ప్రభాతదర్శిని, (నాయుడుపేట-ప్రతినిధి): రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం దేవదేవుడు వెంకటేశ్వర స్వామిని అడ్డుపెట్టుకుని రాజకీయ డ్రామాకు తెర లేపారని సూళ్లూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ఆరోపించారు. శుక్రవారం ఆయన తిమ్మాజీ కండ్రిక వద్ద స్వర్ణముఖి నది తీరాన వెలసి ఉన్న శ్రీ అభయా అనుగ్రహ వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్థానిక వైసీపీ నేతలతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. శ్రీవారి లడ్డు ప్రసాదం తయారీలో జంతు కొవ్వు కలవలేదని సిబిఐ సుప్రీంకోర్టుకు నివేదిక సమర్పించిందని తెలిపారు. తమ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేక తమ పార్టీ నాయకుల పై అభండాలు వేస్తూ వైసిపికి అప్రతిష్ట తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ప్రవర్తిస్తున్న చంద్రబాబు భక్తులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.తమ స్వార్థ ప్రయోజనాల కోసం తిరుమల పవిత్ర ప్రసాదం లడ్డూని రాజకీయం చేస్తున్న చంద్రబాబు పవన్ కళ్యాణ్ కు వెంకటేశ్వర స్వామి మంచి బుద్ధి ప్రసాదించాలని భగవంతుని కోరుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర కార్యదర్శి కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి, వైసిపి జిల్లా ఉపాధ్యక్షులు తంబిరెడ్డి సుబ్రహ్మణ్యం రెడ్డి,మాజీ ఏఎంసీ చైర్మన్ తంబిరెడ్డి జనార్దన్ రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ కటకం దీపిక,మున్సిపల్ వైస్ చైర్మన్ జలదంకి వెంకటకృష్ణారెడ్డి,వైసీపీ పట్టణ అధ్యక్షులు కలికి మాధవరెడ్డి, వైసీపీ నాయుడుపేట మండల అధ్యక్షులు ఒట్టూరు కిషోర్ యాదవ్,నియోజకవర్గ మహిళా విభాగం అధ్యక్షురాలు ఈదారత శ్రీ,మున్సిపల్ కౌన్సిలర్లు దారా రవి,పాలేటి నాగార్జున, షేక్ షబ్బీర్,సరిత, కావేరి పాకం అశోక్ కుమార్, వైసీపీ నాయకులు బైనా మల్లికార్జున్ రెడ్డి, పేట చంద్రారెడ్డి, గంధవల్లి సిద్దయ్య,షేక్ రహంతుల్లా,పేర్నాటి రాహుల్, రమణయ్య పలువురు నాయకులు పాల్గొన్నారు.
