ప్రభాతదర్శిని, (నాయుడుపేట-ప్రతినిధి): వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి ని విమర్శించే అర్హత కూటమి పార్టీ నాయకులకు లేదని పెళ్లకూరు మండల జడ్పిటిసి సభ్యులు నన్నం ప్రిస్కిల్లా అన్నారు.శుక్రవారం నాయుడుపేట పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య క్యాంపు కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. అనేకమంది కార్యకర్తలకు రాజకీయ ఓనమాలు నేర్పి తిరుగులేని నేతగా ఎదిగిన వైసీపీ నేత కామిరెడ్డి సత్యనారాయణరెడ్డిని కూటమి పార్టీ నాయకులు విమర్శించడాన్ని ఆమె ఖండించారు.ఇంటికో బెల్ట్ షాపు నిర్వహిస్తూ మద్యాన్ని ఏరులై పారిస్తూ, ప్రజల ఆరోగ్యాలను కాలరాస్తూ దోచుకుంటున్న కూటమి నాయకులు సత్యనారాయణ రెడ్డిని విమర్శించడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని ఆమె అన్నారు.తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదన్నారు.ఈ కార్యక్రమంలో పెళ్ళాకూరు ఎంపీపీ పోలంరెడ్డి శేఖర్ రెడ్డి,వైస్ ఎంపీపీ సుధారాణి,వైసిపి పెళ్లకూరు మండల కన్వీనర్ ఒబ్బు వెంకటయ్య,సూళ్లూరుపేట నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షులు పాలేటి నాగార్జున, వైసిపి నాయకులు నల్లు మోహన్,బాలు,ఆనంద్,కుమార్ తదితరులు పాల్గొన్నారు.