ప్రభాతదర్శిని, (ప్రత్యేక-ప్రతినిధి):మీడియా రంగంలో ఉత్తమ పాత్రికేయుడిగా దాదాపు దశబ్దం కాలంగా పైబడి నవసమాజ నిర్మాణం కోసం ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ తనదైన శైలిలో వార్తా కథనాలు రాస్తూ, జర్నలిస్టుల సంక్షేమం, రక్షణ ప్రధాన ధ్యేయంగా పనిచేస్తూ ముఖ్యంగా కరోనా కాలంలో స్వచ్ఛందంగా ఎటువంటి లాభవేక్ష ఆశించకుండా సామాన్య జర్నలిస్టుగా మల్లాది ప్రసాదరావు చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలను రాజస్థాన్ రాష్ట్ర జ్ఞాన్ ఉదయ్ ఫౌండేషన్ గుర్తించి మల్లాది ప్రసాదరావు కి జాతీయ ఉత్తమ జర్నలిస్టు అవార్డు అందించారు. శుక్రవారం విజయవాడ హోటల్ ఐలాపురంలో జ్ఞాన్ ఉదయ్ ఫౌండేషన్ మీడియా రంగంలో సామాజిక సేవ చేస్తున్న పాత్రికేయులకు జాతీయ ఉత్తమ జర్నలిస్టుల అవార్డు పురస్కారాల ప్రదానోత్సవం ఈ అరుదైన గౌరవం లభించింది. ఈ కార్యక్రమంలో నవ్యాంధ్ర జర్నలిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులు ఎస్.కె జలీల్ చేతుల మీదుగా మల్లాది ప్రసాదరావు కి జాతీయ ఉత్తమ జర్నలిస్టు అవార్డు ప్రధానం చేశారు. జాతీయ ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు అందుకున్న మల్లాది ప్రసాదరావు మాట్లాడుతూ నాకు అవార్డు ప్రధానం చేసిన జ్ఞాన్ ఉదయ్ ఫౌండేషన్ వారికి, జర్నలిస్టుగా దశాబ్ద కాలంగా పైబడి నన్ను ప్రోత్సహిస్తూ అండగా ఉన్న డాక్టర్.బండి సురేంద్రబాబు, సహచర పాత్రికేయ మిత్రులకి,స్వచ్ఛంద సేవకులకు, శ్రేయోభిలాషులకి ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు.
జాతీయ ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు అందుకున్న మల్లాది ప్రసాదరావును ప్రముఖ జర్నలిస్ట్ సంఘాలు, పాత్రికేయులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధు, గ్రామ ప్రజలు, పలువురు ప్రముఖులు అభినందనలు తెలుపుతూ హర్ష వ్యక్తం చేశారు.
జాతీయ ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు అందుకున్న మల్లాది ప్రసాదరావు
Related Posts
సీఎంను కలిసిన ఎన్ఆర్ఐ ఉన్నం నవీన్
ప్రభాతదర్శిని (శ్రీకాళహస్తి – ప్రతినిధి ):సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ కోసం పనిచేసిన వారిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారు ముఖ్యమంత్రిని కలిసి ఒక రోజంతా ఉండే అవకాశాన్ని టిడిపి పార్టీ కల్పించింది. ఈ కాన్సెప్ట్ తో రూపొందించిన డే విత్ సిబిన్ కార్యక్రమంలో భాగంగా స్వీడన్ కు చెందిన (శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని తొట్టంబేడు మండలం)ఎన్ఆర్ఐ ఉన్నం నవీన్ కుమార్ ను ముఖ్యమంత్రి తన ఇంటికి ఆహ్వానించారు. ఉదయం నుంచి…
Read moreపవన్ కల్యాణ్… మీకు అధికారులు సహకరించకపోవడం ఏంటి?
ఏపీ డిప్యూటీ సీఎం పరిస్థితి విచిత్రంగా ఉందన్న అంబటి రాంబాబుఅధికారంలో ఉన్నది మీరే కదా అంటూ వ్యాఖ్యలుఈ స్కాం నిజమైతే పౌరసరఫరాల శాఖ మంత్రి రాజీనామా చేయాలిసహకరించవద్దని చంద్రబాబు, లోకేశ్ ఏమైనా చెప్పారా అంటూ ప్రశ్నప్రభాతదర్శిని (విజయవాడ-ప్రతినిధి): ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇటీవల కాలంలో తరచుగా పోలీసుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నిన్న కాకినాడ పోర్టు తనిఖీ సందర్భంగా అధికారుల తీరుపైనా ఆగ్రహం వెలిబుచ్చారు.…
Read more