అసాంఘిక కార్యక్రమాలు నిర్వహించే వారి చర్యలు: పట్టణ సీఐ బాబి
ప్రభాతదర్శిని, (నాయుడుపేట-ప్రతినిధి):నాయుడుపేట పట్టణంలోని టీచర్స్ కాలనీలో వ్యభిచార గృహం నడుస్తున్నట్లు అందిన సమాచారం మేరకు సోమవారం రాత్రి పట్టణ సీఐ బాబి ఆధ్వర్యంలో పోలీసులు దాడి చేసి ఐదు మందిని అరెస్టు చేశారు. ఈ సందర్భంగా మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో సీఐ బాబి మాట్లాడారు.నెల్లూరు పట్టణానికి చెందిన ఓ మహిళ పట్టణంలోని టీచర్స్ కాలనీలో ఓ ఇంటిని బాడుకు తీసుకొని నివాసం ఉంటూ బయట ప్రాంతాల నుండి మహిళలను తీసుకొచ్చి వ్యభిచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.తమకు అందిన సమాచారం మేరకు దాడి చేసి నిర్వాహకురాలు తోపాటు ఇద్దరు మహిళలు,ఇద్దరు పురుషులను అరెస్టుచేసి కేసు నమోదు చేసినట్లు తెలియజేశారు.పట్టణ ప్రజలు పోలీసులకు సహకరించి అసాంఘిక కార్యక్రమాల నిర్వహించే వారి వివరాలను తమకు తెలియజేయాలని అన్నారు. వివరాలు తెలియజేసిన వారి పేర్లు గోప్యంగా ఉంచబడతాయన్నారు. అసాంఘిక కార్యక్రమాలు నిర్వహించే వారు ఎంతటి వారైనా చర్యలు తీసుకుంటామన్నారు.