నెల్లూరు జిల్లా కలెక్టర్ ఒ.ఆనంద్
ప్రభాతదర్శిని, (నెల్లూరు- ప్రతినిధి): నెల్లూరు జిల్లాలో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలలో కంప్యూటరీకరణ వేగవంతం చెయ్యాలని జిల్లా కలెక్టర్ ఒ.ఆనంద్ సహకారశాఖ అధికారులను ఆదేశించారు.జిల్లా సహకార అభివృద్ధి కమిటీ సమావేశం జిల్లా కలెక్టరు అధ్యక్షతన కలెక్టర్ ఛాంబర్లో బుధవారం జరిగింది. పిఎసిఎస్ల సామర్థ్యం, పారదర్శకత పెంపొందించడానికి కేంద్ర ప్రభుత్వం జిల్లాలో 78 పిఎసిఎస్లను నాబార్డు జాతీయ సాఫ్ట్వేర్ నెట్వర్కుకు అనుసంధానం చేసిందని, అందువల్ల కంప్యూటరీకరణ వేగవంతం చెయ్యాలని సూచించారు. జిల్లాలో 54 పిఎసిఎస్లలో 2,03,236 మెంబర్షిప్లు, 25,914 రికార్డులు అప్లోడ్ చేయడం జరిగిందన్నారు. మిగిలినవి కూడా సెప్టెంబరులోగా పూర్తి చెయ్యాలన్నారు. జిల్లాలో కొత్తగా మల్టీపర్పస్ డెయిరీ, సహకార, మత్స్య సహకార సంఘాల కంప్యూటరీకరణకు జిల్లా ప్రణాళిక సిద్ధం చేసి ప్రణాళిక అమలుకు లబ్ధిదారులకు అవసరమైన సహకారం అందించాలన్నారు. సహకార రంగంలో వికేంద్రీకృత ధాన్యం నిల్వ కేంద్రాల నిర్మాణానికి జిల్లాలో కోవూరు మండలం పడుగుపాడు పిఎసిఎస్ పైలట్ ప్రాజెక్టు ఎంపిక కోసం సొసైటీ కమిటీ రిజల్యూషన్ చేసి కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపడం జరిగిందన్నారు. దీనిలో వ్యవసాయ మౌలిక సదుపాయాలైన గోడౌన్లు, కస్టమ్ హైరింగ్ సెంటర్లు, ప్రాసెసింగ్ యూనిట్లు, చౌకధర దుకాణాలు, కేంద్ర ప్రభుత్వం వివిధ పథకాల క్రింద ఒకచోట ఏర్పాటు చేయడం జరుగుతుందని, పిఎసిఎస్ల ఆర్థిక కార్యకలాపాలు, ఉపాధి అవకాశాలు కల్పించడానికి గ్రామీణ ప్రాంతాలలో ఎల్పిజి పంపిణీ, పెట్రోల్ పంపులు అవుట్లెట్ల ఏర్పాటు కోసం ఐదు పిఎసిఎస్లను గుర్తించడం జరిగిందని వాటి ఏర్పాటుకు అన్ని లైసెన్సులు పొంది తగిన చర్యలు తీసుకోవాలన్నారు. మరో 5 పి ఎ సి ఎస్ లలో పి ఎం జన ఔషధి కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు.
ఈ సమావేశంలో జేసీ సేదు మాధవన్, డిసిఒ గుర్రప్ప, జిల్లా వ్యవసాయాధికారి సత్యవాణి, మత్స్యశాఖ జెడి నాగేశ్వరరావు, పశుసంవర్థకశాఖ జెడి కోటేశ్వరరావు, డిపిఓ సుస్మిత, నాబార్డు, సహకార బ్యాంకు అధికారులు పాల్గొన్నారు.
వ్యవసాయ సహకార పరపతి సంఘాలలో కంప్యూటరీకరణ వేగవంతం చెయ్యాలి
Related Posts
అట్టహాసంగా ప్రారంభమై… అంగరంగ వైభవంగా… ముగిసిన ఫ్లెమింగో ఫెస్టివల్ 2025 వేడుకలు
ముగింపు కార్యక్రమ వేడుకలకు రాష్ట్ర రెవెన్యూ, మంత్రి అనగాని సత్యప్రసాద్ప్రభాతదర్శిని,(తిరుపతి-ప్రతినిధి): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఫ్లెమింగో ఫెస్టివల్ 2025 కార్యక్రమాలు జిల్లాలో అత్యంత ఘనంగా పండుగ వాతావరణంలో నిర్వహించడం జరిగిందని, పర్యాటక రంగ అభివృద్ధికి, సంక్షేమం అభివృద్ధి సమపాళ్లలో అమలుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఇది మంచి ప్రభుత్వం అని మూడవ రోజు ఫ్లెమింగో ఫెస్టివల్ 2025 కార్యక్రమ ముగింపు వేడుకలకు రాష్ట్ర…
Read moreఫ్లెమింగో ఫెస్టివల్ 2025 కి తరలి వస్తున్న ప్రజలు పర్యాటక ప్రేమికులు
ఆకట్టుకుంటున్న పలు శాఖల, విభాగాల స్టాల్స్ప్రజల్ని పర్యాటకులను ఆద్యంతం ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలుఫ్లెమింగో ఫెస్టివల్ కు తరలి వస్తున్న విద్యార్థులు, ప్రజలు, పర్యాటకులుజన సంద్రంగా మారిన సూళ్లూరుపేట జూనియర్ కాలేజీ ప్రాంగణంవివిధ ఆటల పోటీలతో ఆకట్టుకున్న యువత ప్రభాతదర్శిని ( సూళ్లూరుపేట-ప్రతినిధి ): రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఫ్లెమింగో ఫెస్టివల్ 2025 రెండవ రోజు అంగరంగ వైభవంగా విద్యుత్ కాంతులలో కిక్కిరిసిన జనం కేరింతలతో ఉత్సాహంగా…
Read more