అవినీతి రహిత సమాజాన్ని నెలకొల్పుటకు ప్రభుత్వం పని చేస్తు

ఆధునిక సాంకేతికత అండగా గ్రామాలు,పట్టణాల సర్వతోముఖాభివృద్దికి తద్వారా అవినీతి రహిత సమాజాన్ని నెలకొల్పుటకు ప్రభుత్వం అకుంఠిత దీక్షతో పని చేస్తున్నదని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ పేర్కొన్నారు. 78వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా నెల్లూరు పోలీసు కవాతు మైదానంలో అంగరంగ వైభవంగా జరిగిన వేడుకల్లో మంత్రి నారాయణ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, జిల్లా కలెక్టర్ ఒ.ఆనంద్, జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ జాయింట్ కలెక్టర్ కార్తీక్, నెల్లూరు నగర పాలక సంస్థ కమిషనర్ సూర్య తేజ, కందుకూరు సబ్ కలెక్టర్ విద్యాధరి వెంట రాగా పోలీసు గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్బంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ పి.యం.కిసాన్ పథకం క్రింద అర్హులైన ఒక లక్ష 65 వేల 940 మంది రైతు కుటుంబాలకు 2 వేల రూపాయలు చొప్పున 17 వ విడత గా 3 కోట్ల 31 లక్షల రూపాయలు రైతుల ఖాతాల్లో జమచేసామన్నారు. అదేవిధంగా 2024 ఖరీఫ్ కాలo నకు 50 శాతం రాయితీపై 5 వేల 828 క్వింటాళ్ల పచ్చిరొట్ట విత్తనాలను 17 వేల 731 మంది రైతులకు పంపిణీ చేశామన్నారు. 2024-25 సంవత్సరములో 38,330 సి సి ఆర్ సి కార్డులు ఇవ్వాలని లక్ష్యo కాగా, ఇప్పటి వరకు 23,200 కార్డులు ఇవ్వడం జరిగిoదన్నారు. అదేవిధంగా జిల్లాలో ఉద్యాన పంటల అభివృద్దికి “సమీకృత ఉద్యాన అభివృద్ధి మిషన్ (MIDH)”, “రాష్ట్రీయ కృషి వికాస్ యోజన (R.K.V.Y.)” మరియు “నేషనల్ మిషన్ ఫర్ ఎడిబుల్ ఆయిల్- ఆయిల్ పామ్ (NMEO- OP) పథకము” ల క్రింద 2 కోట్ల 55 లక్షల రూపాయల రాయితీని 1,153 మంది రైతుల ఖాతాల్లో జమ చేసామన్నారు. కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ అవస్థాపన నిధి క్రింద జిల్లాలో 25 ప్రాధమిక వ్యవసాయ సహకార సంఘాల పరధిలో 49 బహుళ ప్రయోజన సౌకర్య గోదాములు మంజూరు కాగా 43 గోదాములు నిర్మాణము పూర్తి కాబడి సంఘాలకు అప్పగించామన్నారు. అదేవిధంగా 78 టి యం సి ల స్థూల నిల్వ సామర్థ్యం గల సోమశిల రిజర్వాయరు క్రింద 2023-24 ఖరీఫ్ పంటకు గాను 28.431 టి.యం.సి.ల నీటితో 3,41,967 ఎకరాల ఆయకట్టు సాగు చేయబడిందని, అలాగే నెల్లూరు నగరంలో 83 కోట్ల 70 లక్షల రూపాయల వ్యయంతో సర్వేపల్లి కాలువ రిటైనింగ్ వాల్స్ నిర్మాణ పనులు 40 శాతo పూర్తి చేసామన్నారు, జాఫర్ సాహెబ్ కాలువ గోడల నిర్మాణ పనులు 75 కోట్ల 3 లక్షల రూపాయల వ్యయంతో పురోగతిలో ఉన్నాయన్నారు. అదేవిధంగా 9 కోట్ల 40 లక్షల రూపాయల వ్యయంతో వెంకటాచలం మండలంలో సర్వేపల్లి రిజర్వాయరు శాశ్వత పునరుద్దీకరణ పనులు 60 శాతo పూర్తి చేసామన్నారు.అలాగే విడవలూరు మండలంలో ముదివర్తి పాలెం, ముదివర్తి మధ్యన పెన్నా నదిపై సబ్ మెర్సిబుల్ కాజ్ వే నిర్మాణ పనులు 81 కోట్ల 60 లక్షల రూపాయల వ్యయంతో పురోగతిలో ఉన్నాయన్నారు. అలాగే పెన్నా నదికి ఇరువైపులా కరకట్టల నిర్మాణ పనులు 81 కోట్ల 85 లక్షల రూపాయల వ్యయంతో పురోగతిలో ఉన్నాయన్నారు. ఆనం సంజీవరెడ్డి హై లెవల్ కెనాల్ ఫేజ్ 2 కింద జిల్లా లోని వెనుకబడిన మండలాల్లో 632 కోట్ల వ్యయంతో అదనపు ఆయకట్టును సాకులోకి తెచ్చుటకు కృషి చేయడం జరుగుతుందన్నారు. జిల్లాలో పారిశ్రామికీకరణలో భాగంగా గుడ్లూరు మండలంలో 850 ఎకరముల విస్తీర్ణంలో 3,700 కోట్ల రూపాయల వ్యయంతో రామాయపట్నం పోర్ట్ నిర్మాణం వేగవంతంగా జరుగుచున్నదని,ఈ పోర్ట్ వలన సుమారుగా 5 వేల మందికి ప్రత్యక్షంగాను, 15 వేల మందికి పరోక్షంగాను ఉద్యోగావకాశాలు లభిస్తాయన్నారు. అదేవిధంగా పోర్ట్ ఆధారిత, ఇతర పరిశ్రమల కూడలి స్థాపనకు 4,150 ఎకరాల విస్తీర్ణంలో 50 వేల కోట్ల రూపాయల పెట్టుబడితో పరిశ్రమలు స్థాపించి 50 వేల మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు కల్పించుటకు ఏర్పాట్లు చురుకుగా చేస్తున్నామన్నారు. బోగోలు మండలంలో జువ్వలదిన్నె గ్రామo వద్ద 288 కోట్ల 86 లక్షల రూపాయలతో ఫిషింగ్ హార్బర్ నిర్మాణ పనులు పురోగతిలో వున్నవని, ఈ హార్బర్ నిర్మాణం తో సుమారు 1,250 పడవలకు బెర్తింగ్ సదుపాయం కలుగుతుందని, ప్రత్యక్షంగా 4 వేల మంది మత్య్సకారులకు, పరోక్షంగా మరొక 6 వేల మందికి లబ్ధి చేకూరనుందన్నారు. జిల్లాలో 113 మినీ ఫిష్ వెండింగ్ యూనిట్లు స్థాపించబడి, గ్రామీణ, పట్టణ వినియోగదారులకు పౌష్టికాహారమైన మత్య్స ఉత్పత్తులు అందించబడుచున్నాయన్నారు. ఈ సంవత్సరoలో ఇప్పటివరకు 45.7 మెట్రిక్ టన్నుల పశు గ్రాస విత్తనాలు రైతులకు 75% సబ్సిడీ ద్వారా పంపిణీ చేసామని, అలాగే సెప్టెంబర్ నుండి డిసెంబర్, 2024 వరకు పశుగణన జిల్లాలోని అన్ని గ్రామాలు, వార్డులలో జరుగుతుందన్నారు. జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా 2024-25 ఆర్ధిక సంవత్సరంలో జిల్లాలో ఎన్ టి ఆర్ భరోసా పెన్షన్ పథకం క్రింద 3 లక్షల 13 వేల 784 మంది పెన్షన్ దారులకు నెలకు 132 కోట్ల 05 లక్షల రూపాయల పెన్షన్ నగదును ప్రతి నెల 1వ తేదీనే ప్రభుత్వ సిబ్బంది ద్వారా వారి ఇంటి వద్దనే అందచేస్తున్నామన్నారు. అలాగే బ్యాంకు లింకేజీ పథకం ద్వారా 25,732 సంఘాలకు రూ.1 వేయి 277 కోట్ల 13 లక్షల రూపాయలు లక్ష్యం కాగా, ఇప్పటి వరకు 3,104 సంఘాలకు 265 కోట్ల 29 లక్షల రూపాయలు ఋణ సదుపాయం కల్పించడం జరిగిందన్నారు. స్త్రీనిధి ద్వారా 34 వేల మంది సభ్యులకు 170 కోట్ల రూపాయలు లక్ష్యం కాగా ఇప్పటి వరకు 4 వేల 45 మంది సభ్యులకు 28 కోట్ల 26 లక్షల రూపాయలు ఋణ సహాయం అందించామన్నారు. అలాగే లఖ్ పతి దీదీ పథకo ద్వారా ఒక లక్ష 14 వేల 139 మంది స్వయం సహాయక సంఘాల్లోని సభ్యులకు అవసరమైన ఆర్ధిక చేయూతను అందించి వారికి సుస్థిరమైన జీవనోపాధులను కల్పించి వారిని లఖ్ పతి ధీధీ గా తయారు చేయడం లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. మెప్మా ద్వారా సున్నా వడ్డీ నాలుగవ విడతలో మొత్తం 10 వేల 428 స్వయం సహాయక సంఘములకు 16 కోట్ల 20 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగిందన్నారు. ఏ‌పి టిడ్కో పథకం క్రింద జిల్లాలోని 5,712 మంది గృహ లబ్దిదారులకు గృహాలను కేటాయించే క్రమoలో ఇప్పటివరకు 3,345 మంది గృహ లబ్దిదారులకు 101 కోట్ల 14 లక్షల రూపాయల గృహ రుణాలు మంజూరు చేయడం జరిగినదన్నారు. అలాగే ప్రధానమంత్రి ఆత్మనిర్భర్ నిధి క్రింద 12 వేల 342 మందికి ఒక్కొక్కరికి 10 వేల రూపాయల చొప్పున సుమారుగా 12 కోట్ల 34 లక్షల 20 వేల రూపాయలు బ్యాంకుల ద్వారా ఋణాలు మంజూరు చేయడం జరిగిందన్నారు. పొదుపు మహిళలకు ప్రధాన మంత్రి జీవన జ్యోతి భీమా యోజన క్రింద ఒక లక్ష 9 వేల 141 పాలసీలు మరియు ప్రధాన మంత్రి సురక్షా భీమా యోజన క్రింద ఒక లక్ష 36 వేల 391 పాలసీలను బ్యాంకులలో చేయించడమైనదన్నారు. నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలోని 7 అన్న కాంటీన్లను పునఃనిర్మించడం జరిగినదన్నారు. అదేవిధంగా సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ మార్గదర్శకాలతో స్వచ్చ భారత్, స్వచ్ఛ సర్వేక్షణ, స్వచ్ఛ సురక్ష, క్లీన్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమమును అమలుపర్చుటకు ప్రత్యేక ప్రణాళికలను ఏర్పాటు చేసుకొని, నగరపాలక సంస్థ వాహనాల ద్వారా ఇంటింటికి తిరిగి, వేరుచేసిన చేసిన చెత్తను సేకరించడం జరుగుతుందన్నారు. అలాగే సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తుగా గట్టి ప్రణాళికలతో యాంటీ లార్వికల్ కెమికల్స్ పిచికారి చేస్తూ, నీరు నిల్వవున్న ప్రాంతాల్లో ఆయిల్ బాల్స్ వేయుచూ, ఫాగింగ్ ప్రక్రియను చేపడుతూ నగరమును పరిశుభ్రమైన సుందర నగరoగా ఉంచుటకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. అదేవిధంగా 465 కోట్ల 60 లక్షల రూపాయలతో మన బడి- మన భాధ్యత ఫేజ్-II కార్యక్రమo ద్వారా జిల్లాలోని 1,356 పాఠశాలలు, అంగన్‌వాడీలకు అభివృద్ధి కి చర్యలు తీసుకుంటున్నామన్నారు. జిల్లాలో 2,579 పాఠశాలల్లో ఒక లక్ష 66 వేల 625 మంది విద్యార్థులకు 24 కోట్ల 97 లక్షల రూపాయలతో డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజన పథకాన్ని అమలు చేస్తున్నామన్నారు. జిల్లాలో గత మార్చి, 2024 పదవ తరగతి పబ్లిక్ పరీక్షల్లో 88.17 శాతం ఉత్తీర్ణత సాధించారన్నారు. ప్రభుత్వ బడుల్లో చదివే నిరుపేద విద్యార్ధులకు జిల్లాలో 1,472 పాఠశాలల్లో 35 కోట్ల రూపాయలతో 2,952 IFP లు (ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్) మరియు 2 కోట్ల 14 లక్షల రూపాయల 428 స్మార్ట్ టి.వి. లు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అందించబడినవన్నారు. జిల్లాలో బాలిక విద్యను ప్రోత్సహించేందుకు 12 కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. నేను బడికి పోతా కార్యక్రమo ద్వారా ఈ సంవత్సరం 1,800 మంది బడి ఈడు పిల్లల్ని వారి వయస్సుకు తగిన తరగతులలో నేరుగా పాఠశాలలోకి చేర్చామన్నారు. అదేవిధంగా డా.యన్.టి.ఆర్. వైద్య సేవా ట్రస్ట్ ద్వారా 51 వేల 607 మందికి వివిధ కార్పోరేట్ హాస్పిటల్స్ లో శస్త్ర చికిత్సలు చేసి, 114 కోట్ల 85 లక్షల రూపాయలు ఖర్చుచేయడం జరిగిందని, ప్రధానమంత్రి మాతృ వందన యోజన పథకం కింద అర్హులైన మొదటి కాన్పు గర్భిణీ స్త్రీలకు 14,716 మందికి, ఒక్కొక్కరికి 6 వేల రూపాయల చొప్పున వారి బ్యాంకు ఖాతాలకు 5 కోట్ల 84 లక్షల 8 వేల రూపాయలు జమచేయడం జరిగిందన్నారు. జిల్లా శిశు మరణాల రేటు, గర్భిణీ స్త్రీలలో రక్త హీనత తగ్గించడంలో రాష్ట్రంలోనే జిల్లా ప్రథమ స్థానంలో వున్నదన్నారు. 4,629 మంది టీబి వ్యాధిగ్రస్తులకు 1 కోటి 9 లక్షల 11 వేల రూపాయలు నేరుగా వారి బ్యాంకు ఖాతాలలో జమ చేసామన్నారు. అదేవిధంగా ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా ప్రజల సమస్యలకు సత్వర పరిష్కారానికి కృషి చేస్తున్నామని, అలాగే భూదస్త్రాల భద్రత విషయమై పభుత్వం త్వరలో పటిష్ట నిర్ణయం తీసుకుంటుందన్నారు. జిల్లాలోని 737 గ్రామాలలో రీసర్వే జరిగిన 328 గ్రామాలకు మండలాల వారీగా గ్రామ సభలు నిర్వహించి, రీసర్వే మీద వచ్చిన అభ్యంతరాలను పరిష్కరించి, రైతులందరికీ సత్వరమే న్యాయo చేసి సర్వే భూమి రికార్డులు తయారు చేయడo జరుగుతుందన్నారు. పల్లెల్లో సంపూర్ణ పారిశుధ్యమే లక్ష్యంగా పల్లె సీమలే దేశానికి పట్టుకొమ్మలు అనే నినాదంతో CLAP – క్లీన్ ఆంధ్ర ప్రదేశ్ లో భాగంగా ప్రతి గ్రామ పంచాయతీలో ఘన, ద్రవ వ్యర్ధాల నిర్వహణ. ప్లాస్టిక్ వద్దు నార సంచులే ముద్దు లక్ష్యంగా స్వచ్ఛ సంకల్పం అన్ని గ్రామ పంచాయతీలలో అమలు చేస్తున్నామన్నారు. చెత్త నుండి సంపద తయారీ కేంద్రాల ద్వారా తయారైన వర్మీకంపోస్టును అమ్మకం ద్వారా గ్రామ పంచాయతీలను స్వయం సమృద్ధి దిశగా అడుగులు వేయిస్తున్నామన్నారు. PR-ONE యాప్ ద్వారా జిల్లాలోని అన్ని గ్రామపంచాయతీలలో త్రాగునీరు మరియు పారిశుధ్యంపై ఎండ్ టు ఎండ్ మానిటరింగ్ వ్యవస్థ ఏర్పాటు చేసామన్నారు. 15వ ఆర్ధిక సంఘ నిధుల ద్వారా సర్పంచ్ గౌరవ వేతనo, తలసరి గ్రాంటు, వృత్తి పన్ను, సీనరీజ్ గ్రాంట్ క్రింద 54 కోట్ల 49 లక్షల రూపాయలు జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీలకు పంపిణీ చేసామన్నారు. 15వ ఆర్ధిక సంఘ నిధుల నుండి 8 కోట్ల 35 లక్షల రూపాయల అంచనా వ్యయoతో జిల్లాలోని 21 సమగ్ర రక్షిత మంచినీటి సరఫరా స్కీముల నిర్వహణ మరియు 6 కోట్ల 87 లక్షల రూపాయలతో రహదారులు, భవనాలకు సంబంధించిన 139 పనులు చేపట్టామన్నారు. సంసద్ ఆదర్శ్ గ్రామ యోజన (SAGY) పథకo క్రింద 10 గ్రామాలను ఎంపిక చేసుకొని 5 సంవత్సరాలలో ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దుటకు శ్రీకారం చుట్టామన్నారు. జిల్లా పరిషత్ సాధారణ నిధులు క్రింద 259 పనులు 9 కోట్ల 28 లక్షల రూపాయల అంచనాలతో మౌలిక సదుపాయాలు కల్పించడం జరుగుతున్నది. జిల్లాలో ఇప్పటివరకు 544 గ్రామ సచివాలయ భవనములు 218 కోట్ల రూపాయలతో, 541 రైతు భరోసా కేంద్రాలు 118 కోట్ల రూపాయలతో, 455 గ్రామ ఆరోగ్య కేంద్రాలు 80 కోట్ల రూపాయలతో, 86 పాల శీతలీకరణ కేంద్రాలు 15 కోట్ల రూపాయలతో మరియు 211 డిజిటల్ లైబ్రరీస్ 33.76 కోట్ల రూపాయలతో మంజూరు కాబడి ఇప్పటివరకు 318 గ్రామ సచివాలయ భవనములు, 259 రైతు భరోసా కేంద్రాలు, 154 ఆరోగ్య కేంద్రాలు, 9 పాల శీతలీకరణ కేంద్రాలు మరియు 07 డిజిటల్ లైబ్రరీస్ పూర్తి చేసామని మిగిలినవి వివిధ దశలలో పురోగతిలో ఉన్నాయన్నారు. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ రహదారుల పథకం క్రింద 196 రోడ్లను నిర్మించుటకు 316 కోట్ల 10 లక్షల రూపాయలు మంజూరు కాగా, 158 రోడ్లు పూర్తి అయ్యాయని మిగిలిన పనులు పురోగతిలో ఉన్నాయన్నారు. అదేవిధంగా జిల్లాలో జల్ జీవన్ మిషన్ పధకo క్రింద గ్రామీణ ప్రాంతాలలో ఇంటింటికి త్రాగు నీటిని కుళాయిల ద్వారా అందించుటకు 3 వేల 60 పనులకు సంబంధించి 597 కోట్ల 82 లక్షల రూపాయలు అంచనా విలువ గల పనులు మంజూరయ్యాయని, అందులో 870 పూర్తికాబడి, 729 పనులు పురోగతిలో ఉన్నాయని, ఇప్పటి వరకు 3 లక్షల 97 వేల 997 గృహములకు కుళాయిలు సుమారు 95 కోట్ల 13 లక్షల రూపాయలు వ్యయంతో ఏర్పాటు చేశామన్నారు. అదేవిధంగా జిల్లాలో ఇప్పటివరకు 2,934 అంగన్వాడీ కేంద్రముల ద్వారా 2 కోట్ల 15 లక్షల 23 వేల 700 రూపాయలతో 25 వేల 322 మంది గర్భవతులు, బాలింతలు మరియు 1 కోటి 28 లక్షల 11 వేల 750 రూపాయలతో 36, 605 మంది పిల్లలు లబ్ది పొందటం జరిగిందన్నారు. అలాగే బాలామృతం ద్వారా 40,407 మంది 6 నెలల నుండి 3 సంవత్సరముల లోపు పిల్లలు లబ్ది పొందుచున్నారన్నారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా శిక్షణ పొంది ఇప్పటి వరకు 3 వేల 183 మంది ఉపాధిని పొందారన్నారు. జిల్లాలో 42 భారీ పరిశ్రమలు 40,784 కోట్ల రూపాయల పెట్టుబడితో 19, 056 మందికి ఉపాధి కల్పనతో స్థాపించబడినవని అలాగే 18,167 సూక్ష్మ మరియు చిన్న తరహా పరిశ్రమలు 20,269 కోట్ల రూపాయల పెట్టుబడితో ఒక లక్ష 93 వేల 994 మందికి ఉపాధి కల్పనతో స్థాపించబడినవన్నారు. ఆత్మకూరు నియోజకవర్గంలో నారంపేట వద్ద 175.65 ఎకరాలలో MSME Park అభివృద్ది పరచి ఔత్సాహిక పారిశ్రామికవేత్తల కొరకు 185 ప్లాట్లు అందుబాటులోకి తీసుకురావడం జరిగిందన్నారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా 3 లక్షల 33వేల కుటుంబాలకు జాబ్ కార్డులు ఇవ్వడం జరిగినదని, ఈ సంవత్సరoలో కోటి 19 లక్షల పని దినములు కల్పించుట లక్ష్యo కాగా, ఇప్పటి వరకు 40 లక్షల 10 వేల పని దినములు కల్పించి 146 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగినదన్నారు. నెల్లూరు సామాజిక అటవీ విభాగము ద్వారా నర్సరీలందు 7 లక్షల 15 వేల 500 మొక్కలు పెంచి, ఇప్పటివరకు 3 లక్షల 47 వేల 140 మొక్కలు పంచగా, ఇప్పటివరకు 2 లక్షల 45 వేల 90 మొక్కలు నాటుట జరిగినదని, ప్రస్తుతo భారత ప్రధాన మంత్రి పిలుపు మేరకు అమ్మ పేరు మీద ఒక మొక్క నాటుట కార్యక్రమo ద్వారా మొక్కలు అందజేయడము జరుగుచున్నదన్నారు. ఈ సంవత్సరానికి 120 హెక్టార్లలో మొక్కలు నాటడం లక్ష్యము కాగా, లక్ష్యాన్ని చేరుకోవడం జరిగిందని, 2 వేల 585 హెక్టార్లలో అటవీ సంరక్షణ అభివృద్ది కొరకు 4 కోట్ల 70 వేల రూపాయలు ఖర్చు చేయడం జరిగిందన్నారు. ఆకట్టుకున్న శకటాల ప్రదర్శన: పోలీసు కవాతు మైదానంలో ప్రదర్శించిన ప్రభుత్వ శాఖల శకటాలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. జిల్లా గ్రామీణాభివృద్ధిశాఖ, డ్వామా, ఐసిడిఎస్‌, వైద్యారోగ్యశాఖ, అటవీశాఖ, వ్యవసాయం అనుబంధశాఖలు, విద్యాశాఖ, సమగ్రశిక్ష, సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ శాఖలు చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను క్లుప్తంగా వివరించేలా రూపొందించిన శకటాలు అందరినీ ఆకట్టుకున్నాయి. అందరినీ ఆకట్టుకున్న జిల్లా గ్రామీణాభివృద్ధిశాఖ శకటానికి ప్రథమ బహుమతి, అటవీశాఖకు ద్వితీయ బహుమతి, ఐసిడిఎస్‌ శకటానికి తృతీయ బహుమతులు లభించాయి. ఆయా శాఖల అధికారులకు మంత్రి నారాయణ, కలెక్టర్ ఆనంద్ జ్ఞాపికలను అందజేశారు.
దేశభక్తి ఉప్పొంగేలా సాంస్కృతిక ప్రదర్శనలు:విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు దేశభక్తి ఉప్పొంగేలా సాగాయి. దర్గామిట్ట జిల్లా పరిషత్‌ హైస్కూల్‌, గొలగమూడిలోని గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల, సంతపేటలోని నారాయణ ఇంగ్లీషుమీడియం హైస్కూలు, చంద్రశేఖరపురం ఏకలవ్య మోడల్‌ గురుకుల పాఠశాల, బుజబుజనెల్లూరు శేషు ఇంగ్లీషుమీడియం హైస్కూలు విద్యార్థులు ప్రదర్శించిన దేశభక్తి గీతాల నృత్యప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. స్వాతంత్య్ర సంగ్రామంలో అశువులు బాసిన మహనీయుల త్యాగనిరతి, గొప్పతనం, దేశభక్తి ఉట్టిపడేలా కళ్లకు కట్టినట్టు ప్రదర్శించారు. విద్యార్థిని,విద్యార్థులందరికీ మెమెంటోలను అందించి అభినందించారు.
స్టాళ్లను సందర్శించిన మంత్రి, కలెక్టర్‌:స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా పోలీసు కవాతు మైదానంలో వివిధ ప్రభుత్వశాఖలు ఏర్పాటుచేసిన స్టాళ్లను మంత్రి నారాయణ, కలెక్టర్‌ ఆనంద్‌, జేసీ కార్తీక్‌, మున్సిపల్‌ కమిషనర్‌ సూర్యతేజ, జిల్లాస్థాయి అధికారులు పరిశీలించారు. జిల్లా పంచాయతీశాఖ, ఐసిడిఎస్‌, వ్యవసాయం, ఉద్యానవనశాఖ, మెప్మా, పాఠశాల విద్య, సమగ్రశిక్ష, వైద్యారోగ్యశాఖ, విభిన్న ప్రతిభావంతులశాఖ, రాష్ట్ర విపత్తు స్పందన, అగ్నిమాపకశాఖ, జిల్లా పరిశ్రమల శాఖలు తమ శాఖల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు వివరించేలా ఏర్పాటుచేసిన స్టాళ్లు అందరిని ఆకట్టుకున్నాయి. ఆయశాఖల ఆధ్వర్యంలో చేపడుతున్న కార్యక్రమాలను అధికారులు మంత్రి, కలెక్టర్‌ లకు వివరించారు. విద్యాశాఖ ఏర్పాటుచేసిన సెల్ఫీబూత్‌లో మంత్రి, కలెక్టర్‌, అధికారులు సెల్ఫీలు దిగారు. మెప్మా ఆధ్వర్యంలో పొదుపు మహిళలకు రూ.82.8 కోట్ల చెక్కు పంపిణీ:మెప్మా ఆధ్వర్యంలో 686 పొదుపు సంఘాలకు రూ.82.8 కోట్ల బ్యాంకు లింకేజీ రుణాల చెక్కును మెప్మా ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన స్టాల్‌లో మంత్రి నారాయణ, కలెక్టర్‌ ఆనంద్‌ అందజేశారు. అలాగే విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో సుమారు రూ.5 లక్షల విలువైన ల్యాప్‌ట్యాప్‌లు, చెవిటిమిషన్లు, కాలిబర్స్‌, సెల్‌ఫోను, డిజిప్లేయర్స్‌ను లబ్ధిదారులకు అందించారు.
విశిష్ట సేవలందించిన వారికి ప్రశంసాపత్రాలు పంపిణీ:స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉత్తమ సేవలందించిన అధికారులు, సిబ్బందికి, వివిధ రంగాల్లో ప్రతిభచూపిన కళాకారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులకు మంత్రి నారాయణ, జిల్లా కలెక్టర్‌ ఆనంద్‌ చేతుల మీదుగా ప్రశంసా పత్రాలను అందజేశారు.ఈ వేడుకలకు జెడ్పి చైర్ పర్సన్ అనం అరుణమ్మ, నెల్లూరు నగరపాలక సంస్థ మేయర్ స్రవంతి, పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, శాసన సభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, సోమిరెడ్డి చంద్ర మోహన్ రెడ్డి, ముఖ్య అతిధులు గా హాజరయ్యారు.