ప్రభాతదర్శిని, (నెల్లూరు-ప్రతినిధి):నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నాన్న, రూరల్ వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కళ్ళ ఎదుట కనిపిస్తున్నాయి కాబట్టే నాన్నగారికి మద్దత్తుగా ఎన్నికల ప్రచారం చేసేందుకు ఏగడపకు వెళ్లిన మీ నాన్న మా ప్రాంతానికి ఎంతో అభివృద్ధి చేశారు, వచ్చే ఎన్నికల్లో మా ఓటు ఆదాల ప్రభాకర్ రెడ్డికి వస్తామని ఆయా ప్రాంతాల ప్రజలు బహిరంగంగా తనకు చెప్పడం చాలా సంతోషంగా ఉందని వైసీపీ రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి కుమార్తె ఆదాల హిమబిందు వ్యాఖ్యానించారు. వచ్చే ఐదు సంవత్సరాలలో నాన్న ఆధ్వర్యంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో స్థిరస్థాయిగా నిలిచిపోయే శాశ్వత అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయని ఆదాల హిమబిందు స్పష్టం చేశారు. అభివృద్ధిని ఆకాంక్షించే నాయకులుగా ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకున్న నాన్న, వచ్చే ఎన్నికల్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుండి భారీ మెజారిటీతో ప్రజల సంపూర్ణ సహకారాలతో విజయం సాధించడం ఖాయమని ఆదాల హిమబిందు ధీమా వ్యక్తం చేశారు. ఈ మేరకు శనివారం నియోజకవర్గంలోని 26వ మున్సిపల్ కార్పొరేషన్ డివిజన్లో ఆ డివిజన్ ఇన్చార్జ్ షేక్ బాబు, నగర పార్టీ అధ్యక్షులు సన్నపరెడ్డి పెంచలరెడ్డి, 27వ డివిజన్ అధ్యక్షులు సన్నపరెడ్డి వెంకటసుబ్బారెడ్డి, స్థానిక వైస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు ప్రజలతో కలిసి వైసీపీ రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి నెల్లూరు పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డికు మద్దతుగా ఇంటింటా ఎన్నికల ప్రచారం చేపట్టారు. నెల్లూరు విజయ డైరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి దిశా నిర్దేశంలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి, నెల్లూరు పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి, విజయసాయిరెడ్డి కు మద్దతుగా ఆదాల హిమబిందు గడపగడపకు ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఎన్నికల వచ్చేలా కార్యక్రమానికి విచ్చేసిన వైసీపీ రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి కుమార్తె ఆదాల హిమబిందుకు ఆత్మీయ ఘనస్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో స్థానిక డివిజన్ వైసిపి ముఖ్య నాయకులు మున్నా, సంధాని, హసీనా, పెంచలయ్య, గంగిరెడ్డి, సత్యం, పుల్లూరు చంద్రమౌళి, రొంపిచర్ల సుబ్బారెడ్డి, వినోద్ రెడ్డి,ఏఎంసీ చైర్మన్ కోటేశ్వర రెడ్డి, నగర పార్టీ మహిళా అధ్యక్షురాలు కాకటూరు లక్ష్మీ సునంద, ఏపీ ఎంఎస్ఎంఈ డైరెక్టర్ పాశం శ్రీనివాస్, నగర పార్టీ ఉపాధ్యక్షులు వేలూరు శ్రీధర్ రెడ్డి, జిల్లా యువజన విభాగం ప్రధాన కార్యదర్శి పాశం తిరుపతి, మహిళా నాయకురాలు ముంగమూరు భార్గవిరెడ్డి, తదితరులతోపాటు స్థానిక వైఎస్ఆర్ సీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, మహిళలు అత్యధిక సంఖ్యలో పాల్గొని ప్రచార కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
నాన్న చేసిన అభివృద్ధి కళ్ళముందే కనపడుతుంది…. ఆదాల హిమబిందు
Related Posts
సీఎంను కలిసిన ఎన్ఆర్ఐ ఉన్నం నవీన్
ప్రభాతదర్శిని (శ్రీకాళహస్తి – ప్రతినిధి ):సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ కోసం పనిచేసిన వారిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారు ముఖ్యమంత్రిని కలిసి ఒక రోజంతా ఉండే అవకాశాన్ని టిడిపి పార్టీ కల్పించింది. ఈ కాన్సెప్ట్ తో రూపొందించిన డే విత్ సిబిన్ కార్యక్రమంలో భాగంగా స్వీడన్ కు చెందిన (శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని తొట్టంబేడు మండలం)ఎన్ఆర్ఐ ఉన్నం నవీన్ కుమార్ ను ముఖ్యమంత్రి తన ఇంటికి ఆహ్వానించారు. ఉదయం నుంచి…
Read moreపవన్ కల్యాణ్… మీకు అధికారులు సహకరించకపోవడం ఏంటి?
ఏపీ డిప్యూటీ సీఎం పరిస్థితి విచిత్రంగా ఉందన్న అంబటి రాంబాబుఅధికారంలో ఉన్నది మీరే కదా అంటూ వ్యాఖ్యలుఈ స్కాం నిజమైతే పౌరసరఫరాల శాఖ మంత్రి రాజీనామా చేయాలిసహకరించవద్దని చంద్రబాబు, లోకేశ్ ఏమైనా చెప్పారా అంటూ ప్రశ్నప్రభాతదర్శిని (విజయవాడ-ప్రతినిధి): ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇటీవల కాలంలో తరచుగా పోలీసుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నిన్న కాకినాడ పోర్టు తనిఖీ సందర్భంగా అధికారుల తీరుపైనా ఆగ్రహం వెలిబుచ్చారు.…
Read more