ప్రభాతదర్శిని, (నెల్లూరు-ప్రతినిధి):నెల్లూరు నగర పాలక సంస్థ పరిధిలోని స్థానిక సమస్యలను కమాండ్ కంట్రోల్ విభాగంలో ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ కి ఫోన్ ద్వారా తెలియజేస్తే తక్షణమే స్పందించి ఫిర్యాదును పరిష్కరించేందుకు కృషి చేస్తామని కమిషనర్ సూర్యతేజ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికను నెల్లూరు నగర పాలక సంస్థ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ విభాగం సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించారు. కమిషనర్ సూర్యతేజ పాల్గొని అర్జీదారుల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వివిధ అంశాలపై ప్రజల నుంచి అందుకున్న ఫిర్యాదులు పునరావృతం కాకుండా శాశ్వత పరిష్కారం అందించాలని, వాటన్నింటికీ నిర్ణీత సమయంలోగా పరిష్కారం అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం అందుకున్న వినతులు పునరావృతం కాకుండా అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో శాశ్వత పరిష్కారం అందించాలని అదనపు కమిషనర్ సంబంధిత సెక్షన్ అధికారులకు సూచించారు. విభాగాల వారీగా రెవెన్యూ – 1, ఇంజనీరింగ్ – 13, అకౌంట్స్ – 6, అప్కాస్ – 1, టౌన్ ప్లానింగ్ – 9, పబ్లిక్ హెల్త్ – 6, హౌసింగ్ – 6, మొత్తం 42 ఫిర్యాదులను ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందుకున్నారు. అనంతరం విలేకరులతో కమిషనర్ మాట్లాడుతూ ఫిర్యాదుదారులు తమ సమస్యలను 94940 18118 నెంబరుకు వాట్సప్ ద్వారా లేదా 0861-2356777 & 0861-2316777 హెల్ప్ లైన్ నెంబర్లకు ఉదయం 6:00 గంటల నుంచి సాయంత్రం 6:00 గంటల లోపు తెలియజేయాలని కోరారు. అందుకున్న ఫిర్యాదులను కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా సంబంధిత అధికారులకు తెలియచేసి తక్షణమే సదరు సమస్యలు పూర్తి స్థాయిలో పరిష్కరించేందుకు చర్యలు చేపడతామని కమిషనర్ తెలిపారు. వివిధ మధ్యమాల ద్వారా కంట్రోల్ సెంటర్ కు ఇప్పటి వరకు 909 ఫిర్యాదులను అందుకున్నామని, వాటిలో 718 సమస్యలకు శాశ్వత పరిష్కారం అందించామని కమిషనర్ వివరించారు. స్థానికంగా పార్కుల నిర్వహణలో ప్రజలు స్వచ్చంధంగా భాగస్వామ్యులు కావడానికి ఆసక్తి చూపుతున్నారని, సొసైటీ వెల్ఫేర్ అససియేషన్ ల ద్వారా తప్పనిసరిగా ప్రజల తోడ్పాటు తీసుకుంటామని కమిషనర్ వెల్లడించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అదనపు కమిషనర్ నందన్, నగర పాలక సంస్థ ఇంజనీరింగ్ ఎస్.ఈ రామ్ మోహన్ రావు, ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ చైతన్య, సిటీ ప్లానర్ కృష్ణ కిషోర్, మేనేజర్ ఇనాయతుల్లా ఇతర అన్ని విభాగాల అధికారులు, సూపరెంటెండెంట్ లు, సిబ్బంది పాల్గొన్నారు.
స్థానిక సమస్యల పరిష్కారానికి హెల్ప్ లైన్ కు తెలియజేయండి…నగర పాలక సంస్థ కమిషనర్ సూర్యతేజ
Related Posts
సీఎంను కలిసిన ఎన్ఆర్ఐ ఉన్నం నవీన్
ప్రభాతదర్శిని (శ్రీకాళహస్తి – ప్రతినిధి ):సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ కోసం పనిచేసిన వారిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారు ముఖ్యమంత్రిని కలిసి ఒక రోజంతా ఉండే అవకాశాన్ని టిడిపి పార్టీ కల్పించింది. ఈ కాన్సెప్ట్ తో రూపొందించిన డే విత్ సిబిన్ కార్యక్రమంలో భాగంగా స్వీడన్ కు చెందిన (శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని తొట్టంబేడు మండలం)ఎన్ఆర్ఐ ఉన్నం నవీన్ కుమార్ ను ముఖ్యమంత్రి తన ఇంటికి ఆహ్వానించారు. ఉదయం నుంచి…
Read moreపవన్ కల్యాణ్… మీకు అధికారులు సహకరించకపోవడం ఏంటి?
ఏపీ డిప్యూటీ సీఎం పరిస్థితి విచిత్రంగా ఉందన్న అంబటి రాంబాబుఅధికారంలో ఉన్నది మీరే కదా అంటూ వ్యాఖ్యలుఈ స్కాం నిజమైతే పౌరసరఫరాల శాఖ మంత్రి రాజీనామా చేయాలిసహకరించవద్దని చంద్రబాబు, లోకేశ్ ఏమైనా చెప్పారా అంటూ ప్రశ్నప్రభాతదర్శిని (విజయవాడ-ప్రతినిధి): ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇటీవల కాలంలో తరచుగా పోలీసుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నిన్న కాకినాడ పోర్టు తనిఖీ సందర్భంగా అధికారుల తీరుపైనా ఆగ్రహం వెలిబుచ్చారు.…
Read more