1) G.O.Ms.No.1 Dt:1-1-1994 ప్రకారం పాఠశాలలు ఐదు శాతానికి తగ్గకుండా లాభాలను మాత్రమే ఆశించాలి.వసూలు చేసిన ఫిజుల.నుండి 50% మొత్తాన్ని ఉపాధ్యాయులకు వేతనాలు గా చెల్లిoచాలి.ప్రతి ఏడాది వార్షిక నివేదికలు,ఆడిట్ రిపోర్ట్ ను ప్రభుత్వానికి సమర్పించాలి.2) G.O.Ms.No.42 Dt:30-7-2010 ప్రకారం ఫీజులను పెంచాలంటే డిస్ట్రిక్ట్ ఫీ రేగ్యులేషన్ కమిటీ (DFRC) అనుమతి తీసుకోవాలి. DFRC గా వ్యవహరిస్తారు..3) G.O.Ms.No.246 ప్రకారం పాఠశాలల నిర్వాహణలో సమాజాన్ని భాగస్వామ్యం చేయాలి.సీబియస్ఈ చట్ట ప్రకారం ప్రతి పాఠశాలలో ‘పేరెంట్ టీచర్ అసోసియేషన్’ ఏర్పాటు చేసుకోవాలి.ఈ అసోసియేషన్లో ఇద్దరు తల్లిదండ్రులకు భాగస్వామ్యం కల్పించాలి.వీరిని సంప్రదిన్చిన తరువాతనే ఫిజులను పెంచాలి.4) G.O.Ms.No.91 Dt:6-8-2009 ప్రకారం వన్ టైం ఫిజుగా అప్లికేషన్ ఫీజు రూ100,రిజిస్ట్రేషన్ ఫీజుగా రూ.500,రిఫన్డబుల్ కాషన్ డిపాజిట్ రూ.5000లకు మించకుండా తీసుకోవాలి. జీవో లోని సెక్షన్ 1 (c) ప్రకారం పాఠ్య పుస్తకాలు, స్టేషనరీ, యూనిఫాంలను స్కూల్ యాజమాన్యం సూచించే చోటే కోనాలన్న కచితమైన నిబంధనలేమి పెట్టరాదు.వీటి అమ్మకాలకు పాఠశాలలల్లో కౌంటర్లు ఏర్పాటు చేయరాదు. విద్యార్ధుల తల్లిదండ్రులకు నచ్చిన షాపులో కొనుగోలు చేయవచ్చును… 5) C&DSE Proc Rc.No.780 Dt:16-5-2013 సెక్షన్ 8(1) ప్రకారం పాఠశాలల బోర్డులపై ఇంటర్నేషనల్,ఐఐటి,ఒలంపియాడ్,కాన్సెప్ట్,ఈటెక్నో, ఈ శాస్త్ర అన్న తోకలేవి తగిలించరాదు. కేవలం పాఠశాల అని మాత్రమే బోర్డుపై ఉంచాలి.6) విద్యాహక్కు చట్టం 2009 ప్రకారం ప్రతి ప్రవేటు పాఠశాలలో 25 % సీట్లు కేటాయించ బడింది. పిల్లల వయస్సు 6 సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం అనుమతి పొందిన ప్రైవేటు విద్యా సంస్థలలో నివాసం ప్రాంతం నుండి 1కిలోమీటర్ పరిధి లోని పాఠశాల లు 10 పాఠశాల వరకు నమోదు చేసుకోవచ్చు.. లాటరీ పద్ధతిలో ఆయా పాఠశాలల లో సీట్లు కేటాయించ బడుతుంది.. 1వ తరగతి చేరికతో ప్రారంభమై పిల్లలు చదువు 8వ తరగతి వరకు అదే పాఠశాలలో కొనసాగు తుంది. పాఠ పుస్తకాలు పాఠశాల యూనిఫామ్ తదితరాలు ఉచితంగా పాఠశాల వారే ఇవ్వాలి.. ఇందు ఖర్చు మొత్తం ప్రభుత్వం ప్రైవేటు పాఠశాల వారికి ఇస్తారు.7) ఉన్నత విద్య సంస్థలలో అక్రమ ఫీజుల వసూళ్లు నిషేధం G.O.MS.No.40 హయ్యర్ ఎడ్యు కేషన్ (E.C) డిపార్ట్మెంట్, తేదీ:24-06-2016 విడుదలచేసిన ఉత్తర్వు లకు విరుద్ధంగా మరియు 27-05-2016న జరిగిన సమావేశంలో కమిటీ (AFRC) ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఉత్తర్వులు మేరకుప్రై వేట్ అన్-ఎయిడెడ్ ఇన్స్టిట్యూట్ లలో రుసుము మరియు ప్రత్యేక రుసుము నిర్మాణ తీర్మానానికి వ్యతిరేకంగా మరియు APHERMC, తేదీ:28/11/2023వ ఉత్తర్వులకు వ్యతిరేకంగా రాష్ట్రంలోని ఏ ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాల లలో విద్యార్థుల నుండి సెమిస్టర్ పరీక్ష ఫీజులు, బిల్డింగ్, యూనివర్సిటీ, ల్యాబ్, సాంస్కృతిక, క్రీడా, కళాశాల యూనిఫారం, ఫీల్డ్ ట్రిప్, స్టూడెంట్ సర్వీస్, ఇన్సూరెన్స్ పలు రకాలైన ఫీజులు వసూలు చేయరాదు.ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలు KG To PG ఇంజనీరింగ్ మెడికల్ తదితర విద్యా కు సంబంధించిన సమస్యలపై 1) జిల్లా కలెక్టర్ 2) రెవెన్యూ డివిజన్ అధికారి 3) రాష్ట్ర ముఖ్యకార్యదర్శి 4)విద్యా శాఖ మంత్రి 5) ముఖ్యమంత్రి, 1.LkG to 10 వ తరగతి వరకు 1)జిల్లా విద్యాశాఖ అధికారి .DEO 2) మండల విద్యా శాఖ అధికారి MEO 3) రీజనల్ జాయింట్ డైరెక్టర్ RJD 4) పాఠశాల విద్య కమీషనర్ 5) పాఠశాల విద్య ముఖ్య కార్యదర్శి2.ఇంటర్ బోర్డు మరియు ఇంటర్ ఒకేషనల్ విద్య: 1) కళాశాల ప్రిన్సిపాల్ 2) జిల్లా ఇంటర్మీడియట్ బోర్డు అధికారి. RIO 3) జిల్లా ఒకేషనల్ విద్యాశాఖ అధికారి Dy.EO 4)రీజనల్ జాయింట్ డైరెక్టర్ RJD 5) బోర్డు ముఖ్య కార్యదర్శి, 3.డిగ్రీ ,పీజీ , ఇంజనీరింగ్ తదితర ఉన్నత విద్యకు సంబంధించి ఫిర్యాదు లు, APHERMC గ్రీవెన్స్ నెంబర్/ WhatsApp: +91 93924 58459 …మెయిల్ ఐడి: aphermc@gmail.com, విద్య సమస్యలపై..1)యూనివర్సిటీల రిజిస్ట్రేర్ 2) యూనివర్సిటీల చాన్సలర్ 3) గవర్నర్ 4) యుజిసి చైర్మన్..4.ఇంజనీరింగ్ ,డిప్లొమా కోర్సులు ఏపీ స్టేట్ లో మూడు జేఎన్టీయూ ల పరిధిలో ఉంటాయి 1) అనంతపూర్ 2) కాకినాడ 3) విజయనగరం1) కళాశాల ప్రిన్సిపాల్ 2) యూనివర్సిటీ రిజిస్ట్రేర్ 3) యూనివర్సిటీ ఛాన్సలర్ 4) రాష్ట్ర టెక్నికల్ బోర్డు కార్యదర్శి 5) AICTE 6) యూజీసీ ….5.మెడికల్,ఫీజీ 1) ప్రిన్సిపాల్ 2) ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ రిజిస్టర్ 3) వైస్ ఛాన్సలర్ 4). గవర్నర్ 5) NMC ఫిర్యాదు చేయాలి. భారత రాజ్యాంగ సూత్రాలను,, ప్రభుత్వ చట్టాలను అమలు చేయవలసిన బాధ్యత ఈ అధికారులది..విస్మరిస్తే చివరికి లోకాయుక్త, న్యాయస్థానంలో పేరెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ సహకరిస్తుంది..*𝑭𝒐𝒓𝒎𝒐𝒓𝒆 𝑰𝒏𝒇𝒐𝒓𝒎𝒂𝒕𝒊𝒐𝒏 please 𝑱𝒐𝒊𝒏 𝑾𝒊𝒕𝒉 PAAP.Cell no’s: +916305313558,+918341217079,+918500284098, +9180085 66613, +9198495 75343.
విద్యాహక్కు చట్టం 2009….ప్రైవేట్ విద్యాసంస్థలు-ఫీజుల వివరాలు…
Related Posts
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ (92) కన్నుమూత
ప్రభాతదర్శిని, (న్యూఢిల్లీ ప్రతినిధి): మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ (92) కన్నుమూశారు. అస్వస్థతతో గురువారం సాయంత్రం దిల్లీ ఎయిమ్స్‌లో చేరిన ఆయనకు అత్యవసర విభాగంలో చికిత్స అందించారు. అయితే ఆరోగ్య పరిస్థితి విషమించి తుదిశ్వాస విడిచారు. ఈ మేరకు ఎయిమ్స్ ప్రకటన విడుదల చేసింది. పలువురు ప్రముఖులు ఎయిమ్స్‌కు చేరుకుంటున్నారు. మన్మోహన్ సింగ్ అక్టోబర్ 1991లో తొలిసారి రాజ్యసభలో అడుగుపెట్టారు. 1991 నుంచి 1996 వరకు పీవీ నరసింహా…
Read more“మానవత”చే భూరి విరాళం – ప్రత్యేక ప్రతిభావంతులకు సాయం
శ్రీ లక్ష్మీనరసింహ చారిటబుల్ ట్రస్ట్ సేవలు అభినందనీయంప్రభాతదర్శిని, (తిరుపతి-ప్రతినిధి): ప్రత్యేక ప్రతిభావంతులకు విశిష్ట సేవలు అందిస్తున్న శ్రీ లక్ష్మీ నరసింహ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు సైదమ్మ( శైలజ)కు తిరుపతి మానవత శాఖ, రిటైర్డ్ ఎస్సై సుధాకర్ బాబు చే ఒక నెలకు సరిపడే బియ్యం, పప్పు ధాన్యాలు, ముడి సరుకులను ఉచితంగా అందజేశారు. సోమవారం వికృతమాల సమీపం ఇందిరమ్మ ఇళ్ల వద్ద ఉన్న శ్రీ లక్ష్మీనరసింహ చారిటబుల్ ట్రస్ట్…
Read more