ప్రభాతదర్శిని, (నెల్లూరు-ప్రతినిధి):
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాల ప్రయోజనం ప్రతి గడపకు చేరి, ప్రతి కుటుంబం లబ్ధి పొందని వైసీపీ రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి చెప్పారు. ప్రతి ఒక్కరు మనకు ఏ ప్రభుత్వం మంచి చేస్తుంది, ఎవరు మన మేలుకోరే అభ్యర్థి అని ఆలోచించి ఓటు వేయాలని రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి కోరారు. రానున్న ఐదేళ్ల కాలంలో 24 డివిజన్లోని అన్ని ప్రాంతాలలో ఇప్పుడు కంటే అధికంగా అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేయడం జరుగుతుందని ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి తెలిపారు. తాను ఇన్చార్జిగా ఉన్న సమయంలోనే ఈ ప్రాంతంలో అభివృద్ధి జరిగిందని ఆ విషయాన్ని స్థానిక ప్రజలు గుర్తించి వచ్చే ఎన్నికల్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గం వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనను, నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న విజయసాయిరెడ్డిని అత్యధిక మెజారిటీతో మీ అమూల్యమైన ఓటు ఫ్యాన్ గుర్తుపై వేసి గెలిపించాలని ప్రజలను వైసీపీ రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి అభ్యర్థించారు. ఎన్నికల ప్రచారానికి విచ్చేసిన రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి, నెల్లూరు పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి విజయసాయి రెడ్డి తదితరులకు 24వ డివిజన్లోని ఆర్డిటి కాలనీ, ఇందిరమ్మ కాలనీ, కల్లూరు పల్లి హౌసింగ్ బోర్డ్ కాలనీ తదితర ప్రాంతాల ప్రజలు అపూర్వ ఘనస్వాగతం పలికారు. ఎన్నికల ప్రచార కార్యక్రమానికి 24వ డివిజన్ నుంచి స్థానిక ప్రజల్లో స్వచ్ఛందంగా తరలివచ్చి అభిమాన నాయకులకు ఆత్మీయ స్వాగతం పలికి సంఘీభావం తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన ఉన్న అభిమానంతో, ఈ ప్రాంతానికి చేసిన అభివృద్ధి కార్యక్రమాలను దృష్టిలో ఉంచుకొని పెద్ద సంఖ్యలో ఎన్నికల ప్రచారానికి స్వచ్ఛందంగా విచ్చేసిన 24వ డివిజన్లోని ఆయా ప్రాంతాల ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నానని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి చెప్పారు. ఎన్నికల ప్రచారానికి స్వచ్ఛందంగా విచ్చేసిన ప్రజల్ని ఉద్దేశించి ఎంపీ విజయసాయి రెడ్డి మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో ప్రతి ఒక్కరు వారి వారి అమూల్యమైన ఓటును ఫ్యాను గుర్తు పైవేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. నెల్లూరు పార్లమెంట్ పరిధిలోని అన్ని నియోజకవర్గాలను అభివృద్ధి చేసేందుకు లోకల్ మేనిఫెస్టోను విడుదల చేయడం జరిగిందని, ఆ దిశగానే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంపూర్ణ సహకారంతో నెల్లూరు రూరల్ నియోజకవర్గం తోపాటుగా మిగిలిన అన్ని నియోజకవర్గాలను సమగ్ర అభివృద్ధి చేయడం జరుగు తుందన్నారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ పొట్లూరు స్రవంతి జయవర్ధన్, పార్టీ సీనియర్ నాయకులు మలిరెడ్డి కోటారెడ్డి, బివి రమణారెడ్డి, ఏఎంసీ చైర్మన్ కోటేశ్వర రెడ్డి, 24 డివిజన్ ఇన్చార్జిలు నీళ్ల సునీల్ యాదవ్, ఉడత మురళి యాదవ్, ఇసనాక సురేంద్ర రెడ్డి, వైసీపీ ముఖ్య నాయకులు వెంధోటి చంద్రశేఖరరెడ్డి ఆదిశేషారెడ్డి, జగదీశ్ రెడ్డి, శేఖర్, దేవరాల వెంకట రమణయ్య మధు, చిట్టిబాబు, రాంమోహన్ రెడ్డి ఖాదర్ బాషా, మైధిలమ్మ, కుమారి, వరలక్ష్మి, గోపి, సునీల్, వినోద్, సాయి, వినోద్, పి.బాను, కృష్ణుడు, అమర్, మహేష్, పెంచలయ్య, అరవ కామాక్షి, 23వ డివిజన్ కార్పొరేటర్ ఒరిస్సా శ్రీనివాసులురెడ్డి, క్లస్టర్ -2 అధ్యక్షులు పాతపాటి పుల్లారెడ్డి తదితరులతోపాటు రాష్ట్ర సేవాదళ్ అధ్యక్షులు మల్లెం సుధీర్ కుమార్ రెడ్డి రాష్ట్ర బీసీ సెల్ కార్యదర్శి హరిబాబు యాదవ్, పార్టీ సీనియర్ నాయకులు స్వర్ణ వెంకయ్య, జిల్లా ఎస్టీ సెల్ అధ్యక్షులు పాలకీర్తి రవికుమార్, ఎస్సీ ఎస్టీ సెల్ మాజీ కమిషన్ సభ్యులు బద్దిపూడి రవీంద్ర, ఏసు నాయుడు స్థానిక వైసీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.
పేదలకు సంక్షేమ పథకాలు ఇచ్చే వైసిపి ని ఆదరించండి… రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల
Related Posts
ఏ.సి.బి వలకు చిక్కిన అవినీతి అనకొండ
మాటువేసి వేసి పట్టుకున్న అవినీతి నిరోధక శాఖ అధికారులు ప్రభాతదర్శిని,(ఒంగోలు -ప్రతినిధి):గత ప్రభుత్వ హయాంలో తిలా పాపం, తలా పిడికెడు అనే ధోరణిలో విధులు నిర్వహించి ప్రజలను పట్టి పీడించిన పలువురు ప్రభుత్వ అధికారులపై ప్రజలతో బాటు, ప్రజా ప్రతినిధులు సైతం కన్నేసి ఉన్నారు.ఇందులో భాగంగా అక్రమార్జన కోసం అర్రులు చాస్తూ ఉన్న పలువురు ప్రభుత్వ అధికారుల భరతం పట్టేందుకు నేరుగా అవినీతి నిరోధక శాఖ అధికారులను ఆశ్రయిస్తూ…
Read moreసీనియర్ జర్నలిస్ట్ వెంకటేశులుకు సన్మానం
ప్రభాతదర్శిని,(శ్రీకాళహస్తి -ప్రతినిధి):జాతీయ పత్రిక దినోత్సవం సందర్బంగా సీనియర్ జర్నలిస్ట్, శ్రీకాళహస్తి నియోజకవర్గం “ప్రభాతదర్శిని-ప్రతినిధి” చెన్నూరు వెంకటేశులును నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్చి తలపా దామోదర్ రెడ్డి తన కార్యాలయంలో ఆదివారం ఘనంగా సన్మానించ్చారు. జాతీయ పత్రిక దినోత్సవం సందర్బంగా ఆయన “ప్రభాతదర్శిని” నియోజకవర్గ ప్రతినిధి చెన్నూరు వెంకటేశులు ను ఘనంగా సన్మానించ్చారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గం లో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం కోసం పిసిసి అధ్యక్షురాలు…
Read more