ప్రభాత దర్శిని (కావలి – ప్రతినిధి): ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఆదివారం కావలి పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో యాభై మూడు మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణీ చేశారు. మొత్తం రూ.నలభై మూడు లక్షల విలువైన ఆర్థిక సహాయాన్ని లబ్ధిదారులకు అందజేశారు.గత ఇరవై ఒక్క నెలల కాలంలో కావలి నియోజకవర్గంలో 1,018 మందికి మొత్తం రూ.8,21,26,116 విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ అందజేసినట్లు చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా సీఎం సహాయ నిధి పంపిణీలో కావలి నియోజకవర్గం మూడవ స్థానంలో నిలవడం గర్వకారణమని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వైద్య సహాయానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నారని, అత్యవసర పరిస్థితుల్లో పేదలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందన్నారు. ముఖ్యమంత్రి ఆశీస్సులతో కావలి నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయని, ప్రజల సంక్షేమమే తమ ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, లబ్ధిదారుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.