ఇంటర్నెట్ డెస్క్: సీమాంతర ఉగ్రవాదాన్ని ఆపకపోతే పాకిస్తాన్ ను భూమండలం మీద లేకుండా చేస్తామని భారత ఆర్మీ చీప్ ద్వివేది సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్ సిందూర్ 2.0 త్వరలోనే ఉందన్నారు. రాజస్తాన్ లోని ఓ ఆర్మీ క్యాంప్ ను సందర్శించిన ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. ఆపరేషన్ సిందూర్ 1.0 సమయంలో కాస్త సహనాన్ని పాటించామని ఈ సారి అలా జరగదన్నారు. పాకిస్తాన్ రెచ్చగొడితే దెబ్బతినాల్సిందేనని స్పష్టం చేశారు. భౌగోళికంగా ఉండాలనుకుంటున్నారా లేదా అని పాకిస్తాన్ పై మండిపడ్డారు. ప్రపంచపటంలో ఉండాలంటే సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం ఆపేయాల్సి ఉందన్నారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సైన్యం సిద్ధంగా ఉందన్నారు. పాకిస్తాన్ ఇప్పటికీ కుట్రలకు పాల్పడుతోందన్న సమాచారం భారత ప్రభుత్వానికి వస్తోంది. అందుకే రాజ్ నాథ్ సింగ్ కూడా ఇటీవల హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పుడు ఆర్మీ చీఫ్ కూడా అదే హెచ్చరికలు జారీ చేశారు. కొన్ని ఇస్లామిక్ దేశాల మద్దతు ఉందన్న కారణంగా పాకిస్తాన్ రెచ్చిపోతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఈ సారి పాకిస్తాన్ పై తిరుగులేకుండా దెబ్బకొట్టేలా ఇప్పటికే భారత్ సన్నద్ధత ప్రారంభించిందని రక్షణ మంత్రి, ఆర్మీ చీఫ్‌ల మాటల ద్వారా స్పష్టమవుతున్న సూచనలు కనిపిస్తున్నాయి.
నన్నూరు శ్రీనివాసరావు పత్రిక రంగంలో 30 ఏళ్ల అనుభవం ఉన్న అనుభవజ్ఞుడైన పాత్రికేయుడు. ఆంధ్రప్రదేశ్‌లోని ఉమ్మడి నెల్లూరు జిల్లా కి చెందిన శ్రీనివాసరావు, తన ప్రాతికేయ వృత్తిని గ్రామీణ ప్రాంతము నుండి నెల్లూరు తిరుపతి జిల్లాలలో మొదలైంది. వామపక్ష పాత్రికేయ దిగ్గజాలైన మోటూరు హనుమంతరావు సంపాదకీయంలో వెలువడిన 'ప్రజాశక్తి' దినపత్రికలో ఓనమాలు నేర్చుకొని, మరో వామపక్ష పాత్రికేయ దిగ్గజం ఈడుపుగంటి నాగేశ్వరరావు సంపాదకీయంలో వెలువడిన 'విశాలాంధ్ర' తెలుగు దినపత్రికలో పత్రిక రంగంలో తుది మెరుగులు దిద్దుకున్నారు. 14 సంవత్సరాల పాత్రికేయ వృత్తిలో సంపాదించుకున్న అనుభవాన్ని 'ప్రభాతదర్శిని' తెలుగు దినపత్రిక ద్వారా సంపాదకులుగా మారారు. వామపక్ష భావజాలంతో సామాజిక, రాజకీయ, ఆర్థిక అంశాలపై లోతైన వార్త కథనాల విశ్లేషణలు అందించడానికి ఈ వృత్తిని సమాజానికి అంకితం చేశారు. పత్రిక రంగంలో గ్రామీణ, పట్టణ, జిల్లా క్రైమ్ రిపోర్టర్ గా, సబ్ ఎడిటర్, డెస్క్ ఇంచార్జిగా పేజీ మేకింగ్ హోదాలో డెస్క్ లో విస్తృతమైన అనుభవంను సముపార్జన చేసి జర్నలిజంపై మక్కువతో "తప్పుడు వార్త కథనాలను ప్రచురించడం కూడా పత్రిక స్వేచ్ఛ కాలరాయడమే" అనే సిద్ధాంతంతో నిబద్ధత, నైతిక విలువలు, సామాజిక స్పృహతో కూడిన వార్త కథనాలతో ప్రజలకు అందించేందుకు ముందుకు సాగుతున్నారు. గణనీయమైన శిష్యుల బృందం కలిగిన నన్నూరు శ్రీనివాసరావు తన శిష్యులను కూడా జర్నలిజంలో తన స్థాయికి ఎదిగేందుకు కృషి చేస్తు బహుముఖ ప్రజ్ఞాశాలిగా సమాజంలో స్థానాన్ని సంపాదించుకున్నారు.