👉🏻గూడూరు పోలీసులను బురిడీ కొట్టించిన నకిలీ విలేకరులు
👉🏻నకిలీ సంతకాలతో పోలీస్ అధికారులను తప్పుదారి పట్టించిన వైనం
👉🏻ఫోర్జరీ సంతకాలతో చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి
👉🏻మీడియా పేరుతో 50 లక్షలు దండకాలు చేసిన నకిలీ విలేఖరులపై చర్యలు ఏవి?
👉🏻గూడూరు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ డిమాండ్
👉🏻 సంయమనం పాటించమంటున్న రూరల్ సీఐ
ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి): గతంలో జర్నలిస్ట్ కాలనీ పేరు తో గూడూరు కేంద్రంగా విలేఖరుల పేరు చెప్పి 50 లక్షలు రూపాయలు వసూళ్లకు పాల్పడిన “నకిలీ విలేఖరుల వ్యవహారాన్ని ప్రశ్నించినందుకు గూడూరు చెందిన జర్నలిస్టులపై పోలీసులకు తప్పుడు సమాచారం ఇచ్చి తమ పంతాన్ని నెగ్గించుకున్న నకిలీ విలేకరుల ఆగడాలు గూడూరులో శృతిమించాయి. వివిధ మీడియా సంస్థలలో జర్నలిస్ట్ లుగా దీర్ఘకాలంగా పనిచేస్తున్న వారే లక్ష్యం గా చెలరేగిపోతున్న క్రమంలో కొందరు వ్యక్తుల పేరుతో,నకిలీ సంతకాలతో సామాజిక మాధ్యమాలు ద్వారా జిల్లా పోలీస్ అధికారులను తప్పుదారి పట్టించేలా తేదీ 15-06-2024 వతేదీన తప్పుడు ఫిర్యాదులను చేశారు. 20 సంవత్సరాల క్రితం టిడిపిలో జర్నలిస్టులపై తప్పుడు కేసులు బనాయిస్తున్న విషయంపై వారికి రక్షణ కల్పించేందుకు అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తీసుకొచ్చిన త్రీ మెన్ కమిటీ సిఫారసులను కూడా పరిగణలోకి తీసుకోకుండా, ఎలాంటి విచారణ లేకుండా ఆగమే గల మీద కొంపులు కూలిపోయినట్లుగా గూడూరు రూరల్ పోలీసు తప్పుడు కేసులు కట్టి చేతులు దులుపుకున్న వైనం ఇది. గూడూరు పట్టణంలో పనిచేసే వివిధ మీడియా సంస్థల పని చేసే విలేకరులకు పట్టణ సమీపంలోనే ఓ ప్రాంతంలో ఇళ్ల స్థలాలు ఇచ్చింది. దీనిని అవకాశం తీసుకున్న కొందరు స్వార్ధపరులు మీడియా ముసుగులో పట్టణంలోని ప్రముఖులు డివిజన్ పరిధిలోని ప్రముఖ సంస్థల అధిపతులను కలిసి మీడియా పేరుతో దాదాపు అరకోట్ల రూపాయలు దండకాలు చేసిన స్వాహ చేసినట్లు విమర్శలు వచ్చాయి. జర్నలిస్ట్ లో పేరుతో దండిన 50లక్షల రూపాయలు దుర్వినియోగం పై చర్యలు తీసుకోవాలని గూడూరు జర్నలిస్ట్ లు గూడూరు పోలీస్ అధికారులతో పాటు జిల్లా పోలీసు అధికారుల వరకు ఫిర్యాదు చేశారు. సాక్ష్యాధారాలతో ఫిర్యాదులు చేసి నేటికీ ఎలాంటి చర్యలు తీసుకున్న దాఖలు లేవు. ఈ నకిలీలపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో జర్నలిస్ట్ లు సొమ్ము తిని, జర్నలిస్ట్ లు గా చెలామణి అవుతూ జర్నలిస్ట్ ల స్థలాలు కబ్జా చేసే ప్రయత్నాలు చేసిన “నకిలీ విలేకరుల ముఠా”ను గూడూరు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా నాయకులు బహిష్కరణ చేశారు. వారు అప్పటి నుంచి కక్ష పూరితంగా గూడూరులో జర్నలిస్ట్ లకు జరుగుతున్న అన్యాయం పై ప్రశ్నిస్తున్న వారినే లక్ష్యం గా ఆదివారం వాట్సాప్ లో విలేకరులపై కేసు అంటూ వాట్సాప్ సోషల్ మీడియా గ్రూప్ లలో వైరల్ చేసిన నకిలీ విలేఖరుల ముఠా తప్పుడు కేసులతో ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. వీరి నిత్యకృత్యం అధికారులను, నాయకులను చట్టాలను దుర్వినియోగం చేస్తామని బెదిరించడం వసూళ్లు చేసుకోవడం.వీరి గుట్టు ఈమధ్య కాలంలో రట్టు కావడం తో రిజిష్టర్ సంఘంగా
సీనియర్ జర్నలిస్ట్ ల నాయకత్వంలో పనిచేస్తున్న గూడూరు ప్రింట్ మీడియా వెల్ఫేర్ అసోసియేషన్ కార్యవర్గం ముఖ్య నాయకులపై నకిలీ సిమ్ లు, ట్రాపింగ్ వాట్సాప్ రికార్దింగ్ లతో పోలీస్ అధికారులకు తప్పుడు ఫిర్యాదుతో తప్పుదారి పట్టించారు. గూడూరు బహిష్కృత నకిలీ విలేఖరుల బృందం వారి పథకం ప్రకారం గూడూరు జర్నలిస్ట్ నాయకుల ప్రతిష్ట దిగజార్చే విధంగా లిటిగేషన్ తో ఓ అవాస్తవిషయానికి సృష్టించి ఎట్టకేలకు కేసు నమోదు చేయించారు. తప్పుడు కేసు విషయంను గూడూరు జర్నలిస్ట్ లు నాయకులు స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లగా, ఆయన తక్షణమే స్పందించి పోలీస్ అధికారులతో చర్చించారు. ఫిర్యాదు విషయమై గూడూరు రూరల్ సీఐ వేణుగోపాల్ రెడ్డి స్పందిస్తూ సమగ్రంగా విచారణ చేపడతామనన్నారు.ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి తరుఫున గూడూరు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ ప్రతినిధులు రూరల్ ఎస్ ఐ కలిశారు. ఈ సందర్బంగా సిఐ మాట్లాడుతూ అసోసియేషన్ ల నాయకులు తమ దృష్టికి తెచ్చిన వివరాలను కూడా పరిగణలోకి తీసుకుని విచారిస్తామన్నారు. సాంకేతిక పరిజ్ఞానం ను దుర్వినియోగం చేస్తూ సమాజంలోని వ్యక్తులను, పోలీసులను అప్రతిష్ట పాలు చేసేలా కుట్రలు చేస్తే సహించబోమని హెచ్చరించారు. కేసువిషయం లో ఫిర్యాదు మేరకు కేసు నమోదైనప్పటికీ ఆరోపణలు వాస్తవమో కాదో నిర్ధారణ కావాల్సి ఉందన్నారు. గూడూరు విలేఖరుల పై కేసు అని వాస్తవాలు తేలకముందే సోషల్ మీడియా లో ఉద్దేశ్య పూర్వకంగా దుష్ప్రచారం చేస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.