ప్రభాతదర్శిని (శ్రీకాళహస్తి – ప్రతినిధి ):
సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ కోసం పనిచేసిన వారిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారు ముఖ్యమంత్రిని కలిసి ఒక రోజంతా ఉండే అవకాశాన్ని టిడిపి పార్టీ కల్పించింది. ఈ కాన్సెప్ట్ తో రూపొందించిన డే విత్ సిబిన్ కార్యక్రమంలో భాగంగా స్వీడన్ కు చెందిన (శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని తొట్టంబేడు మండలం)ఎన్ఆర్ఐ ఉన్నం నవీన్ కుమార్ ను ముఖ్యమంత్రి తన ఇంటికి ఆహ్వానించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు సిఎంతో ఉండే అవకాశాన్ని కల్పించారు. సార్వత్రిక ఎన్నికల్లో సమయంలో స్వీడన్ నుంచి వచ్చిన నవీన్ కుమార్ 5 నెలల పాటు తెలుగుదేశం పార్టీ విజయం కోసం పని చేశారు. ఆ సమయంలో చంద్రబాబు పిలుపు మేరకు వందల సంఖ్యలో ఎన్ఆర్ఐలు సొంత రాష్ట్రానికి వచ్చి చంద్రబాబును సిఎం చేసుకుంటే కలిగే లాభాలపై ప్రజలను చైతన్య పరిచారు. అలా నాడు విదేశాలనుంచి వచ్చి ఎన్నికల్లో పనిచేసిన వారికి గౌరవించుకునే కార్యక్రమంలో భాగంగా నాటి సేవల్లో టాప్ లో ఉన్న వారికి పిలిచి గౌరవించాలని సీఎం భావించారు. ఈ క్రమంలో నాడు తెలుగుదేశం పార్టీ కుప్పం సహా శ్రీకాళహస్తి, సూళ్లూరు పేట, చంద్రగిరి నియోజకవర్గాల్లో తెలుగు దేశం అభ్యర్థుల గెలుపుకోసం నవీన్ చేశారు. ఈ క్రమంలో నాడు ప్రకటించినట్లు నవీన్ ను సిఎం ఇంటికి పిలిచిమాట్లాడారు. రోజంతా సిఎం నివాసంలో ఉన్న నవీన్ ముఖ్యమంత్రి రోజూ వారీ రివ్యూలు, పనితీరు ను గురించి తెలుసుకున్నారు. రాష్ట్రం, రాష్ట్ర భవిష్యత్ కోసం ఎన్ఆర్ఐలు వివిధ దేశాల నుండి ఎన్నికల సమయంలో సొంతూళ్లకు వచ్చి పని చేయడం ఎంతో స్ఫూర్తిదాయకమని ఈ సందర్భంగా సీఎం అన్నారు. ఎటువంటి లాభాపేక్ష లేకుండా రాష్ట్రం బాగుండాలనే బాధ్యతతో పని చేసిన ఎన్ఆర్ఐలందరినీ ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందించారు. ఎన్ఆర్టి మాజీ అధ్యక్షుడు డాక్టర్ రవి వేమూరు నేతృత్వంలో ఎపికి వచ్చి పనిచేసిన ఎన్ఆర్ఐలలో నవీన్ ముందు వరుసలో నిలిచారు. దీంతో ఈ రోజు ముఖ్యమంత్రితో డే విత్ సిబిఎన్ కార్యక్రమానికి నవీన్ కు అవకాశం ఇచ్చారు. దేశంలో ప్రముఖ నేత అయిన చంద్రబాబు నాయుడుతో కలిసి ఒక రోజంతా ఉండడంపై నవీన్ సంతోషం వ్యక్తం చేశారు. చంద్రబాబును అభిమానించే వారికి, నేడు తనకు ఇచ్చిన అవకాశం మరింత ఉత్సాహాన్ని ఇస్తుందని నవీన్ అన్నారు. స్వయంగా సిఎం ఒక రోజు పనితరును దగ్గర ఉండి చూసే అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఎన్ ఆర్ ఐ ఉన్నం నవీన్ ధన్యవాదాలు తెలిపారు.