ప్రభాతదర్శిని,
(హైదరాబాద్-ప్రతినిధి):గల్ఫ్ బాధితులు బోర్డ్ అసోసియేషన్ అధ్యక్షులు మందం భీమ్ రెడ్డి మరియు నానిగి దేవేందర్ రెడ్డి పిలుపు మేరకు రాష్ట్రంలో ఉన్న ఎంతోమంది గల్ఫ్ బాధితులు విదేశాల్లో ఉండి అక్కడే మరణించినప్పటికీ వారి మృతదేహాలని అప్పటి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం సహకరించ లేనప్పటికీ గల్ఫ్ బాధితుల బోర్డ్ అసోసియేషన్ ఏర్పాటు చేసి కీలక పాత్ర వహిస్తున్న మందం భీమ్ రెడ్డి.. నానిగి దేవేందర్ రెడ్డి మరియు చాంద్ పాషా వీళ్ళందరూ కలిసి విదేశాల్లో మరణించిన మన తెలుగు వాళ్లకు వాళ్ళ మృతదేహాలను కూడా రంపించిన ఘనత మాదే స్వంత ఖర్చులతో మేము గల్ఫ్ బాధితుల సమస్యలను తీర్చుతున్నాం దీనికి కేంద్ర ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదు అప్పటిలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది అయినప్పటికీ మేము ముందుండి మేము గల్ఫ్ బాధితుల సంఘాన్ని ఏర్పాటు చేసుకొని గల్ఫుల్లో చిక్కుకున్న తెలుగు ప్రజల వారికి అండగా ఉంటున్నాం.. ఈ గల్ఫ్లో మృతి చెందిన వారికి ఎవరు లేకుంటే మేము మా సంఘం ద్వారా మృతి చెందిన మృతి దేహాలను దగ్గరుండ తెప్పిస్తున్నాము దాదాపు 600 పైగా మృతి దేహాలను కూడా తెప్పించాము.. ఇప్పుడు గల్ఫ్ బోర్డ్ బాధితులుగా సక్రమంగా ప్రతి ఒక్కరికి అండగా నిలుస్తూ గల్ఫ్ బాధితులు చిక్కుకున్న ప్రతి ఒక్కరికి ఆదుకుంటున్నాం కానీ నిజామాబాద్ ఎంపీ అరవింద్ గల్ఫ్ బాధితుల బోర్డ్ పై వ్యతిరేకించారు. గల్ఫ్ బాధితుల సమస్యలను తీర్చడానికి ఈ బోర్డు ని ఏర్పాటు చేసాం.. అయితే నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ గల్బోర్డుని వ్యతిరేకించిన విధంగా తప్పుడు ప్రచారం చేస్తూ గల్ఫ్ బోర్డ్ ను ఏర్పాటు చేయాల్సిన సమయంలో బోర్డును రద్దు చేసే ప్రయత్నాలు చేసి కాకుండా చేశారు మళ్లీ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు ఖబర్దార్ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ చాంద్ పాషా సవాల్ విసిరారు మేము గల్ఫ్ బాధితులపై పోరాడితే నీకేమి నష్టం మీ కేంద్ర ప్రభుత్వం ఉన్నప్పటికీ మరి గన్ బాధితుల సంఘాన్ని మేము ఏర్పాటు చేసి వారి సమస్యలను పరిష్కరించాలని మేము చూస్తే మీరు ఎందుకు వ్యతిరేకించారు దానిపై సమాధానం చెప్పాలి ధర్మపురి అరవింద్ కు సవాల్ విసిరిన చాంద్ పాషా.. కేంద్ర ప్రభుత్వం గల్ఫ్ బోర్డ్ ఏర్పాటుపై చేసిన అనుచిత వ్యాఖ్యలను వెంటనే క్షమాపణ చెప్పాలని మందం భీమ్ రెడ్డి నగినేని నాగేందర్ రెడ్డి మరియు చాంద్ పాషా డిమాండ్ చేశారు.

మీడియా సమావేశం నిర్వహిస్తూ ముఖ్యంగా తెలంగాణ స్టేట్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులు టైగర్ అలీ నవాబ్ తో మీడియా సమావేశంలో పాల్గొన్న గల్ఫ్ బాధితుల అధ్యక్షులు మందం భీంరెడ్డి నాగినేని నరేందర్ రెడ్డి మరియు చాంద్ పాషా ఈ మీడియా సమావేశంలో స్థానిక పోలీస్ నజర్ న్యూస్ సీఈఓ షేక్ రహీమ్ కూడా ఉన్నారు. చాంద్ పాషా మాట్లాడుతూ
గల్ఫ్ బోర్డు వ్యతిరేకి నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి అర్వింద్ అని, గల్ఫ్ బాధిత కుటుంబాల గురించి మాట్లాడే అర్హత బిజెపి పార్టీకి, నిజామాబాద్ అభ్యర్థి అర్వింద్ కు లేదని టిఫిసిసి రాష్ట్ర ఎన్నారై సెల్ కన్వీనర్ డాక్టర్ షేక్ చాంద్ పాషా అన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో పర్యటించిన అర్వింద్ గల్ఫ్ బోర్డు, జీవన్ రెడ్డి పై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఈ సందర్బంగా చాంద్ పాషా మాట్లాడుతూ అనేక ఉద్యమాల మాదిరిగానే, గల్ఫ్ ఉద్యమం పుట్టింది కూడా జగిత్యాలలో అని గుర్తు చేశారు. ప్రతిపక్షంలో ఉన్నానాడు గల్ఫ్ కుటుంబాలపై ఎనలేని ప్రేమను ఓలకబోసిన బీఆరెస్, బిజెపి లు పదేళ్లు అధికారం లో ఉండి గల్ఫ్ బాధిత కుటుంబలకు, గల్ఫ్ కార్మికులకు చేసిన సేవలు, కృషి శూన్యం అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో గల్ఫ్ కుటుంబలకు అండగా నిలిచింది ఆనాటి అధికార కాంగ్రెస్ పార్టీ అని గుర్తు చేశారు. గల్ఫ్ లో మృతి చెందిన మృతుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియ కింద రూ. లక్ష పరిహారం అందించిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కిందన్నారు. శంషాబాద్ ఏయిర్ పోర్ట్ నుండి గల్ఫ్ మృతులను వారి స్వగ్రామాలకు తరలించేందుకు ప్రభుత్వం ద్వారా ఉచిత అంబులెన్సు సేవలు ఏర్పాటు చేసిన విషయం గుర్తుంచుకోవాలన్నారు. హోమ్ క్యాబ్ సంస్థ ద్వారా ప్రత్యేక అధికారిని నియమించి, నైపుణ్య శిక్షణ అందించి గల్ఫ్ కుటుంబలకు అండగా నిలిచిందన్నారు. ప్రభుత్వం తరుపున గ్రామ గ్రామాన గల్ఫ్ సభలు నిర్వహించడం తో పాటు, నకిలీ ఎజెంట్లు, ట్రావెల్స్ పై ఉక్కుపాదం మోపిన విషయాన్నీ అర్వింద్ గుర్తుకు తెచ్చుకోవాలన్నారు. ఉమ్మడి రాష్ట్రం లో హైదరాబాద్ లో ఉన్న పాస్ పోర్ట్ కార్యాలయంను కరీంనగర్, నిజామాబాద్ కేంద్రాలకు తెచ్చిన ఘనత అప్పటి ఎంపీ మధు యాస్కి కి దక్కిందన్నారు. గల్ఫ్ బాధితుల పక్షాన పోరటం చేసి అధికారంలోకి రాగానే సమస్యలు పరిష్కరిష్టమని పేర్కొన్న బీజేపీ అధికారంలోకి వచ్చిన పదేళ్లలో గల్ఫ్ కార్మికులకు, బాధిత కుటుంబలకు చేసింది ఏమిటో అర్వింద్ చెప్పాలని పాషా డిమాండ్ చేశారు. గల్ఫ్ కార్మికులు, బాధిత కుటుంబాల గురించి గానీ, ఎమ్మెల్సి జీవన్ రెడ్డి గారిని విమర్శించే అర్హత అర్వింద్ కు ఎక్కడిది అని ప్రశ్నించారు. ప్రభుత్వం భూమిలు అమ్మి గల్ఫ్ కార్మికులను, బాధిత కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చిన కేసీఆర్ పదేళ్లు అధికారంలోకి ప్రభుత్వ నాయకులు భూములు కబ్జాలు చేసుకున్నారే తప్ప, కార్మికుల సంక్షేమం కోసం సెంటు భూమి కూడా అమ్మిన దాఖలాలు లేవని, ఈ విషయంను కేసీఆర్ గుర్తుకు తెచ్చుకోవాలన్నారు. బొంబాయి భీవండి బొగ్గుభాయి అంటూ ఊకదంపుడు ఉపన్యాసలతో ఊదారగొట్టిన ఉద్యమ నేత అధికారంలోకి రాగానే వాగ్దానలు గాలికి వదిలేసింది వాస్తవం కాదా అని చంద్ పాషా ప్రశ్నించారు. ఎన్అర్ ఐ సెల్ ఎందుకు ఏర్పాటు చేయలేదో, రూ.500 కోట్లు ఎందుకు కేటాయించలేదో గల్ఫ్ కుటుంబలకు బీఆరెస్ నాయకులు సమాధానం ఇస్తూ ఓట్లు అడగాలని డిమాండ్ చేశారు. నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో మృతుల కుటుంబాలను ఎనడైనా అర్వింద్ పరామర్శించ్చాడా? ఒక్క గల్ఫ్ కుటుంబాన్ని అయిన ఆదుకున్న చరిత్ర అర్వింద్ కు ఉందా? ఆత్మవిమర్శ చేసుకొని వాటిపై శ్వేతాపత్రం విడుదల చెయ్యాలని డిమాండ్ చేశారు. ముస్లిం సమాజం పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. ఒక ముస్లిమ్ అయి ఉండి కూడా అనేక మంది హిందూ సోదరుల గల్ఫ్ మృతదేహాలను మోసిన చరిత్ర నాకుందని, అలాంటి మమ్మల్ని సిమి లాంటి ఉగ్ర సంస్థలతో మా జాతిని పోల్చిన అర్వింద్ పై భేశరతుగా సుమోటో కింద కేసు నమోదు చెయ్యాలని పాషా విజ్ఞప్తి చేశారు. హిందూ ముస్లిమ్ భాయ్ భాయ్ అనేలా, మత సమరష్యానికి ప్రతీకగా ఉన్న జగిత్యాల ప్రాంతంలో విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేసిన అర్వింద్ పై కేసులు నమోదు చేయాలనీ చంద్ పాషా పోలీసులకు, ఎన్నికల కమిషన్ కు విజ్ఞప్తి చేశారు.