ప్రభాతదర్శిని (వేములవాడ ప్రతినిధి):వేములవాడ పట్టణంలో శుక్రవారం రోజున ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ విప్,వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మీడియా సమావేశం మాట్లాడుతూ 15ఏండ్ల క్రితమే రమేష్ బాబు దేశ పౌరుడు కాదని నేను చెప్పిందే నిజమైందని.గత 15ఏండ్లుగా నాతో పాటు నడిచి నాకు అండగా నిలిచిన మిత్రులకు, శ్రేయోభిలాషులకు, నియోజకవర్గ ప్రజలకు, ఆనాటి సిఎం రాజశేఖర్ రెడ్డి, ఈనాటి సీఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రులు రత్నాకర్ రావు, జీవన్ రెడ్డిలతో పాటు కేంద్ర మంత్రులకు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ మిత్ర బృందానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.నేను చేసిన 15 ఏళ్ల ధర్మ పోరాటంలో నాకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరితో పాటు నేను చేసిన ప్రతి కార్యక్రమాన్ని ప్రపంచానికి తెలియజేసిన మీడియా మిత్రులకు ప్రత్యేక ధన్యవాదాలు అన్నారు.నాకు తెలిసి ప్రపంచ చరిత్రలోనే ఇలాంటి కేసు నమోదు కాలేదు రమేష్ బాబుది లా మేకర్ చరిత్ర కాదు లా బ్రేకర్ చరిత్ర.ఇంత జరిగినా తీర్పు హేతుబద్దంగా లేదు నన్ను నిరాశపరిచిందని రమేష్ బాబు అంటున్నాడు, నేను ముమ్మాటికి భారతదేశ పౌరుడిని అని అంటున్నాడు.ఇప్పటికీ 45 సార్లు రమేష్ బాబు జర్మనీ పౌరుడని నిరూపించబడింది అయినప్పటికీ ఇంకా ఆయనకు బుకాయింపు ఎందుకో అని వ్యక్తం చేశారు.రమేష్ బాబు భారతదేశాన్ని మోసం చేస్తున్నారు తప్పితే జర్మనీ కాదు.నేను చేసిన పోరాటం వల్ల 2013లో రమేష్ బాబు భారతదేశ పౌరసత్వం తీసుకున్నాడు.రమేష్ ఏనాడు పౌరసత్వం తీసుకున్నాడో ఆనాడే నేను నైతికంగా గెలిచాను.రమేష్ బాబు జర్మనీని ప్రేమిస్తూ భారతదేశాన్ని నియోజకవర్గ ప్రజలను మోసం చేస్తున్నాడు. 2013 నుండి 2023 వరకు ఆయన ఓసీఐ కార్డు కలిగి ఉన్న మాట నిజం కదా.2019లో మళ్లీ ఒకసారి జర్మనీలోని బెర్లిన్ లో ఓసిఐ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నాడు.ఇక్కడ ఎమ్మెల్యే అని చెబుతూ అక్కడ ప్రొఫెసర్ అని చెప్పుకునే వాడు ,నాలుగు సార్లు గెలిపించిన నియోజకవర్గ ప్రజలను మోసం చేసి అడ్డంగా దొరికిపోయిన దొంగ రమేష్ బాబు. రమేష్ బాబు తీరుతో ఆయన వంశానికి, ఆయన తల్లిదండ్రులకు చెడ్డ పేరు తీసుకువచ్చాడు.నేను రోల్ మోడల్ ఛాంపియన్ అని చెప్పుకున్న రమేష్ బాబు చేసింది తప్పని 3మెన్ కమిటీ కూడా నిర్ధారించింది. రమేష్ బాబు జర్మనీ పౌరుడైనని కేంద్ర హోంశాఖ మూడుసార్లు చెప్పింది. అయినప్పటికీ నేను ఎలా బ్రతికేది అంటే నీకు జర్మనీలో పౌరసత్వం ఉన్నది నిజం కదా అని అడిగింది.15 ఏళ్లుగా తనకు అన్యాయం జరిగిందని కోర్టు చెప్పిన మాట నిజం కాదా.తండ్రి చాటు బిడ్డగా నియోజవర్గ ప్రజలను మోసం చేసి గెలిచిన వ్యక్తి రమేష్ బాబు.అదే 2009లో కేవలం 1800 ఓట్ల తేడాతో ఓడిపోయిన నేను ఆనాడే గెలిచుంటే ఈరోజు పరిస్థితి ఎలా ఉండేదో నియోజకవర్గ ప్రజలు ఆలోచన చేయాలి.నేను గెలిచిన, ఓడిన నియోజకవర్గ ప్రజల కష్టాల్లో పాలుపంచుకున్న మాట నిజం కాదా..రమేష్ బాబు స్వార్థం వల్ల నియోజకవర్గ ప్రజలకు ఎంత అన్యాయం జరిగిందో చూస్తున్నారు కదా..కానీ ఈసారి ప్రజల ఆశీర్వాదంతో గెలిచిన తాను ఇప్పటికే 750 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టాను.శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుతో కలికోట సూరమ్మ చెరువు, మరిపెళ్లి రిజర్వాయర్ పనులు మొదలై కొనసాగుతున్న మాట వాస్తవం కాదా.తనను ఎన్నో అవమానాలు, అవహేళనలు చేసిన నీవు ఇప్పుడు ఏమి సాధించావు అని అడుగుతున్న…నాది మచ్చలేని కుటుంబమని ఎన్నోసార్లు చెప్పావు మరి ఇప్పుడు ఏమంటావు రమేష్ బాబు.ఇప్పుడు ఈ సమాజానికి ఏ సమాధానం చెబుతావు బాబు…ఎన్నికల్లో గెలుపు, ఓటములు సహజం గత పదిహేనేళ్లుగా రమేష్ బాబు పై తాను న్యాయపరంగా పోరాటం చేశానే తప్పితే ఏనాడు వ్యక్తిగతంగా విమర్శలు చేయలేదని కానీ రమేష్ బాబు తో పాటు ఆయన అనుచరులు తనను ఎన్నో ఇబ్బందులు పెట్టారు, కేసులో ఇరికించే ప్రయత్నం చేశారు.. తులనాడే మాటలు మాట్లాడింది నిజం కదా…అయినప్పటికీ వారిపై వ్యక్తిగతంగా నాకు ఎలాంటి కోపం లేదు.ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని నిలబడ్డాను అందుకే ఈనాడు నేను గెలిచాను. ఎవరిన్ని చేసినా చివరికి న్యాయమే గెలిచింది..భారత న్యాయవ్యవస్థలో ఈ తీర్పు ఒక చక్కటి వేదికగా నిలిచింది.రమేష్ బాబు 1991 లో భారత దేశ పౌరసత్వం రద్దు చేసుకుని మళ్ళీ మూడు 2009లో భారతదేశ పారసత్వం పొందారు..
2013 సంవత్సరంలో జర్మనీ పాస్పోర్ట్ రెన్యువల్ చేసుకున్నది తప్ప భారతదేశ పాస్పోర్ట్ ఎందుకు రెన్యువల్ చేసుకోలేదు..ఐదు సార్లు తీర్పు వచ్చిన ఏ మాత్రం చిత్తశుద్ధి లేదు..ఓసీఐ కార్డు ఉన్న వ్యక్తి భారతదేశంలో ఓటు వేయడానికి అనర్హుడు మళ్లీ పది సంవత్సరాలు ఓసి కార్డు పొడిగించమని ఎందుకు అడిగారు.తన పరపతి ఉపయోగించి ఓటర్ లిస్టులో పేరు ఎక్కించుకున్నారు.దరఖాస్తు సమయంలో ప్రస్తుత దేశం జర్మనీ అని పూర్వపు దేశం భారతదేశం అని చెప్పిన మాట వాస్తవం కాదా.తప్పైందని క్షమించమని అడగాల్సింది పోయి మళ్లీ తీర్పు పట్ల నిరాశచెందడం సబావేనా
ఇప్పటికైనా అర్థం చేసుకొని లేనిపోని ఆరోపణలు చేయడం మానేసి నియోజకవర్గ అభివృద్ధిలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలని, ఎన్ని అవంతరాలు ఎదురైన ప్రజల ఆశీర్వాదంతో గెలిచిన నేను చివరి వరకు ప్రజల క్షేత్రంలోనే ఉండి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్ళు ఎందుకు కృషి చేస్తాను.15 సంవత్సరాలుగా ఆది శ్రీనివాస్కు అన్యాయం జరిగిందని సాక్షాత్తు కోర్ట్ చెప్పింది..ఓడిన నేను ప్రజల్లోనే ఉన్న..ఎమ్మెల్యేగా గెలిచిన సంవత్సరం తర్వాత గెలిచిన రోజే అది కూడా తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ చేసిన రోజు కోర్టు తీర్పు రావడం ఆనందంగా ఉంది..న్యాయస్థానాల పట్ల ఒక నమ్మకం ఉంది..15 సంవత్సరాలుగా కోర్టులను భారతదేశాన్ని మోసం చేసినందుకు హైకోర్టు 30 లక్షల దండగ వేసింది..బహుషా ప్రపంచంలో ఇలాంటి కేసు ఎక్కడ ఉండకపోవచ్చు..ఈ తీర్పు వలన దేశంలో ఇలాంటి తప్పు చేయడానికి భయపడతారు. గత 15 ఏండ్ల నా సుదీర్ఘ పోరాటంలో నాకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలుపుతూ మరొకసారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు.