ప్రభాతదర్శిని (నెల్లూరు – ప్రతినిధి): జిల్లాలో ఉద్యాన వన నర్సరీ ఏర్పాటుకు పెన్నా, సంగం బ్యారేజ్ పరిసర లేక మరేదైనా ప్రాంతంలో అనువైన ప్రదేశంలో 5 సంవత్సరముల లీజు ప్రాతిపదికన అవసరమైన ప్రతిపాదనలు సిద్దం చేయాలని సంబందిత అధికారులను జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా ఆదేశించారు. మంగళ వారం స్థానిక కలెక్టర్ కార్యాలయములోని యస్.ఆర్.శంకరన్ వీడియో కాన్ఫరెన్సు హాలులు ఉద్యాన వన శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ మండల ఉద్యాన వన శాఖ అధికారులు ఆయా మండలాలలో ఒక ప్రత్యేక థీం తో పనిచేసి ఆ మండలాలకు గుర్హింపు వచ్చేలా చూడాలన్నారు. నిర్దేశిత లక్ష్య సాధన కాకుండా వినూత్నంగా ఆలోచించ వలసిన అవసరం ఉందని, తదనుగుణంగా నెల్లూరు జిల్లా వైపు అందరిని ఆకర్షించేలా చేయాలన్నారు. వ్యవసాయ శాఖ ప్రాధాన్యతా రంగాలలో ఉద్యాన వన శాఖ ఒకటి అని అన్నారు. కలువాయి,సైదాపురం మరియు దుత్తలురులో ఉన్న కోల్డ్ స్టోరేజ్ లను సద్వినియోగం చేసుకోవాలన్నారు. జిల్లాలో ఫాం పాండ్స్ ను పంచవలసిన అవసరం ఉందన్నారు. అంతే కాకుండా పాలీ హౌసెస్ లను పెంచాలని రాష్ట్రం మొత్తం నెల్లూరు వైపు చూసేలా ఉండాలన్నారు. ఉద్యాన వన అధికారులు శాస్త్రీయ దృక్పదం నుండి బయటికి వచ్చి వినూత్నంగా ఆలోచించి మెరుగైన ఫలితాలు సాధించాలన్నారు. కొత్తదనం తో పెద్ద పెద్ద ఆలోచనలు చేసి మెరుగైన ఫలితాలు సాధించాలన్నారు, దానికి అవసరమైన నిధులు సమకూర్చడం జరుగుతుందన్నారు. ప్రభుత్వం సూచించిన విధంగా ఒక జిల్లా ఒక ప్రాడక్ట్ గా గుర్హింపు ఉండాలన్నారు. మోడరన్ నర్సరీలు ఏర్పాటు చేయవలసిన అవసరం ఉందన్నారు. ఉద్యాన వస శాఖ సంబందిత శాఖలతో సమన్వయ పరచుకోవాలన్నారు. ప్రతి మండలం ఒక ఉద్యాన పంటల హబ్ గా ఉండలాన్నారు.ఈ కార్యక్రమములో డి.ఆర్.డి.ఎ. ప్రాజెక్ట్ అధికారి నాగ రాజ కుమారి, మెప్మా అధికారి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. తొలుత జిల్లా ఉద్యాన శాఖ అధికారి రమణా రెడ్డి ఆ శాఖ అమలు చేస్తున్న పనుల పురోగతి పే పవర్ పాయింట్ ప్రజంటేషన్ చేసారు.

చిన్నారులందరికీ నులిపురుగుల నివారణ మాత్రలుఇప్పించాలి: జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల ప్రభాతదర్శిని ( నెల్లూరు – ప్రతినిధి): చిన్నారుల ఆరోగ్య సంరక్షణ, ఎదుగుదలకు నులిపురుగుల నివారణ మాత్రలను తప్పనిసరిగా అందించాలని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల వైద్యారోగ్య శాఖ అధికారులకు సూచించారు. జాతీయ నులిపురుగుల దినోత్సవం పురస్కరించుకుని మంగళవారం ఉదయం నెల్లూరు నగరంలోని ఈ ఎస్ ఆర్ ఎం హైస్కూల్లో విద్యార్థులకు నులిపురుగుల నివారణకు ఆల్బెండజోల్ మాత్రలను కలెక్టర్ అందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది సూచనల మేరకు 1-19 సంవత్సరాల వయసు గల బాల బాలికలు అందరికీ నులిపురుగుల నివారణ మాత్రలు తప్పనిసరిగా అందించాలన్నారు. ఈనెల 24న కూడా ఈ మాత్రల పంపిణీ జరుగుతుందని కలెక్టర్ చెప్పారు. చిన్నారుల్లో ఎదుగుదల, మెరుగైన ఆరోగ్య సంరక్షణకు ఈ మాత్రలు ఎంతో ఉపయోగపడతాయని, తల్లిదండ్రులందరూ కూడా తమ బిడ్డలందరికీ ఈ మాత్రలను తప్పనిసరిగా అందించాలన్నారు. కలెక్టర్ వెంట డిఎంహెచ్వో డాక్టర్ సుజాత, ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ యశ్వంత్, డెమో కనక రత్నం తదితరులు ఉన్నారు.