పరపతి ఉన్నవారికే శ్రీకాళహస్తీశ్వరా స్వామి యాడ్లు?
అర్హతలేని మీడియా సంస్థలకు యాడ్స్ ఇవ్వాలని పాలక మండలి సభ్యులు చెప్పారా?
సొంత సొమ్ములా స్వామి సొమ్మును దోచి పెడుతున్న
కార్యానిర్వాహణాధికారి బాపిరెడ్డి
ప్రశ్నిస్తే పొంతనలేని విచిత్ర,వింత సమాధానాలు

నన్నూరు శ్రీనివాసరావు,(ప్రభాతదర్శిని, సంపాదకులు): దక్షిణ కాశీ గా భక్తుల నీరాజనాలు అందుకుంటున్న శ్రీ కాళహస్తీశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల మీడియా ప్రకటనల జారీలో ఆలయ కార్యనిర్వహణా ధికారి బాపిరెడ్డి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. పంగనామాలు పెడుతున్నారు. స్వామివారి సొమ్మును సొంత సొమ్ముగా భావించి పాతకాపు పెత్తనం చేసేరెడ్డిగా ఈవో వింత వైఖరి ఉందని ఆరోప ణలు ఉన్నాయి. ఇందుకు సాక్ష్యాధారాలు కూడా లేకపోలేదు. శ్రీకాళ హస్తీశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా నిర్వహించడం పరిపాటి. ఈ బ్రహ్మోత్సవాలకు దేశ విదేశాల నుండి వచ్చే భక్తులకు, స్వామివారి బ్రహ్మోత్సవాల సమాచా రంను వివిధ రూపాలలో విస్తృత చేయడం జరుగు తుంది. అందు లో భాగంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కూడా స్వామివారి బ్రహ్మోత్సవాలపై ప్రకటన ద్వారా పబ్లిక్ సిటీ చేయడం జరుగుతుంది. మీడియాకు ప్రకటనలు జారీ చేసే విషయంలో గతంలో కార్య నిర్వహణాధికారి పబ్లిక్ సిటీ కోసం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సంస్థలకు ప్రకటనలు ఇచ్చేందుకు బ్రహ్మో త్సవాల సమీక్ష సమావేశంలో పాలకమండలి సభ్యులకు ఎంత బడ్జెట్ కేటాయిస్తున్నామో ఆయా వివరాలు పాలక మండలి సభ్యులు ఆమోదంతో ప్రకటనలు జారీ చేయడం జరుగుతుంది. ఈ బడ్జెట్లో కేటాయించే విషయంలో ఏఏ మీడియా సంస్థలు ఏ ప్రాంతము నుండి తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నాయో ఆయా సంస్థలకు ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ డిపార్ట్మెంట్‌లో రెగ్యులారిటీ ఉందా లేదా అనే విషయాలను తెలుసుకోవడం లేదా ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ డిపార్ట్మెంట్ అధికార ద్వారా తెప్పించుకొని వాటి సర్కులేషన్ విస్తృత పరిధిని పరిగణలోకి తీసుకొని యాడ్స్ జారీ చేసే క్రమంలో ఎంత అమౌంట్ ఇస్తున్నారో రిలీజ్ ఆర్డర్ లో పేర్కొనడం పరిపాటి. ఈ సంప్రదాయాన్ని గత రెండు సంవత్సరాలు గా ప్రస్తుతం కార్యనిర్వహణ అధికారిగా పనిచేస్తున్న బాపిరెడ్డి నిబంధనలకు తిరోధకాలిచ్చి కొంతమంది దాళారుల ద్వారా తన ఇష్టానుసారంగా వ్యవహరిస్తు ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ డిపార్ట్మెంట్‌లో రెగ్యులారిటీలేని, సీనియార్టీ లేని మీడియా సంస్ధలకు, వేలాది రూపాయలను దోచ్చిపెడుతున్నట్లు తీవ్రమైన విమర్శలు ఉన్నాయి. మీడియా సంస్థకైనా బ్రహ్మోత్సవాల యాడ్స్ ఇచ్చే క్రమంలో ఏఏ మీడియా సంస్థలు రెగ్యులేటరీ ఉందో ఏ ప్రాంతం నుండి ప్రచురణ అవుతుందో, ఆయా మీడియా సంస్ధలకు స్థానికంగా శ్రీకాళహస్తీలో పనిచేస్తున్న రిపోర్టర్లు ఎవరు ఉన్నారో శ్రీకాళహస్తీ స్వామివారి దేవస్ధానం వార్తలు ఎవరు కవర్ చేస్తున్నారో అనే విష యాలు పిఆర్‌వో తెలిసి ఉంటుంది. యాడ్స్ మంజూరులో ఈ అంశాలను తెలుసుకోకుండా, సీనియార్టీని పరిగణలోకి తీసుకో కుండా కనీసం తిరుపతి జిల్లా ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ డిపార్ట్మెంట్ అధికారుల సమాచారం కూడా తెలుసుకోకుండా దళారుల కన్నుసన్నులలోవారి చెప్పినవారికి యాడ్లు ఇచ్చి శ్రీకాళ హస్తీస్వామి సమాచారంను రోజుల వారిగా ప్రచురించిన పత్రికలకు మొండి చేయి చూపి మరోసారి తన వింత వైఖరిని చాటుకున్నారు. బ్రహ్మోత్సవాల ప్రకటనలు మంజూరు చేసే కార్యనిర్వహణ అధికారి ఏకపక్షంగా తనకు అనుకూలమైన భజన చేసేవారికి రికమండేషన్ చేసిన వారికి అర్హత లేని మీడియా సంస్థలకు స్వామివారి సొమ్మును ఇస్తూ, ప్రభుత్వ నియమ నిబంధనలను పక్కన పెట్టి దారధత్తం చేయడం పలు విమర్శలకు దారితీస్తుంది. ఇదే వింత వైఖరి గత సంవత్సరంలో కొనసాగించడంతో కొందరు సమాచార హక్కు చట్టం ద్వారా ఏఏ మీడియా సంస్థలకు స్వామివారి బ్రహ్మోత్సవాల యాడ్స్ ఇచ్చారో కోరితే పొంతనలేని సమాచారంతో కొందరికి, హడావుడిలో పొరపాటు జరిగిందని మరికొందరికి రాబోవు సంవ త్సరంలో ఇలాంటి పొరపాట్లు జరగవని మరికొందరికి కార్య నిర్వహణ అధికారి బాపిరెడ్డి చెప్పుకోవడం విశేషం. ఫలనా మీడియా సంస్థలకు ప్రకటనలు మంజూరు చేయమని పాలక మండలి సభ్యులు చెపారా? లేక తాను ఏమి చేసినా అడిగే వారు లేరని అహంతో ఈవో ఏకపక్షంగా వ్యవహరించారా? అనే వింత వైఖరి, ఆంతర్యం ఏమిటో శ్రీకాళహస్తీశ్వర స్వామి వారికే తెలియాలి. అర్హత లేని మీడియా సంస్థలకు, అడ్డదారిలో ఆర్వోలు పొంది పైరవీలు చేసిన వారి వివరాలు బహిర్గతం చేస్తే కార్య నిర్వహణ అధికారి ఘనకార్యాలు వెలుగులోకి వస్తాయని ఆశిద్దాం.