారం చేసేసుకుంటున్నారు. ఈ దొంగలకు ఇంత ఇన్నోవేషన్ ఎక్కడి నుంచి వస్తుందో అని చంద్రబాబు ఆశ్చర్యపోయారు. దొంగలన్న సంగతి మర్చిపోయి ఇదిగో ఇన్నోవేషన్ అని.. మా జగన్ అన్ననే అన్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటున్నారు. కానీ దొంగ అని కూడా ఒప్పుకుంటున్నామని వారికి అర్థం కాలేదు. చంద్రబాబు ఏమన్నారో వీడియోలు మాత్రం పెట్జడం లేదు. కానీ పొగిడారంటూ పేపర్ క్లిప్‌లు పెట్టి ప్రచారం చేసుకుంటున్నారు. ప్రజా సొమ్మును దుర్వినియోగం చేసి నిర్మించిన భవనం విషయంలో జగన్ వ్యహరించిన తీరును తప్పు పట్టారు. పర్యవరణ విధ్వంసాన్ని చేసింది కాకుండా జపాన్ టెక్నాలజీని తెచ్చి కొండ చరియలు పడకుండా కోట్లు ఖర్చు పెట్టారు. ఇలాంటివన్నీ ఏ మాత్రం బాధ్యత లేని వ్యక్తులే చేస్తారని మండిపడ్డారు. జగన్ రెడ్డి నిర్వాకాన్ని ప్రజలకు చూపించాలని నిర్ణయించారు. దీనికే చంద్రబాబు పొగిడితే జగన్ రెడ్డి జీవితానికి అంత కంటే గుర్తింపు ఉండదనుకుని అవే పొగడ్తలనుకుని ప్రచారం చేసేసుకుంటున్నారు. వైసీపీ సోషల్ మీడియాను ఎవరు డీల్ చేస్తున్నారో కానీ ఉదయం నుంచి జగన్ ను పొగిడిన చంద్రబాబు అంటూ ప్రచారం చేసుకుంటూనే ఉన్నారు. వాటిని చూసి టీడీపీ కార్యకర్తలు నవ్వుకుంటూనే ఉన్నారు. అసలు చంద్రబాబు పొగిడారో తిట్టారో తెలుసుకోలేనంత అమాయకులు.. జగన్ పరువు తీస్తున్నారని కొంత మంది నిష్ఠూరమాడుకుంటున్నారు.
రుషికొండ ప్యాలెస్ నిర్వాక భావదారిద్ర్యం:చంద్రబాబు పొగిడారని వైసీపీ ప్రచారం
Related Posts
పోలీసులు రౌడీ షీట్ ఓపెన్ చేస్తే చెల్లదు….సుప్రీంకోర్ట్, హై కోర్టుల సంచలన తీర్పులు…
ప్రస్తుతం రౌడీషీట్ కు చట్ట బద్దత లేదంటున్న న్యాయ స్థానాలు… ప్రభాతదర్శిని, (న్యూఢిల్లీ-ప్రతినిధి): సమాజంలో మనం చాలా సందర్భాల్లో ముఖ్యంగా పోలీస్ వ్యవస్థలో, కోర్టుల్లో, పలు కేసుల్లో, రాజకీయంగా రౌడీషీట్ అనే పదం వింటూనే ఉంటాం. రౌడీషీట్ అనగానే చాలా మందికి సాధారణ ప్రజలకి ఒకరకమైన భయం, అభద్రత భావం. రౌడీ షీటర్ అనీ ఒక వ్యక్తికి ముద్రపడగానే కొంత వరకు సమాజం ఆ వ్యక్తీ పట్ల చిన్నా…
Read moreస్థానిక సమస్యల పరిష్కారానికి హెల్ప్ లైన్ కు తెలియజేయండి…నగర పాలక సంస్థ కమిషనర్ సూర్యతేజ
ప్రభాతదర్శిని, (నెల్లూరు-ప్రతినిధి):నెల్లూరు నగర పాలక సంస్థ పరిధిలోని స్థానిక సమస్యలను కమాండ్ కంట్రోల్ విభాగంలో ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ కి ఫోన్ ద్వారా తెలియజేస్తే తక్షణమే స్పందించి ఫిర్యాదును పరిష్కరించేందుకు కృషి చేస్తామని కమిషనర్ సూర్యతేజ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికను నెల్లూరు నగర పాలక సంస్థ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ విభాగం సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించారు. కమిషనర్ సూర్యతేజ…
Read more