ప్రభాతదర్శిని, (నెల్లూరు-ప్రతినిధి):చంద్రబాబు పేరు చెబితే కలలో కూడా నిద్ర లేచి మరి చెప్పే పథకం ఏమైనా ఉందంటే ‘కరువు-కాటకం’ అని, రాష్ట్రంలో తిరిగి పొరపాటున చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే ఇప్పుడు వస్తున్న సంక్షేమ పథకాలు అన్నీ కూడా ఆగిపోవడం గ్యారంటీ అని ఆ విషయాలను ప్రజలు ఒకసారి కూర్చొని చర్చించుకుని ప్రజలకు ఇంటి వద్దకే ప్రభుత్వ పథకాలను ప్రభుత్వ కార్యక్రమాలను అందించిన వైఎస్ఆర్సిపి ప్రభుత్వాన్ని మరోసారి ఆశీర్వదించి తిరిగి మళ్లీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మనందరం అండగా ఉండాలని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి కోరారు. తాను అల్లూరు, సర్వేపల్లి, నెల్లూరు పార్లమెంట్, రూరల్ ఇన్చార్జిగా పనిచేసిన సమయాల్లో ఎక్కడ కూడా ఎవరిని బెదిరించినట్లు, వేధించినట్లు, కేసులు పెట్టినట్లు, ఇబ్బంది పెట్టినట్లు ఎక్కడ కనిపించిన దాఖలు లేవని ఆ విషయాన్ని ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించి మంచికి చోటు ఇవ్వాలని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి చెప్పారు. తన 25 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎక్కడా కూడా, ఎప్పుడో కూడా చిన్న అవినీతి మచ్చ కూడా తన పైన లేదని ఆ అంశాలను కూడా ప్రజలు పరిగణాలోనికి తీసుకొని తనకు రానున్న ఎన్నికల్లో మంచి మద్దత్తు అందించాలని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి కోరారు. భవిష్యత్తులో ప్రజలందరూ సంపూర్ణ ఆయురారోగ్యాలతో, సంతోషాలతో జీవించాలని మనస్పూర్తిగా భగవంతుని కోరుకుంటున్నానని వైసీపీ రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి చెప్పారు. ఆమంచర్ల గ్రామం అభిమానంతో చిందులేసింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో ఏమాత్రం అభిమానం తగ్గలేదు అనే విధంగా సోమవారం సాయంత్రం ఎన్నికల ప్రచారానికి విచ్చేసిన వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి రోడ్ షోలో నిరూపించారు. గుండె నిండా వైస్సార్సీపీ అభిమానాన్ని, మదిలో జగనన్న ప్రేమ వెరసి ఉప్పొంగిన అభిమానం ఉరకలేస్తూ చిన్న, పెద్ద, పురుషులు, స్త్రీలను తేడా లేకుండా ఆనందోత్సాహాలతో చిందులేసి ఆమంచర్ల గ్రామం వైఎస్ఆర్సిపి అడ్డా అని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డికి విజయ సంఘీభావాలు తెలిపారు. ఎన్నికల ప్రచారానికి విచ్చేసిన వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి ఎన్నికల రోడ్ షోకు ఆమంచర్ల గ్రామపంచాయతీ మజారా నుండి పెద్ద ఎత్తున ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఎన్నికల ప్రచారం నిర్వహించిన వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి రెండు చేతులు జోడించి వినయ పూర్వకంగా నమస్కరిస్తూ ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని చేపట్టారు. తమ అభిమాన నాయకుడికి ఆమంచర్ల గ్రామస్తులు తిరిగి రెండు చేతులు ఊపి తమ మద్దత్తు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే, మీ విజయని మేం కోరుకుంటున్నాం అని సంకేతాలు తెలియజేశారు. వచ్చే ఎన్నికల్లో నెల్లూరు రూరల్ నుండి పోటీ చేస్తున్న తనను నెల్లూరు పార్లమెంటు ఎంపీ అభ్యర్థి విజయ సాయిరెడ్డిని మంచి మెజారిటీతో గెలిపించాలని ఓటర్లకు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
చంద్రబాబు పేరు చెబితే గుర్తుకు వచ్చేది ‘కరువు-కాటకం’. పధకం… ఆమంచర్ల రోడ్ షో లో ఆదాల ఎద్దేవా
Related Posts
వి.ఎస్.యు. ఎన్.ఎస్.ఎస్. ప్రోగ్రామ్ అధికారులకు జిల్లా స్థాయి ప్రశంస పత్రాలు
ప్రభాతదర్శిని, (ప్రత్యేక- ప్రతినిధి):జిల్లాలో వివిధ విభాగాల్లో విశేషమైన సేవలు అందించిన ఉద్యోగులను 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా కలెక్టర్ ప్రశంసిస్తూ జిల్లా స్థాయి ప్రశంస పత్రాలను అందజేశారు. ఈ అవార్డుకు వి.ఎస్.యు ఎన్.ఎస్.ఎస్.కి చెందిన 5 ప్రోగ్రామ్ అధికారులు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా, ఉపకులపతి ఆచార్య ఎస్. విజయభాస్కర రావు ప్రశంసా పత్రాలను అందుకున్న ప్రోగ్రామ్ అధికారులను ప్రత్యేకంగా అభినందించారు. ఆయన మాట్లాడుతూ, “జాతీయ సేవా పథకం (ఎన్.ఎస్.ఎస్.)…
Read moreక్రీడలు శారీరిక మానసిక ఉల్లాసానికి అవసరం
ఇంటర్-కాలేజియేట్ టోర్నమెంట్ ముగింపులో ఎస్వీయూ వైస్ ఛాన్సలర్ప్రభాతదర్శిని, (ప్రత్యేక- ప్రతినిధి): క్రీడలు మానసిక ఉల్లాసానికి అవసరమని విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ఆచార్య ఎస్ విజయభాస్కరరావు అన్నారు. వెంకటాచలం మండలం కాకుటూరు లోని విక్రమ సింహపురి విశ్వవిద్యాలయంలో నిర్వహించిన ఇంటర్కాలేజియేట్ పురుషుల క్రీడల టోర్నమెంట్ ముగింపు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరై టోర్నమెంట్లో గెలుపొందిన జట్లకు బహుమతులు ప్రధానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “క్రీడలు…
Read more